Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కత్తితో రాజ్ బెదిరించడంతో భ్రమరాంబ దిగుతుంది. కానీ, రాజ్ చేయి పట్టుకుని కత్తి లాగేసుకుంటుంది. రాజ్ కారు దిగుతాడు. నువ్వే పారిపో. ఈ భ్రమరాంబకు సిచ్యువేషన్ వస్తే లేడి సూపర్ స్టార్‌లా ఫైట్ చేస్తా అని బెదిరిస్తుంది. దాంతో భ్రమరాంబను లాగిపెట్టి కొడతాడు రాజు.
పారిపోయిన భ్రమరాంబ

ఇందు కూడా కారు దికి పిన్ని కాపాడూ అంటూ తెగ యాక్టింగ్ చేస్తుంది. కత్తితో పొడుస్తూ అని రాజు బెదిరించడంతో వాడు ఇద్దరికి పాడే కట్టేసేలా ఉన్నాడని ఇందును భ్రమరాంబ కారులో కూర్చోపెడుతుంది. భ్రమరాంబను పారిపో అంటే వెళ్లిపోతుంది. రాజు, ఇందు ఇద్దరు ప్లాన్ సక్సెస్ అని అనుకుని కారులో వెళ్తారు. మరోవైపు మదన్‌ను పెళ్లికొడుకులా రెడీ చేసిన రేఖ మురిసిపోతుంది. కానీ, మదన్ డల్‌గా ఉంటాడు.
కేవలం ఆస్తి కోసమే ఇందు మెడలో తాళి కట్టు. ఆ తర్వాత నీకు నచ్చినట్లు ఉండు. అడిగినంత డబ్బు ఇస్తాను. ఈ ఒక్కసారికి సంతోషంగా ఉండు అని రేఖ అంటుంది. ఇంతలో స్వాతి వస్తే నేను ఎలా ఉన్నాను అని మదన్ అడుగుతాడు. నువ్వు చాలా బాగుంటావ్ బావ అని స్వాతి అంటుంది. థ్యాంక్స్. కానీ, ఆ చదువు రాని మొద్దును పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని మదన్ అంటాడు. మరి అంత ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవడం అని స్వాతి అంటుంది.
అమ్మ కోసం అని మదన్ అంటాడు. ఇంతలో భ్రమరాంబ అరుస్తూ వచ్చి ఇందును ఎవరో ఎత్తుకెళ్లిపోయారని చెబుతుంది. ఏంటీ కిడ్నాపా. మన ఇంట్లో కిడ్నాప్ సిరీస్ నడుస్తోందా. సీజన్ 1, సీజన్ 2 ఆ అని శేషు అంటాడు. ఇందునే శేషు అనుమానిస్తాడు. అపర్ణ గౌరీ పూజ గురించి చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్న రేఖ చప్పట్లు కొట్టి ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే అని అంటుంది. నీ మనవరాలు ఎక్కడుంది చెప్పు అని అపర్ణను అడుగుతుంది రేఖ.
అపర్ణ తలకు గన్
మాకు తెలియదని అపర్ణ, సుభాష్ అంటారు. ఇంట్లోకి వెళ్లిన రేఖ గన్ తీసుకొస్తుంది. అపర్ణ తలకు గన్ గురిపెడుతుంది రేఖ. అంతా అవాక్కవుతారు. మమ్మీ ఏంటిది, వదిలేయ్ మమ్మీ అని మదన్ అంటాడు. నీకు తెలియదు. నువ్వు ఆగురా. నీ మనవరాలు ఎక్కడుందో చెప్పు. షూట్ చేసి పారేస్తాను అని రేఖ అంటుంది. అయితే, షూట్ చేయు అని అపర్ణ తెగిస్తుంది.
{{/usCountry}}మాకు తెలియదని అపర్ణ, సుభాష్ అంటారు. ఇంట్లోకి వెళ్లిన రేఖ గన్ తీసుకొస్తుంది. అపర్ణ తలకు గన్ గురిపెడుతుంది రేఖ. అంతా అవాక్కవుతారు. మమ్మీ ఏంటిది, వదిలేయ్ మమ్మీ అని మదన్ అంటాడు. నీకు తెలియదు. నువ్వు ఆగురా. నీ మనవరాలు ఎక్కడుందో చెప్పు. షూట్ చేసి పారేస్తాను అని రేఖ అంటుంది. అయితే, షూట్ చేయు అని అపర్ణ తెగిస్తుంది.
{{/usCountry}}మనం బతుకుతుంది ఓ బ్రతుకేనా. నా మనవరాలు హ్యాపీగా బతుకుతుందంటే నేను చావడానికైనా రెడీనే అని అపర్ణ అంటుంది. అయితే, చావు అని గన్ లోడ్ చేస్తుంది. ఇంతలో ఆగండి అని రాజు అంటాడు. రాజు, ఇందు పెళ్లి చేసుకుని వస్తారు. అంతా షాక్ అవుతారు. లోపలికి వచ్చిన రాజు అందరికి నమస్కారం పెడతాడు. రాజును చూసిన అపర్ణ ఏవండి మన కొడుకండి అని మురిసిపోతుంది.
నాన్న రాజ్.. నాన్న రాజ్.. ఏవండి మన కొడుకు అండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ. ఆంటీ వాడు మీ కొడుకు కాదు. వాడికి ఈ ఇంటికి సంబంధం లేదు. సెంటిమెంట్ డైలాగ్స్ ఆపండి అని రేఖ వారిస్తుంది. ఏయ్ ఏంటే ఇది అని ఇందుపై కోపంతో చేయి ఎత్తుతుంది రేఖ. రేఖ చేయి పట్టుకుని ఎదురుతిరుగుతాడు రాజు. మరి అంత స్పీడ్ అయిపోకండి. ఇంతకుముందు ఇందు మీ ఇంటి మనిషి. కానీ, ఇప్పుడు ఇందు నా మనిషి, నా భార్య అని ఇందు భుజంపై చేయి వేసి అంటాడు రాజు.
బాడీ షేక్ అయిపోతుంది
తనపై చేయి వేసిన, తక్కువ చేసి చూసిన నేను ఊరుకోను. రఫ్.. రఫ్పాడిస్తాను అని రేఖతో సహా అందరికి వార్నింగ్ ఇస్తాడు రాజు. దెబ్బకు బాడీ షేక్ అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది అత్తయ్య అని రాజు అంటాడు. అత్తే కదా అని రాజు అడిగితే.. నాకు అత్తయ్య అని ఇందు అంటుంది. రేఖను పిన్ని అని వరుసలు కలుపుతాడు రాజు. ఏంటీ నాటకం అని రేఖ అంటే.. నిజంగానే ఈ తాళి మెడలో కట్టాడని ఇందు చెబుతుంది.
అపర్ణ, సుభాష్ సంతోషిస్తారు. నువు అనుకున్నట్లే మదన్‌తో ఈ పెళ్లి ఆగిపోయిందని భ్రమరాంబతో శేషు అంటాడు. భ్రమరాంబ అవును అని సంతోషిస్తుంది. ఇందును వీడు పెళ్లి చేసుకోవడం ఏంటీ, కిడ్నాప్ చేసిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఇందు ఏదో నాటకం ఆడుతుందని ఐశ్వర్య డౌట్ పడుతుంది. శేషు పేరు అడిగితే.. రాజు చెబుతాడు. ఏ రాజ్యానికి బాబు అని శేషు అంటే.. ఇంతకుముందు మా ఇంటికి, ఇప్పుడు ఈ కోటకి రాజు అని రాజు అంటాడు.
అసలు నీకు ఇందు ఎలా తెలుసు అని రేఖ అంటే.. నేను కూడా మీకు తెలుసు అని రాజు అంటాడు. దాంతో రాజు ఇంటికొచ్చింది గుర్తు చేసుకున్న రేఖ.. నువ్వు ఒక్కరోజు మా ఇంటికి వస్తే ఇందును పెళ్లి చేసుకుంటావా అంటుంది. అసలు మా ఇందు బయటకే వెళ్లదు. మొన్న ఒక్క వారం మాత్రం కిడ్నాప్ అయిందని శేషు అంటాడు. మావయ్య ఆ కిడ్నాపర్‌ను నేనే అని రాజు నిజం చెప్పేస్తాడు. రేఖకు దిమ్మతిరిగిపోతుంది.
ఆ కిడ్నాపర్ నేనే
అంటే, ఆ 20 లక్షలు అని భ్రమరాంబ అంటే.. నేనే తీసుకున్నా అని రాజు అంటాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని రేఖ అంటే.. మా పెళ్లి అయిపోయింది. నువ్వు ఒప్పుకునేదేంటని రాజు అంటాడు. ఈ తాళి తీస్తా అని రేఖ ఇందు తాళి తీయబోతే చేయి పట్టుకుని రాజు ఆపుతాడు. అలా దుగ్గిరాల ఇంటికి అల్లుడిగా రాజు అడుగుపెట్టి అందరిని షేక్ చేస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.