Aishwarya Lekshmi Raaka: రాకాలో అల్లు అర్జున్‌కు విలన్‌గా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి- ప్లీజ్ నన్ను ఎవరైనా తీసుకోండి అంటూ!

Aishwarya Lekshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న భారీ చిత్రం 'రాకా'లో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్‌కు విలన్‌గా ఐశ్వర్య నటించడంపై ఆమె ఇచ్చిన క్లారిటీ ఆకట్టుకునేలా ఉంది.

Published on: Oct 3, 2026, 15:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Aishwarya Lekshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ 'రాకా'. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

రాకాలో అల్లు అర్జున్‌కు విలన్‌గా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి- ప్లీజ్ నన్ను ఎవరైనా తీసుకోండి అంటూ!
రాకాలో అల్లు అర్జున్‌కు విలన్‌గా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి- ప్లీజ్ నన్ను ఎవరైనా తీసుకోండి అంటూ!

రెండు పార్ట్స్‌గా రాకా

రెండు భాగాల ఎపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాకా సినిమాలో నటీనటుల ఎంపికపై రోజుకో ప్రచారం వెలుగులోకి వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఒక కీలకమైన విలన్ పాత్రలో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఈ ప్రచారంపై హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించి అసలు నిజాలేంటో వివరిస్తూ స్పష్టత ఇచ్చారు.

ఐశ్వర్య లక్ష్మి క్లారిటీ

తమిళం, మలయాళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'రాకా' పుకార్లను పూర్తిగా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ ప్రచారంలో నిజం లేదు.. కానీ నన్ను తీసుకోండి

"ఆ సినిమాలో నేను భాగం కావడం లేదు. ప్లీజ్ ఎవరైనా నన్ను ఆ సినిమాలో తీసుకుంటే చాలా సంతోషిస్తాను" అని ఐశ్వర్య లక్ష్మి చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేయడంతో పాటు, అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నటించేందుకు తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని ఈ రకంగా వ్యక్తపరిచారు.

విభిన్న ప్రాజెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న నటి

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అర్జున్ దాస్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ఓటీటీ సిరీస్ '#లవ్' (#Love) అక్టోబర్ 2న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో #లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఐశ్వర్య సినిమాలు

ఇందులో డేటింగ్ యాప్ సీఈఓ 'తారా' పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. ఊర్వశి, జోజూ జార్జ్‌లతో కలసి నటించిన మలయాళ థ్రిల్లర్ 'ఆశా', తమిళంలో విష్ణు విశాల్ సరసన చేసిన 'గట్ట కుస్తీ 2' చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

'రాకా'పై వరల్డ్ వైడ్ క్రేజ్

'పుష్ప' సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, కోలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్లు సాధించి 'జవాన్'తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో 'రాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెండు విభిన్న కాలఘట్టాల నేపథ్యం

రెండు విభిన్న కాలఘట్టాల నేపథ్యంలో సాగే ఈ విజువల్ వండర్‌కు సంబంధించి గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. "మేము ఊహించడానికి, సాధించడానికి సాహసించాం" అనే సందేశంతో వచ్చిన ఆ టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

కొత్త మైలురాయిగా రాకా

భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచేలా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇతర కీలక నటీనటులు ఎవరనేది చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More