...
...
Next Story

బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్: రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన కావ్య, రాజ్- కుయిలి హత్య- రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌లో పార్టీలో కుయిలితో గోల్డ్ బాబు డ్యాన్స్ చేస్తాడు. రాహుల్‌ను పక్కన పెట్టడంతో పీకల్లోతూ తాగుతాడు. రాజ్, కావ్య కూడా డ్యాన్స్ చేయడంతో కుయిలికి అనుమానం వస్తుంది. కుయిలి బాగోతం బయటపెట్టి రాహుల్‌ను ఇంటికి తీసుకెళ్తారు. కానీ, పోలీసులు వచ్చి రాహుల్‌ను అరెస్ట్ చేస్తారు.

Published on: Nov 6, 2025, 07:34:44 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి పార్టీ అరెంజ్ చేస్తుంది. గోల్డ్ బాబు, కుయిలి నాటీ అంటూ మాట్లాడుకుంటారు. పార్టీ సెటప్ అంతా బాగుంది. కానీ, ఒక్కటే తక్కువైంది. పార్టనర్. పార్టనర్ లేకుండా పార్టీ ఎలా ఎంజాయ్ చేసేది అని గోల్డ్ బాబు అంటాడు. దాంతో నేను ఉన్నాగా అని రాహుల్ ముందే గోల్డ్ బాబుతో డ్యాన్స్ చేస్తుంది కుయిలి.

గోల్డ్ బాబు గర్ల్‌ఫ్రెండ్‌లా

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 6 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 6 ఎపిసోడ్

గోల్డ్ బాబుతో కుయిలి డ్యాన్స్ చేయడం రాహుల్‌కు నచ్చదు. విసుక్కుంటాడు. రాజ్, కావ్య మరింత ఎక్కిస్తారు. కుయిలి చూడటానికి గోల్డ్ బాబు గర్ల్‌ఫ్రెండ్‌లా ఉందని, రాహుల్ పానకంలో పుడకంలా ఉన్నాడని అంటారు. దాంతో కోపంతా గోల్డ్ బాబును పక్కన పెట్టి కుయిలితో రాహుల్ బలవంతంగా డ్యాన్స్ చేస్తాడు. చిరాకు పడతూనే కుయిలి డ్యాన్స్ చేస్తుంది.

గోల్డ్ బాబు డోస్ పెంచి నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది, నేను వెళ్లిపోతానంటూ గొడవ చేస్తాడు. మందు అయిపోయిందని కుయిలితో పెగ్ కలిపిస్తాడు. నాతో డ్యాన్స్ చేసేవాళ్లు లేరు అని గోల్డ్ బాబు అనడంతో నేనున్నాగా.. ఈ రాత్రంతా నీతోనే డ్యాన్స్ చేస్తానంటుంది కుయిలి. మరి నేను అని రాహుల్ అంటే పక్కకు తోసేస్తుంది కుయిలి. దాంతో రాజ్, కావ్య కుయిలి గురించి చెబుతారు.

మా అక్క ఏరోజు అయిన ఇలా ఇంకొకరి ముందు అవమానించిందా అని స్వప్న అంటే.. నీకన్నా కోటీశ్వరుడు దొరికేసరికి కుయిలి ప్లేట్ మార్చింది. కుయిలి నిజంగా కోటీశ్వరరాలు అయితే వాడి డబ్బులు ఇన్వెస్ట్ చేయించడానికి ఇదంతా ఎందుకు చేస్తుందని రాజ్ అంటాడు. దాంతో రాహుల్ కోపంగా వెళ్లి మందు తాగుతుంటాడు. గోల్డ్ బాబు వచ్చి పెగ్ కలపమంటే కలపడు.

పీకల్లోతు తాగిన రాహుల్

దాంతో తేరుకున్న రాజ్, కావ్య ముసలివాళ్లలా మళ్లీ నటిస్తారు. రాహుల్ తాగి పడిపోతాడు. గోల్డ్ బాబు అడిగేసరికి హగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కుయిలి. తర్వాత గోల్డ్ బాబు మందు నిజంగానే తాగినట్లు చెతాడు. వెళ్లి రాహుల్ మీదే పడుకుంటాడు గోల్డ్ బాబు. జరిగింది తల్చుకుని కావ్య, రాజ్ నవ్వుకుంటారు. కావ్య నవ్వడం చూసి నిన్ను ఇలా చూసి చాలా రోజులు అయిందని రాజ్ అంటాడు.

