Brahmamudi October 23 Episode: బ్రహ్మముడి.. ఇందు ప్లాన్ చెడగొట్టిన రాజు.. నేరం వెంకీ మీదికి.. సుభాష్ హత్య రాజు మెడకు..

Brahmamudi Serial October 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్ లో రేఖ, ఐశ్వర్య ప్లాన్స్ కు అన్నదమ్ములు రాజు, వెంకీ ఇద్దరూ ప్రమాదంలో పడతారు. బంగారం నేరం వెంకీ మీదికి.. సుభాష్ హత్య రాజు మెడకు చుట్టుకునేలా ప్లాన్ చేస్తారు.

Published on: Oct 23, 2026, 09:05:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇందు చెప్పినా వినకుండా రాజు తొందరపడటంతో ప్లాన్ అంతా చెడిపోతుంది. అటు ఐశ్వర్య, రేఖకు చేజేతులా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీంతో రాజు, వెంకీ ఇద్దరినీ ఒకే దెబ్బతో ఇంటికి దూరం చేయాలని రేఖ, ఐషూ ప్లాన్ చేస్తారు.

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 23 ఎపిసోడ్

రాజుకి ఫ్రాడ్ గురించి చెప్పిన వెంకీ.. సైలెంట్‌గా ఉండాలన్న రాజు

రాజుకి తన కంపెనీలో ఫ్రాడ్ గురించి చెప్పడానికి వెంకీ వచ్చే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. నీ కంపెనీలో మోసం జరిగితే నేనేం చేయాలని రాజు అంటే.. అది ఐశ్వర్య కంపెనీకి కూడా సంబంధం ఉన్న మోసం.. ఆమె అంత తక్కువకే టెండర్ దక్కించుకోవడం వెనుక పెద్ద మోసం ఉంది.. అదేంటో కనిపెట్టాలని వెంకీ అంటాడు. తనకు ముందు నుంచీ దీనిపై డౌట్ గానే ఉందని, ఈ విషయం తాను చూసుకుంటానని నువ్వు జోక్యం చేసుకోవద్దని వెంకీకి రాజు చెబుతాడు.

ఐశ్వర్యకే స్వరాజ్ గ్రూపు కాంట్రాక్టులు

అటు ఐశ్వర్య కంపెనీ చేసిన డిజైన్లు నచ్చడంతో క్లైంట్ ఆమెకు సగం అమౌంట్ చెక్కు రూపంలో ఇస్తాడు. ఆమె చేసి పనిని మెచ్చుకుంటాడు. స్వరాజ్ గ్రూపుకి ఇద్దామనుకున్న నాలుగు కాంట్రాక్టులను కూడా మీకే ఇస్తానని చెబుతాడు. దీంతో ఐషూ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. తొలిసారి వచ్చిన చెక్కు చూసి మురిసిపోతుంది. ఇంట్లో చూపించాలని అనుకుంటుంది.

ఐశ్వర్య గురించి ఇందుకి చెప్పిన రాజు

అటు రాజు విషయం తెలియగానే ఇంటికి పరుగెత్తుకొస్తాడు. అప్పటికే రాజు ప్రాణాల గురించి ఇందు భయపడుతూ ఉంటుంది. రాజు రాగానే పెళ్లి గురించి మాట్లాడాలని అనుకుంటుంది. కానీ రాజు కంగారుగా రావడం చూసి ఆ విషయం ముందే తెలిసిపోయిందా అని అనుకుంటుంది.

అయితే రాజు మాత్రం ఐశ్వర్య చేస్తున్న మోసం గురించి చెబుతాడు. ఆ విషయం బావకు తెలియదైతే అని ఇందు మనసులో అనుకుంటుంది. అదే జరిగితే ఐషూ పరువు కాదు.. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న స్వరాజ్ గ్రూపు పరువు పోతుందని రాజు ఆందోళన వ్యక్తం చేస్తాడు.

చెక్కుతో ఐశ్వర్య బిల్డప్.. అన్ని ప్రాజెక్టులూ తనకే అంటూ..

ఇంతలో ఐశ్వర్య చెక్కుతో ఇంటికి వస్తుంది. హడావిడి చేస్తుంది. అందరినీ పిలుస్తుంది. దీంతో రాజు, ఇందు కూడా కిందికి వస్తారు. తన డిజైన్లు నచ్చి రూ.2 కోట్ల చెక్కు ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటుంది. అంతేకాదు స్వరాజ్ గ్రూపుకి వెళ్లాల్సిన నాలుగు కాంట్రాక్టులు కూడా తనవే అని ఐశ్వర్య అంటుంది. రాజు మాత్రం ఆవేశంతో రగిలిపోతుంటాడు. మోసం చేసి ఈ కాంట్రాక్టు సంపాదించిందని, ఇందుని నిలదీయాలని అడుగుతాడు. ఐషూ సక్సెస్ చూసి రేఖ, భ్రమరాంబ సంతోషిస్తారు.

ఐషూని నిలదీయాలన్న రాజు.. ప్రూఫ్స్ లేవన్న ఇందు

అటు ఐషూ తన జోలికి ఇక ఎవరూ రావద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆమె చేసిన పని గురించి నిలదీయాలని ఇందుని రాజు అడిగినా ఆమె వినదు. వెంకీ చెప్పాడని చెప్పి ఆమెను నిలదీస్తే లాభం లేదు.. సరైన ఆధారాలు కావాలి కదా.. సరైన టైమ్ వచ్చినప్పుడు అడుగుదాం అని చెప్పి ఇందు వెళ్లిపోతుంది.

