...
...
Next Story

Brahmamudi October 14 Episode: బ్రహ్మముడి.. లక్కీ, ఐశ్వర్య ఫస్ట్ నైట్.. అడ్డంగా ఇరుక్కున్న రాజు, ఇందు.. కంపెనీలో అడుగు

Brahmamudi Serial October 14th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్ లో లక్కీని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఫస్ట్ నైట్ కు మాత్రం నో చెబుతుంది. అటు రాజు, ఇందుని పిల్లల విషయంలో ఇంట్లో వాళ్లు నిలదీస్తారు.

Published on: Oct 14, 2026, 09:01:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ కీలక మలుపులతో సాగిపోయింది. మొత్తానికి ఐషూ మెడలో లక్కీ తాళి కట్టి ఫస్ట్ నైట్ కోసం ఆరాటపడతాడు. అయితే అదే రాజు, ఇందులను ఇరికిస్తుంది. వాళ్ల పిల్లల గురించి ఇంట్లో వాళ్లు నిలదీస్తారు. కానీ వాళ్లు తెలివిగా తప్పించుకుంటారు.

అగ్రిమెంట్ కోసం పెళ్లి ఆపిన ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్

ఐశ్వర్య పెళ్లిని ఆపే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. ఎందుకు ఆపావని రాజు నిలదీస్తాడు. పెళ్లి పీటలపైనే ఇందు తనకు కంపెనీ పెట్టిస్తానన్న అగ్రిమెంట్ ఇస్తానని చెప్పిందని, అది ఇచ్చే వరకు తాళి కట్టించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంది. దీంతో అపర్ణ ఆమెను తిడుతుంది. అయినా ఐషూ వినదు. ముందు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాతే పెళ్లి అంటుంది.

అగ్రిమెంట్ ఇచ్చిన ఇందు.. లాయర్‌తో చదివించి..

దీంతో చేసేది లేదక ఇందు వెళ్లి అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పటికైనా తాళి కట్టించుకో అని లక్కీ అడుగుతాడు. కానీ ఐషూ మాత్రం పీటల మీద కూర్చొనే అది చదవడం మొదలుపెడుతుంది. అది అర్థం కావడానికి నీవేమైనా లాయరా అని శేషు అడుగుతాడు.

అందుకే ముందు జాగ్రత్తగా లాయర్ ను పిలిచానంటూ ఫోన్ చేసి లోనికి రమ్మంటుంది. దీంతో అందరూ షాకవుతారు. ఆ అగ్రిమెంట్ ను లాయర్ తో చదివిస్తుంది. అందులో ఏ సమస్యా లేదని లాయర్ చెప్పిన తర్వాత ఐశ్వర్య పెళ్లికి రెడీ అవుతుంది. చాాలా.. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటావా అని ఇందు అడుగుతుంది.

ఐషూ మెడలో తాళి కట్టిన లక్కీ

పెళ్లి తర్వాత స్వాతిని ఇందు నిలదీస్తుంది. కాపురం కోసం వాళ్లు పడే కష్టాల గురించి అడుగుతుంది. ఉద్యోగం కోసం ఎవరినో అడగడం ఏంటి.. ఇప్పటి వరకూ మన కుటుంబం ఉద్యోగాలు ఇచ్చిందే తప్ప ఎవరినీ అడగలేదు.. నన్ను అడిగితే ఇచ్చేదాన్ని కదా అని ఇందు అంటుంది. కానీ స్వాతి మాత్రం మదన్ గురించి చెబుతుంది.

తల్లీకొడుకులతోనే అసలు సమస్య.. రేఖ ఆంటీ పేరెత్తితేనే మదన్ మండిపడుతున్నాడు.. మన కంపెనీలో చేరితో రేఖ ఆంటీతో మాట్లాడాల్సి వస్తుంది.. అందుకే మదన్ వద్దంటున్నాడు అని చెబుతుంది. స్వాతి చాలా పరిణతితో మాట్లాడటం చూసి ఇందు మురిసిపోతుంది. ఆమెను ప్రేమగా హగ్ చేసుకుంటుంది.

లక్కీ, ఐశ్వర్య ఫస్ట్ నైట్‌కి ముహూర్తం

ఆ తర్వాత లక్కీ, ఐశ్వర్య ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి ఇంట్లో వాళ్లందరూ కూర్చొంటారు. ఇంకేంట్రా లక్కీ.. నువ్వు అనుకున్నట్లే పెళ్లి చేసుకున్నావని చలపతి అంటాడు. మా అమ్మ వల్లే జరిగిందని లక్కీ అనడంతో వీళ్లు తల్లీకొడుకులు కదా అని చలపతి అనుకుంటాడు. తన ప్రమేయం ఏమీ లేదని రేఖ అంటుంది. ఫస్ట్ నైట్ అనడంతో లక్కీ సిగ్గు పడుతుంటాడు. అతన్ని రాజు, చలపతి, వెంకీ, ఇందు ఆట పట్టిస్తారు.

