బ్రహ్మముడి అక్టోబర్ 12 ఎపిసోడ్: భ్రమరాంబకు రాజు ముష్టి- బాస్ బైక్‌పై స్వాతి, మదన్‌కు అనుమానం- పెళ్లి చేసుకోనన్న ఐశ్వర్య

Brahmamudi Serial October 12th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12వ ఎపిసోడ్‌‌లో ఇంట్లో సింపుల్‌గా చేస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెడుతుంది ఐశ్వర్య. లిప్‌స్టిక్ పెట్టుకుని బాస్ బైక్‌పై వెళ్లిన స్వాతిని అనుమానిస్తాడు మదన్. పెళ్లిపీటలపై లక్కీని పెళ్లి చేసుకోనని బాంబ్ పేలుస్తుంది ఐశ్వర్య.

Published on: Oct 12, 2026, 09:28:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య పెళ్లి గురించి అందరూ మాట్లాడుతారు. ఎహే ఆపండి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు. నాకు ఈ తతంగాలు ఏమి వద్దు. ఈ ఇంట్లోనే సింపుల్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెళ్లి చేయండి అని గట్టిగా చెబుతుంది ఐశ్వర్య.

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 12 ఎపిసోడ్

మూడు ముళ్లు పడగానే

అంతా వ్యతిరేకిస్తారు. నా ఫ్రెండ్స్ మధ్య రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నా సర్కిల్‌లో ఎవరికి తెలియొద్దు. డేట్ ఫిక్స్ చేయండని ఐశ్వర్య అంటుంది. ఎంత చెప్పిన ఐశ్వర్య వినదు. సరేఅని అంతా ఓకె చెబుతారు. అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించండి. నా మెడలో మూడు ముళ్లు పడగానే నా చేతిలో పేపర్స్ పడాలని చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

గాంధర్వ పెళ్లి విన్నాను కానీ ఇలా గందరగోళం పెళ్లి చూడలేదని శేషు అంటాడు. మరోవైపు మదన్ అలసిపోయి ఉంటాడు. ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన స్వాతి షూస్ తీస్తుంది. ఇంటర్వ్యూ గురించి మదన్ అడిగితే.. జాబ్ వచ్చిందని సంతోషంగా చెబుతుంది స్వాతి. తనకు కాకుండా స్వాతికి జాబ్ వచ్చినందుకు కొద్దిగా ఫీల్ అవుతాడు. తేరుకుని కంగ్రాట్స్ చెప్పి స్వాతిని హత్తుకుంటాడు మదన్.

మదన్ ఇంటర్వ్యూ గురించి అడిగితే డల్‌గా ఉంటాడు. ఇక ఇంటి సంగతి నేను చూసుకుంటాను. నీకు నచ్చిన జాబ్ వచ్చేవరకు ట్రై చేయొచ్చు అని చెబుతుంది స్వాతి. రకరకాల కారణాలతో డివోర్స్ తీసుకుంటున్న ఈ జెనరేషన్‌లో నా భారమంతా నువ్వే మోస్తునంటున్నావ్. గిల్టీగా ఉందని మదన్ బాధగా చెబుతాడు. మనిద్దరం ఒక్కటేగా బావ. నాకు నువ్వు ఇచ్చే ప్రేమ చాలు అని స్వాతి అంటుంది.

నిన్ను కొట్టకుండా చూసుకో

దాంతో స్వాతిని మరింత గట్టిగా హగ్ చేసుకుంటాడు మదన్. మరోవైపు రాజును సంతోషంతో లక్కీ కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటాడు. నాకు తల్లిని, ప్రేమించిన ఐశ్వర్యను ఇచ్చావని, నా కల నీవల్ల నెరవేరుతోందని, నాకు చాక్లెట్ లాంటి అమ్మాయిని ఇస్తున్నావ్ అని లక్కీ సంతోషిస్తాడు. తనను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నిన్ను కొట్టకుండా చూసుకో అని రాజు హెచ్చరిస్తాడు.

నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని లక్కీ అంటే.. చేసి తీరుతుంది. పెళ్లికి ముందు అమ్మాయి ఆలోచనలు వేరు. పెళ్లి అయి పిల్లలు పుట్టాకా తన లోకం మారిపోతుందని ఇందు చెబుతుంది. నాకు సిగ్గేస్తుందని లక్కీ వెళ్లిపోతాడు. నానమ్మ వాళ్ల కోసం బట్టలు కొనుక్కుని వచ్చానని ఇందు చెబుతుంది. మందులు ఇంకెంత కాలం వాడాలని సుభాష్ అంటాడు.

ఆరోగ్యం కోసం తప్పదని అపర్ణ అంటుంది. అపర్ణ, సుభాష్‌కి తీసుకొచ్చిన కొత్త బట్టలు ఇస్తుంది ఇందు. పెళ్లి గొప్పదనం గురించి చెప్పిన అపర్ణ ఐశ్వర్య పెళ్లి ఇలా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఏదో వ్యాపార లావాదేవీలా, దొంగతనంగా జరుగుతున్నట్లుగా ఉందంటుంది. ఐషు పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. లేకుంటే ఇంటి పరువుతోపాటు కడుపులో బిడ్డ కూడా పోతుందని ఇందు అంటుంది.