ఒకరినొకరు మెచ్చుకుంటారు. తర్వాత ఇద్దరు గొడవపడతారు. మొన్నే కదా మీకన్నా నేను ప్రేమగా చూపించలేను అని. అంతలోనే ప్లేట్ మార్చావా అని రాజ్ అంటాడు. మీరు కూడా ఆడవాళ్లలా ఇంకో ఇంటికి కోడలిగా వెళ్తే తెలుస్తుంది అని వాదిస్తుంది కావ్య. ఈ ఒక్కసారికి క్షమించవే అని రాజ్ ప్రాధేయపడతాడు. దాంతో కావ్య క్షమించి కావాలనే ఆడుకున్నట్లుగా నవ్వుతుంది.

కుయిలి గదిలో గోల్డ్ బాబు

మరుసటి రోజు ఉదయం గోల్డ్ బాబు రాహుల్ మీద గురకపెడుతుంటాడు. గోల్డ్ బాబును నిద్రలేపుతారు రాజ్, కావ్య. ప్లాన్ సంగతి చెబుతారు. ఆ విషయమే మర్చిపోయానని, ఇప్పుడు అమలు చేస్తానని షర్ట్ విప్పుతాడు గోల్డ్ బాబు. లిప్ స్టిక్‌తో కిస్ పెట్టినట్లుగా బనియన్ ఉంటుంది. ఇదంతా నేనే నిన్న రాత్రే అరెంజ్ చేసుకుని వేసుకున్నా అని గోల్డ్ బాబు అంటాడు.

గోల్డ్ బాబు వెళ్లి కుయిలి పక్కన బెడ్ మీద పడుకుంటాడు. కుయిలి చేతిని తనపై పెట్టుకుని పడుకుంటాడు. రాహుల్‌ను రాజ్, కావ్య లేపుతారు. కుయిలి గదిలో గోల్డ్ బాబును చూసినట్లు చెబుతాడు రాజ్. మీరు అబద్ధం చెబుతున్నారు. మీరు చెప్పారని కాదు నాకు నిద్రొస్తుంది. నేను వెళ్లి కుయిలి గదిలో పడుకుంటాను అని రాహుల్ వెళ్తాడు. రాహుల్ వెళ్లి చూసేసరికి గోల్డ్ బాబు, కుయిలి హగ్ చేసుకుని పడుకుంటారు.

రాహుల్ షాక్ అయి అరుస్తాడు. దాంతో కుయిలి లేచి షాక్ అవుతుంది. ఇదంతా ఏంటీ అని అరుస్తుంది. నిద్ర లేచిన గోల్డ్ బాబు రాత్రి తాగిన మత్తులో ఇదంతా జరిగిపోయింది. చూసి చూడనట్లు వదిలేయాలి అని అంటాడు. అసలు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అని కుయిలి అంటుంది. గుర్తు లేనిదే వాడు నీ మంచంపై ఛీ ఛీ.. అని రాహుల్ అంటాడు.

కుయిలి బాగోతం బయటపెట్టిన రాజ్, కావ్య

దాంతో కావ్య, రాజ్ డ్రామా చేస్తారు. ఇలాంటి దాన్ని ప్రేమించిందా, నిజంగానే నిన్ను ప్రేమించిందా అంటూ మాట్లాడుతారు. ఇది రాత్రంతా తాగి ఏం వాగిందో మర్చిపోయావా అని రాజ్ అంటే.. ఏం వాగిందని రాహుల్ అడుగుతాడు. దీని దగ్గర చెల్లి గవ్వ లేదు. కేవలం నిన్ను డబ్బుల కోసమే ట్రాప్ చేసిందట. గోల్డ్ బాబు రాగానే వాడి గోల్డ్ బిస్కెట్స్ కోసం వాడితో రూమ్‌లో ఛీ ఛీ.. ఇది దీని మావయ్య కేరాఫ్ ప్లాట్‌ఫామ్ అని రాజ్, కావ్య చెబుతారు.

నేను ఇదంతా చెప్పలేదు రాహుల్ అని కుయిలి అంటుంది. నాతో కూడా ఇదే చెప్పింది. అందుకే కమిట్ అయ్యా. అంటే కాదనలేకపోయిందనుకో అని గోల్డ్ బాబు అంటాడు. ఇక ఇది వద్దు దీనితో సావాసం వద్దు. దీనికి మన ఆస్తిలో చిల్లిగవ్వ ఇచ్చేది లేదు. మేము ఒప్పుకోము అని కావ్య అంటుంది. రాహుల్ అనుమానంగా చూస్తుంటాడు.

రాహుల్ అరెస్ట్

మేమేం డ్రామాలు ఆడట్లేదు. మేము వెళ్లిపోతున్నాం. ఇలాగే అది రోజుకు ఒకకరిని అని రాజ్ అంటాడు. అమ్మో అని కావ్య చెవులు మూసుకుంటుంది. రాహుల్‌ను రాజ్, కావ్య ఇంటికి తీసుకెళ్తారు. దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు. కుయిలిని హత్య చేసినందుకు రాహుల్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe