Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు జీవితంలో నుంచి సిరి వెళ్లిపోతుంది. తన బావను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత రాజు, ఇందు తమ పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు లక్కీ, ఐశ్వర్య పెళ్లికి అన్నీ సిద్ధంగా కాగా.. పీటలపై ఐషూ ఆగండి అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది.
ఇందుకి థ్యాంక్స్ చెప్పిన సిరి

రాజుకు సిరి థ్యాంక్స్ చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. నీ విషయంలో ఇందు కూడా ఎంతో చేసిందని రాజు చెప్పడంతో సిరి ఆమెకు కూడా థ్యాంక్స్ చెబుతుంది. నువ్వో దేవతలా కనిపిస్తున్నావని అంటుంది. ఇందులాంటి భార్య దొరికినందుకు నువ్వో అదృష్టవంతుడివి అని రాజుకి.. రాజులాంటి భర్త దొరికినందుకు నువ్వూ ఈ అదృష్టవంతురాలివి అని ఇందుతో అంటుంది.
ఇక తాను వెళ్తానని సిరి అంటే.. తమతోపాటే ఉండిపోవచ్చు కదా అని రాజు, ఇందు అడుగుతారు. కానీ తనకు ఓ బావ ఉన్నాడని,అతన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా అని అడిగితే.. మీరే నా పెళ్లి పెద్దలు అని చెప్పి సిరి వెళ్లిపోతుంది.
చలపతిని భయపెట్టిన నందు
మరోవైపు తొలిసారి ఎస్సై యూనిఫాంలో వెంకీ ఇంటికి వెళ్తుంది నందు. అక్కడ బయట కూర్చొని టిఫిన్ చేస్తున్న చలపతిని భయపెడుతుంది. తన ముఖం సరిగా కనిపించకుండా టోపీ అడ్డుగా పెట్టుకొని గన్ను తీసి చలపతిని హ్యాండ్సప్ అంటూ భయపెడుతుంది. ఆమెను చూసి లక్ష్మీ కూడా వణుకుతుంది. మీ కొడుకు ఇడ్లీ స్మగ్లింగ్ చేస్తున్నాడని అంటుంది. ఏ కొడుకు అంటే.. ఎంత మంది కొడుకులు ఉన్నారని అడుగుతుంది.
ఇద్దరు కొడుకులు అని, పెద్దోడు దొంగనా కొడుకు.. చిన్నోడు చాలా మంచోడని అనడంతో నందు మురిసిపోతుంది. ఆ తర్వాత తన క్యాప్ తీయడంతో చలపతి, లక్ష్మీ ఆశ్చర్యపోతారు. తర్వాత వెంకీ కూడా వస్తాడు. నందుని చూసి షాకవుతాడు. ఇక్కడే ఎస్సైగా పోస్టింగ్ వచ్చిందని చెప్పడంతో కంగ్రాట్స్ చెబుతాడు. చలపతి ఆశీర్వాదం తీసుకొని ఆమె వెళ్లిపోతుంది.
ఇందుని మెచ్చుకున్న రాజు.. పెళ్లి గురించి అడిగి..
{{/usCountry}}ఇద్దరు కొడుకులు అని, పెద్దోడు దొంగనా కొడుకు.. చిన్నోడు చాలా మంచోడని అనడంతో నందు మురిసిపోతుంది. ఆ తర్వాత తన క్యాప్ తీయడంతో చలపతి, లక్ష్మీ ఆశ్చర్యపోతారు. తర్వాత వెంకీ కూడా వస్తాడు. నందుని చూసి షాకవుతాడు. ఇక్కడే ఎస్సైగా పోస్టింగ్ వచ్చిందని చెప్పడంతో కంగ్రాట్స్ చెబుతాడు. చలపతి ఆశీర్వాదం తీసుకొని ఆమె వెళ్లిపోతుంది.
ఇందుని మెచ్చుకున్న రాజు.. పెళ్లి గురించి అడిగి..
