Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడిని మొక్కి ఇందు వెనక్కి తిరిగేసరికి రేఖ కనిపిస్తుంది. దాంతో ఇందు షాక్ అవుతుంది. భూషణ్‌కి కాల్ చేసి ఇందు దొరికిందని చెబుతుంది రేఖ. దాంతో లక్కీకి భూషణ్ డబ్బు ఇస్తాడు. 20 లక్షలు తీసుకుని లక్కీ వెళ్తాడు. ఇందు చేయి పట్టుకుని రేఖ తీసుకెళ్లిపోతుంది. ఇందు వెళ్లడం చూసి రాజ్ బాధగా ఫీల్ అవుతాడు.
ఎమోషనల్‌గా రాజ్, ఇందు

రాజ్ అలా చూడటాన్ని లక్కీ చూస్తాడు. రాజ్ కోసం ఇందు వెనక్కి తిరుగుతుంది. అక్కడ రాజ్‌ను చూస్తుంది ఇందు. రాజ్, ఇందు ఇద్దరు ఎమోషనల్‌గా చూసుకుంటారు. రాజ్‌ను చూస్తూ ఆగి ఆగి కారు ఎక్కి వెళ్లిపోతుంది ఇందు. రాజ్ దిగాలుగా కూర్చొంటాడు. లక్కీ వచ్చి డబ్బులు అందినట్లు చెబుతాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా. అందుకే అంతలా ఫీల్ అవుతున్నావా అని లక్కీ నిలదీస్తాడు.
ప్రేమా తొక్కా.. డబ్బులు వచ్చాయా లేదా అంతే.. అని రాజ్ అంటాడు. మన వాటా పది, నా ఫిగర్ వాటా పది అని లెక్కలేస్తాడు లక్కీ. డబ్బు లెక్కేసిన రాజ్ ఇందు చూసిన చూపుల గురించి, దానికి అర్థమేంటో అర్థం కావడంలేదని చెబుతాడు. రాత్రి మిగిలిపోయిన కూరలు ఉన్నాయి, అవి తినేసేయండి అని చూసినట్లు ఉందిరా అని లక్కీ అంటాడు. సాహుకు డబ్బు ఇచ్చేయ్, ఐశ్వర్యకు నేను ఇస్తాను అని రాజ్ అంటాడు.
ఇంట్లోకి లాక్కొచ్చి ఇందును పడేస్తుంది రేఖ. ఇందును అపర్ణ, స్వాతి లేపుతారు. తనకేమైనా గాయం అయి ఉంటే అని అపర్ణ కోప్పడుతుంది. మరి నాకు అయిన గాయం గురించి ఏంటీ అని రేఖ అంటుంది. కిడ్నాపర్‌కు ఇచ్చే డబ్బు కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారు అని భూషణ్ అంటాడు. ఇందు వాలకం చూస్తుంటే కిడ్నాప్ అయినట్లు లేదు పిక్‌నిక్‌కు వెళ్లినట్లు ఉందని కనిపెడతాడు శేషు.
రేఖ ఆర్డర్
మీరు అనుకున్నట్లుగా ఇందును ప్రాణాలతో తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నా. రేపు ఆస్తి పేపర్స్‌పై ఇందుతో సంతకాలు పూర్తవ్వాలి. ఈ విషయంలో తేడా వస్తే ఊరుకోను. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే మానుకోండని అపర్ణకు ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది రేఖ. ఏంటమ్మా మాకు ఆ అగ్ని పరీక్ష. కిడ్నాప్ చేసింది ఎవరని సుభాష్ అడుగుతారు. వాళ్లు ఎవరో తెలియదు, డబ్బు కోసం చేసి ఉంటారని అబద్ధం చెబుతుంది ఇందు.
{{/usCountry}}మీరు అనుకున్నట్లుగా ఇందును ప్రాణాలతో తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నా. రేపు ఆస్తి పేపర్స్‌పై ఇందుతో సంతకాలు పూర్తవ్వాలి. ఈ విషయంలో తేడా వస్తే ఊరుకోను. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే మానుకోండని అపర్ణకు ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది రేఖ. ఏంటమ్మా మాకు ఆ అగ్ని పరీక్ష. కిడ్నాప్ చేసింది ఎవరని సుభాష్ అడుగుతారు. వాళ్లు ఎవరో తెలియదు, డబ్బు కోసం చేసి ఉంటారని అబద్ధం చెబుతుంది ఇందు.
{{/usCountry}}ఇందు వచ్చినందుకు అపర్ణ సంతోషిస్తుంది. నువ్వు లేవని తెలిసిన రోజు మా ప్రాణాలు పోతాయ్ అని అపర్ణ అనడంతో ఇందు హగ్ చేసుకుంటుంది. మరోవైపు హాస్పిటల్‌లో రాజ్ ఐసీయూలో ఉన్న పేషంట్‌ను చూస్తాడు. డాక్టర్ వచ్చి మాట్లాడుతాడు. తను కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని రాజ్ చెబుతాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ, తనలో చలనం లేదు. బిల్స్ కట్టారా అని డాక్టర్ అంటాడు.