బ్రమరాంబకు రాజు ముష్టి

రాజు ఇంటికి వెళ్లి పెళ్లికి పిలుస్తామని ఇందు అంటే.. నేను కూడా వస్తానని నందు అంటుంది. రాజుకు చాంతడాంత లిస్ట్ ఇస్తుంది భ్రమరాంబ. రేపు జరిగే పెళ్లికి మేము కట్టుకునే బట్టలు, కాస్మోటిక్స్ లిస్ట్ అని చెబుతుంది భ్రమరాంబ. బట్టలు, జ్యూవెలరీ, కాస్మోటిక్స్, చెప్పులు కావాలని భ్రమరాంబ అంటుంది. డబ్బులిస్తానని ఇందు ఇస్తే రాజు అడ్డుకుంటాడు.

సింపుల్‌గా జరిగే పెళ్లికి ఇంతెందుకు అని కొంత డబ్బు ఇస్తాడు రాజు. భ్రమరాంబ జాకెట్లు కూడా రావని అంటే నాకు షర్ట్ ప్యాంట్ వస్తాయని శేషు తీసుకుంటాడు. సచ్చినోడికి వచ్చిందే కట్నం అని శేషు అంటాడు. ఇందుతో భ్రమరాంబ చెప్పిస్తుంది. అయినా రాజు వినడు. రాజు వాళ్లు వెళ్లిపోతారు. షాపింగ్‌కి ఏదో ముష్టి ఇచ్చి వెళ్లాడని తిట్టుకుంటుంది భ్రమరాంబ.

ఐశ్వర్య, లక్కీకి పెళ్లి చేస్తున్నారని, ఇందు అక్క కాల్ చేసిందని మదన్‌తో చెబుతుంది స్వాతి. ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇవ్వరా అని మదన్ అంటాడు. వస్తామన్నారు. కానీ మనం ఉండమని నేనే వద్దన్నాను అని స్వాతి అంటుంది. అక్కడ మమ్మీ ఉంటుంది. వెళ్లడం వద్దని మదన్ అంటాడు. స్వాతి ఫీల్ అవుతుంది. ఈ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోలేనని, స్వాతిని ఒక్కదాన్నే వెళ్లమంటాడు మదన్.

స్వాతిపై మదన్ డౌట్

ఇద్దరం వెళ్తేనే బాగుంటుందని స్వాతి అంటుంది. మదన్ బతిమిలాడుతాడు. సరేనని ఒప్పుకుంటుంది స్వాతి. ఇంతలో స్వాతి బాస్ బైక్‌పై వస్తాడు. అది చూసిన స్వాతి దువ్వుకుని, లిప్‌స్టిక్ పెట్టుకుని, సెంట్ కొట్టుకుని వెళ్తుంది. అదంతా చూసి మదన్ షాక్ అవుతాడు. వేరే వ్యక్తితో స్వాతి బైక్‌పై వెళ్లడం చూసి మదన్ అనుమానంతో ఆలోచనలో పడతాడు.

చలపతి ఇంటికి రాజు వాళ్లు వెళ్తారు. ఐశ్వర్యతో లక్కీ పెళ్లి అని చెబుతారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టమని వెంకీ అంటాడు. వాడు ఆ ఇంట్లో నీకు తోడల్లుడిగా వచ్చి పడ్డాడన్నమాట అని చలపతి అంటాడు. ఇంట్లో రేపే పెళ్లి అని, ఐశ్వర్య కండిషన్ అని చెబుతారు రాజు, ఇందు. వెంకీ కూడా వస్తాడని చలపతి అంటే.. నేను రావడం కూడా చెబుతావా అని కొడుకు కోప్పడుతాడు.

చలపతి చేసే పనులగురించి లక్ష్మి, వెంకీ చెబుతారు. నా బతుకుని బజారుకు ఈడుస్తున్నారని తిడతాడు చలపతి. నీ గురించి చెప్పనారా అని చలపతి అంటే.. ఇందు నందు చెప్పమంటారు. రాజు కోప్పడతాడు. మీ గురించి సీక్రెట్ చెబుతానంటున్నారుగా చెప్పనివ్వండని ఇందు అంటుంది. అవతల పెళ్లి పనులు పెట్టుకుని ఏంటీ మీరు రాజు అంటాడు.

బాంబ్ పేల్చిన ఐశ్వర్య

చికెన్ తీసుకొస్తానని, తినేసి వెళ్లమని చలపతి అంటే.. ముగ్గురు మాయమైపోతారు. మరుసటి రోజు లక్కీ, ఐశ్వర్య పెళ్లి పనులు జరుగుతాయి. చలపతి వాళ్లు వస్తారు. లక్కీ, ఐశ్వర్య పెళ్లి పీటలపై కూర్చుంటారు. ఆగండి. నేను ఈ పెళ్లి చేసుకోను అని బాంబ్ పేలుస్తుంది ఐశ్వర్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More