{{/usCountry}}అటు ఇంట్లో సిరి వెళ్లిపోవడంతో బొమ్మలన్నీ తీసి పెడుతూ ఉంటుంది ఇందు. అప్పుడే రాజు వచ్చి ఇందుని పొగుడుతాడు. అందరినీ వరుసగా సెట్ చేస్తున్నావ్.. ఐశ్వర్యకు పెళ్లి చేయబోతున్నావ్.. నందుకు ఉద్యోగం ఇప్పించావ్.. కంపెనీ బాధ్యతలు తీసుకున్నావ్.. మరి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నావ్ అని రాజు అడగడంతో ఇందు షాకవుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా అని అంటే.. మనది ఉత్తిత్తి పెళ్లి కదా అని రాజు అంటాడు.
నీతో ఇలాగే కలిసి ఉండాలని ఉంది బావా అని మనసులో అనుకుంటుంది. తన గురించి ఏమీ ఆలోచించలేదని, నువ్వేం చేస్తావ్.. పెళ్లి చేసుకుంటావా అని రాజుని అడుగుతుంది. నీలాంటి అమ్మాయి దొరికితే చేసుకుంటానని రాజు అంటాడు. ఆ రేఖ పిన్ని, భ్రమరాంబకు తప్ప నువ్వు నచ్చని వాళ్లు ఎవరూ ఉండరని మెచ్చుకుంటాడు.
నాలాంటి అమ్మాయి ఎందుకు నన్నే చేసుకుంటానని అనొచ్చు కదా బావ అని మళ్లీ మనసులో అనుకుంటుంది. నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుంది లే అని అంటుంది. ఏమోలే.. నీలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు.. అయినా మనకు అంత అదృష్టం ఎక్కుడుంది అంటూ గొణుక్కుంటాడు వెళ్లిపోతాడు రాజు. ఏదో ఒక రోజు నీకు నువ్వుగా నాతో ఐ లవ్యూ అని చెబుతావు చూడు అని ఇందులో అనుకుంటుంది.
ఇంటర్వ్యూకి స్వాతి.. ఉద్యోగం సంపాదించేసి..
మరోవైపు స్వాతి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అయితే ఆమె డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడం కుదరదని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెబుతాడు. తాను మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తానని, అప్పుడు తన సర్టిఫికెట్ తెచ్చిస్తానని, తనకు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది.
కావాలంటే తన గురించి బేగంపేట డిగ్రీ కాలేజీలో ఎవరిని అడిగినా చెబుతారు అని స్వాతి అనడంతో తనదీ అదే కాలేజీ అని, నువ్వు నాకు సూపర్ జూనియర్ వి కావచ్చు అని ఆ వ్యక్తి అంటాడు. తర్వాత ఇద్దరూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. స్వాతిని ఉద్యోగంలోకి తీసుకుంటాడు. కచ్చితంగా ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేయాలని కండిషన్ పెడతాడు. ఆమె సరే అంటుంది.
లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం
ఇక దుగ్గిరాల ఇంట్లో మరో పెళ్లి సందడి మొదలవుతుంది. లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులుని పిలిపిస్తారు. మంచి ముహూర్తం కోసం అతడు చూస్తుంటే.. అంత అవసరం లేదు.. ఏదో ఒకటి చూసేయండి అని ఐశ్వర్య అంటుంది. అటు లక్కీ మాత్రం తొందరపడుతుంటాడు. రేపు ఉదయమే మంచి ముహూర్తం ఉందని పంతులు అనడంతో అంత త్వరగా అంటే కష్టం.. ఏర్పాట్లు చేసుకోవాలి.. బంధువులను పిలవాలి.. భోజనాలు ఏర్పాటు చేయాలి అని ఇందు అంటుంది.
అటు అపర్ణ కూడా తమ ఇంట్లో చాలా రోజుల తర్వాత శుభకార్యం జరుగుతోందని, చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. మరో ముహూర్తం అంటే మూడు నెలల వరకు లేదని పంతులు చెప్పడంతో లక్కీ తొందరపడుతూ ఇదే ఖాయం చేయాలని అంటాడు. అటు ఐశ్వర్య కూడా ఇది త్వరగా పూర్తయితే తనకు కంపెనీ వస్తుందంటూ ఇదే ఖాయం చేయాలని అడుగుతుంది.
పెళ్లి పీటలపై ట్విస్ట్
లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. లక్కీ, ఐశ్వర్య పెళ్లికి ముస్తాబై వస్తారు. తీరా తాళి కట్టేవేళ పెళ్లి పీటలపై ఆగండి అంటూ ఐషూ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాకవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.