బిల్స్ అన్ని క్లియర్ చేశానని రాజ్ చెబుతాడు. మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ, ప్రతివారం.. కనీసం తను బతికి ఉండాలంటే మెడిసిన్ ఇవ్వాల్సిందే. టైమ్‌కి డబ్బులు కట్టాలి. ఏమాత్రం ట్రీట్‌మెంట్ ఆగిన ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ అంటాడు. డబ్బులు నేను ఎలాగైనా కడతాను. ట్రీట్‌మెంట్ మాత్రం ఆగకూడదు. తనకు ఏదైనా అయితే నా ప్రాణం పోయినట్టే అని రాజు చేతులెత్తి మొక్కుతాడు. రాజ్ ట్రీట్‌మెంట్ చేయించడం చూస్తుంటే అతనికి సీక్రెట్‌గా ఎవరికి తెలియని ఏదో గతం ఉన్నట్లు, ఆ అమ్మాయి లవర్ అని తెలుస్తోంది.
రాజ్‌ను చూసిన శ్రుతి
మరోవైపు నుంచి రాజ్ కంపెనీలో పని చేసే శ్రుతి నర్స్‌తో మాట్లాడుతూ వస్తుంది. అక్కడ రాజ్‌ను సైడ్ నుంచి చూస్తుంది. రాజ్‌ను చూసిన శ్రుతి షాక్ అవుతుంది. రాజ్ సర్‌లా ఉన్నాడేంటీ అని తనకోసం వస్తుంది. కానీ, అంతలోనే రాజ్ బైక్‌పై వెళ్తాడు. ఇంటికెళ్తాడు రాజ్. చలపతి అన్నం తింటూ బిజినెస్ గురించి అడుగుతాడు. సాహుతో అంతా క్లియర్ అయిపోయిందని రాజ్ చెబుతాడు.
అసలు వాడు నీతో బిజినెస్ చేస్తున్నాడా, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, చూస్తే వాడు రౌడీలా ఉన్నాడు అని చలపతి అనుమానంగా అంటాడు. అదేం లేదు. వాడితో బిజినెస్ అయింది. కానీ, మొదటిసారి కాబట్టి ఏం రాలేదని రాజ్ అంటాడు. లాభం రాలేదు, నష్టం రాలేదు అంతేనా. నీ కొడుకు చేసిన పెద్ద బిజినెస్ ఇది అని చలపతి అంటాడు. బుద్ధిగా జాబ్ చేసుకో. నెల నెల జీతం వస్తుందని చలపతి సలహా ఇస్తాడు.
ఇందును పెళ్లి చేసుకోవడం గురించి లక్ష్మీ అడిగితే.. ఆ తెలివైన అమ్మాయి వీడిని ఎలా చేసుకోడానికి ఒప్పుకుంటుందని చలపతి అంటాడు. అసలు మీ సమస్య ఏంటీ. ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వరా అని కోప్పడుతాడు రాజ్. ఇంతలో లక్కీ కాల్ చేసి అర్జంట్‌గా మాట్లాడాలని సీరియస్‌గా మాట్లాడుతాడు లక్కీ. దాంతో రాజ్ వెళ్తాడు. శ్రుతి ఆటోలో వెతుక్కుంటూ రాజ్ ఇంటికి వస్తుంది. రాజ్‌తో మాట్లాడాలని శ్రుతి అంటుంది.
రాజు గురించి చెప్పిన శ్రుతి
మా నాన్న ఇంట్లో ఉన్నారు, వెళ్లి మాట్లాడండి అని రాజ్ కంగారుగా వెళ్లిపోతాడు. దాంతో శ్రుతి ఇంట్లోకి వెళ్తుంది. రాజ్ గురించి శ్రుతి అడిగితే.. తను మా కొడుకు అని చెబుతారు. మీరు అబద్ధం చెబుతున్నారు. తను మీ కన్న కొడుకు కాదు అని శ్రుతి అంటుంది. దాంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. స్వరాజ్ గ్రూప్ కంపెనీ ఎండీ, మా బాస్ రాజ్‌లాగే ఉన్నారు. నిజం చెప్పండని శ్రుతి అంటుంది.
దానికి మరింత షాక్ అయిన చలపతి, లక్ష్మీ వాడి గురించి నిజం చెబితే వాడు ఎవరో తెలిసే అవకాశం ఉందని ఆలోచిస్తారు. మీరు అన్నది నిజమే. వాడు మా కన్నకొడుకు కాదు అని శ్రీశైలంలో దొరికింది చెబుతాడు చలపతి. నా అనుమానమే నిజమైందని, ఆ ఇంటి రక్తమే. తను దుగ్గిరాల ఇంటి వారసుడని, దుగ్గిరాల ఇంటి రక్తమని శ్రుతి నిజం బయటపెడుతుంది. అలా రాజు దుగ్గిరాల ఇంటి వారసుడనే విషయం బయటకొస్తుంది.
మరోవైపు రేఖకు ఆస్తి పేపర్స్‌పై ఇందు వేలిముద్ర వేస్తుంది. అపర్ణ వద్దని ఎంత వారించినా ఇందు వేస్తుంది. ఇందు సంతకం పెట్టడంతో రేఖ సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.