ఐషూని నిలదీసిన రాజు.. పరువు తీసిన ఐశ్వర్య

కానీ రాజు మాత్రం వినడు. ఇందు ప్లాన్ చెడగొడతాడు. ఇప్పుడే ఐషూని నిలదీస్తానంటూ ఆమె గదిలోకి వెళ్తాడు. కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో తనకు తెలుసని, నీ కంపెనీలో మోసం జరుగుతోందని తెలిసిపోయిందని అంటాడు. నా కంపెనీ నా ఇష్టం.. నువ్వెవరు అడగడానికి.. అయినా ఇందుకి కేవలం అద్దె మొగుడివి.. కిడ్నాప్ లు చేసుకుంటూ బతికేవాడివి.. నీకు అడిగే అర్హత లేదు.. ముందు బయటకు వెళ్లు అని రాజుని అవమానించి పంపిస్తుంది ఐశ్వర్య.

వెంకీని ఇరికించాలన్న రేఖ

రాజు వెళ్లిన వెంటనే రేఖ, భ్రమరాంబ వస్తారు. ఐషూని అభినందించి.. తన అనుభవం వాడుకో అని రేఖ అంటుంది. రాజు అడ్డు ఎలా తొలగించుకోవాలో చెప్పమని ఐషూ అడుగుతుంది. నువ్వు దొంగ బంగారంతో ఈ డీల్ కుదుర్చుకున్నావని నాకు తెలుసు.. ఆ కంపెనీలో వెంకీ కూడా ఉన్నాడనీ తెలుసు.. అతన్ని ఈ కేసులో ఇరికించి నువ్వు తప్పించుకో అని ఐషూకి చెప్పడంతో ఆమె సరే అని వెళ్లిపోతుంది.

ముసలోడిని చంపి రాజుని వదిలించుకుందామన్న రేఖ

ఇటు అదే సమయంలో రాజు అడ్డు తొలగించుకోవడానికి కూడా రేఖ ప్లాన్ చేస్తుంది. సుభాష్, అపర్ణ పెళ్లి రోజు జరపడానికి చూస్తున్నారు కదా.. అదే రోజు ఆ ముసలోడిని చంపేద్దాం.. ఆ నేరాన్ని రాజుపైకి తోసి అతని అడ్డు తొలిగించుకుందాం అని రేఖ అంటుంది. అది విని శేషు షాకవుతాడు. మీరెన్ని ప్లాన్స్ వేసిన అది జరగదు అని అతడు అంటాడు.

వెంకీ బాస్‌కు ఐషూ ఫోన్.. జైలుకి వెంకీ

మరోవైపు ఐశ్వర్య వెళ్లి వెంకీ బాస్ కు ఫోన్ చేస్తుంది. మనం భయపడినట్లే జరిగింది.. వెంకీ మన ఫ్రాడ్ గురించి ఇంట్లో చెప్పేశాడు అని అంటుంది. వెంటనే ఆ నేరం వాడిపైకి తోసెయ్ అని చెబుతుంది. అందుకే కదా నేను వాడిని పెట్టుకున్నాను.. అలాగే చేస్తాను అని అతడు ఫోన్ పెట్టేస్తాడు.

నందుకి వెంకీ గురించి చెప్పిన బాస్

వెంటనే వెంకీ బాస్ ఎస్సై నందనకు ఫోన్ చేస్తాడు. తన కంపెనీలో మోసం జరిగిందని, ఓ వ్యక్తి తాను 24 క్యారెట్ల బంగారాన్ని క్లైంట్ కు పంపిస్తే మధ్యలో మార్చి 18 క్యారెట్ల బంగారాన్ని ఇచ్చాడని చెబుతాడు. ఆ వ్యక్తి పేరేంటని నందు అడిగితే.. వెంకీ అని చెబుతాడు. దీంతో ఆమె షాకవుతుంది.

పెళ్లి గురించి రాజుని అడిగిన ఇందు.. అడ్డు పడిన రాజు

ఇటు అపర్ణ, సుభాష్ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ కు రాజు, ఇందు రెడీ అవుతారు. అప్పుడే తన పెళ్లి గురించి ఇందు అడగాలని అనుకుంటుంది. కానీ రాజు మాత్రం వినడు. ఆమెకు పదే పదే అడ్డు పడతాడు. తమ పెళ్లి విషయంలో తాను ఓ నిర్ణయం తీసుకున్నానని ఇందు చెప్పినా రాజు వినడు. టైమ్ అవుతోందంటూ హడావిడిగా ఇందుని తీసుకొని వెళ్తాడు.

సుభాష్‌ను చంపేందుకు ఇంజెక్షన్ మార్చిన రేఖ

మరోవైపు సుభాష్ ను చంపేందుకు ప్లాన్ చేసిన రేఖ.. అతని గదిలోకి వెళ్తుంది. భ్రమరాంబ, రేఖ కలిసి అతని మందుల కోసం వెతుకుతారు. సుభాష్ కు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కనిపిస్తుంది. అది తీసి విషపూరితమైన ఇంజెక్షన్ ను అక్కడ పెడుతుంది రేఖ.

అందరూ కలిసి అపర్ణ, సుభాష్ పెళ్లిరోజు సెలబ్రేట్ చేస్తుంటారు. సుభాష్ కు అపర్ణ కేక్ తినిపించబోతుండగా.. ఇంజెక్షన్ ఇవ్వకుండానే తినిపిస్తారా అని భ్రమరాంబ అడుగుతుంది. దీంతో ఇందు ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More