రాజు, ఇందు పిల్లల గురించి అడిగిన చలపతి.. అపర్ణ సపోర్ట్

ఆ తర్వాత మెల్లగా టాపిక్ రాజు, ఇందు వైపు వెళ్తుంది. మరి మీ పిల్లల సంగతేంటి.. అసలు ఆ ఆలోచన చేస్తున్నారా లేదా అని రాజు, ఇందులను చలపతి నిలదీస్తాడు. అదీ.. అలా అడగండి అంటూ అపర్ణ అతనికి సపోర్ట్ చేస్తుంది. ఇదే అదునుగా రేఖ కూడా వాళ్లను ఇరికించడానికి ప్రయత్నిస్తుంది.

దీంతో ఇందు రెడీగానే ఉంది కానీ.. తానే కొన్నాళ్లు ఆగాలని చెప్పినట్లు రాజు అంటాడు. నేను రెడీగా ఉన్నానా అని ఇందు అంటే.. మరి లేవా అని స్వాతి అంటుంది. తామిద్దరం ఇరుక్కునేలా ఉన్నామనుకున్న ఇందు.. టాపిక్ మార్చి లక్కీ, ఐషూ పస్ట్ నైట్ ముహూర్తం గురించి అడుగుతుంది. ఈరోజు రాత్రే ముహూర్తం ఉందని పంతులు చెబుతాడు. దీంతో లక్కీ మరింత సిగ్గు పడతాడు.

మదన్ విషయంలో బాధపడిన రేఖ.. శేషు ఎమోషనల్

ఆ తర్వాత స్వాతి వెళ్లడానికి సిద్ధమవుతుంది. దీంతో రేఖ డబ్బు, భోజనం ఇస్తుంది. కానీ స్వాతి వద్దంటుంది. ఈ ఇంటి నుంచి అసలు ఏమీ తీసుకురావద్దని మదన్ స్పష్టంగా చెప్పాడు.. మీతోనే అతనికి సమస్య అని చెప్పడంతో రేఖ బాధపడుతుంది. అటు శేషు కూడా ఎమోషనల్ అవుతాడు. మీరు ఇక్కడే ఉండి ఉంటే మీ పెళ్లి మేం చేసేవాళ్లం కదా అని అంటాడు. అయినా నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ నాన్న ఉన్నాడని గుర్తు పెట్టుకో.. వెళ్లు అని సాగనంపుతాడు.

లక్కీ, ఐషూ కోసం ఇందు, రాజు పాల గ్లాసు

ఇటు లక్కీ, ఐశ్వర్య ఫస్ట్ నైట్ కోసం ఇందు పాల గ్లాసు రెడీ చేస్తుంది. అది చూసి రాజు కోసమా అని అపర్ణ అడిగితే.. దానికి టైమ్ ఉంది కానీ ఇప్పుడైతే ఇది ఐశ్వర్య కోసం అని చెబుతుంది. ఆమె గంట ముందే వెళ్లి గదిలో కూర్చుంది కదా అని అపర్ణ అంటుంది. దీంతో రాజు ఆ పాల గ్లాసు తీసుకుంటాడు. ఇది ఎలాగోలా గదిలోకి వెళ్లే సరిపోతుంది కదా.. ఎవరు తీసుకెళ్తే ఏంటి.. లక్కీతో పంపిస్తానని తీసుకెళ్లి అతనికి ఇస్తాడు. అతడు అప్పటికే గది బయట నిలబడి ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తుంటాడు. రాజు తనకు పాల గ్లాసు ఇవ్వడంతో షాకవుతాడు. ఐషూ ఇవ్వాలి కదా అంటే.. ఆమె ముందే గదిలోకి వెళ్లిందట.. ఎవరు తీసుకెళ్తే ఏంటి నువ్వు తీసుకెళ్లని అంటాడు. సరే ఇక రెచ్చిపోతా అని లక్కీ వెళ్తాడు.

ఫస్ట్ నైట్ కోసం లక్కీ ఆరాటం.. చీదరించుకున్న ఐషూ

ఫస్ట్ నైట్ కోసం లక్కీ ఆరాటపడుతూ లోనికి వెళ్తాడు. కానీ ఐషూ మాత్రం అతని ఆశలపై నీళ్లు చల్లుతుంది. నిన్ను కేవలం కంపెనీ కోసమే పెళ్లి చేసుకున్నా.. తాళి కట్టానని ఎక్స్‌ట్రాల చేస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. మంచంపై ఫస్ట్ నైట్ కోసం వేసిన పూలను అతనితో తీయిస్తుంది. మంచంపై ఇద్దరం చెరొక మూలకు పడుకుందామని అంటుంది. లక్కీ తన దగ్గరకు వస్తుంటే గిల్లుతుంది. అయినా లక్కీ మాత్రం అతన్ని దూరం పెడుతుంది.

తొలి రోజే బుద్ధి చూపించిన ఐశ్వర్య

మరుసటి రోజు ఐశ్వర్య తన సొంత కంపెనీలో అడుగుపెడుతుంది. అయితే తొలిరోజే తన బుద్ధి చూపిస్తుంది. స్వరాజ్ గ్రూపు నుంచి వచ్చిన ఆరుగురు ఉద్యోగులను తీసేస్తుంది. అదే విషయం శృతి వెళ్లి ఇందుకి చెబుతుంది. దీంతో ఆమె ఐషూతో గొడవ పడుతుంది. నువ్వు ఏం చేసినా నా కంపెనీని నంబర్ వన్ గా నిలుపుతానని ఐషూ ఛాలెంజ్ చేస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks