Brahmamudi October 19 Episode: బ్రహ్మముడి- ఐశ్వర్యకు ఇందు టెండర్ ఫిట్టింగ్- రాజుకు లక్కీ వెన్నుపోటు- తాత రొమాంటిక్ ఐడియా
Brahmamudi Serial October 19th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 19వ ఎపిసోడ్లో పవర్స్ లాక్కోవడంపై ఇందుతో గొడవ పడుతుంది ఐశ్వర్య. ఐశ్వర్యపై నమ్మకం కలగాలంటే జీఆర్ గ్రూప్ వాళ్ల టెండర్ సాధించాలని ఫిటింగ్ పెడుతుంది ఇందు. దానికి ఐషు ఒప్పుకుంటుంది. రాజు, ఇందులను కలిపేందుకు తాత రొమాంటిక్ ఐడియా వేస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఐశ్వర్యకు ఆవేశం ఎక్కువని, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ తప్పా బిజినెస్ నిలబెట్టే లక్షణం ఒక్కటిలేదని ఇందు, రాజు అంటారు. రేఖ, బ్రమరాంబ సపోర్ట్ చేస్తే అపర్ణ నోరుమూయిస్తుంది. మాటమీద నిలబడతావ్ కదా ఇందు ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని ఐశ్వర్య అంటుంది.

కడుపులో బిడ్డ తీయించుకుంటాను
నువ్వు చెప్పావనేగా కడుపులో బిడ్డను ఉంచుకున్నాగా అని ఐశ్వర్య అంటుంది. వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారు నీ నిర్ణయం నువ్వు తీసుకో అని రేఖ అంటుంది. నాకు నచ్చినట్లుగా పవర్స్ ఇస్తారా లేదా నాకు నచ్చిన నిర్ణయం తీసుకోనా అని బిడ్డను తీయించుకోవడం గురించి ఐశ్వర్య బెదిరిస్తుంది. ఇస్తాను. నువ్వు అడిగినట్టే అన్ని అధికారాలు ఇస్తాను అని ఇందు అంటుంది.
అందరం ఒక్కసారిగా మీద పడేసరికి ఎలా వెనక్కితగ్గిందో చూశారా అని భ్రమరాంబ అంటుంది. పులి ఒక అడుగు వెనక్కి తగ్గిందంటే వంద అడుగులు ముందుకు వేస్తుందని శేషు అంటాడు. నీకు పవర్స్ ఇస్తాను కానీ నువ్వు ఏ తప్పు చేయవనే నమ్మకం నాకు కలగాలి అని ఇందు అంటుంది. మళ్లీ ఇదేం ఫిటింగ్ అని భ్రమరాంబ అంటుంది.
పుంపుహార ఫిటింగ్ అని శేషు అంటాడు. నేను రెడీ. నీకు నమ్మకం కలగాలి అంటే ఏం చేయాలని ఐశ్వర్య అడుగుతుంది. జీఆర్ గ్రూప్ నుంచి కొత్తంగా టెండర్ నోటిఫికేషన్ వచ్చింది. దానికోసం సిటీలోని అన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి అని ఇందు అంటుంది. ఆ టెండర్ నేను సంపాదించాలి అంతే కదా అని ఐశ్వర్య అంటుంది.
నాకు భయపడకూడదు
అంతే అని ఇందు అంటుంది. ప్రతి సంవత్సరం ఆ టెండర్ స్వరాజ్ గ్రూప్‌కే వస్తుందిగా. ఇప్పుడు కూడా తెలివిగా నన్ను లాక్ చేయాలని చూస్తున్నారు కదా అని ఐశ్వర్య అంటుంది. బిజినెస్‌లో ఎవరి టాలెంట్ వాళ్లది. నేను పోటీగా ఉన్నానని నువ్వు భయపడకూడదు. నాలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నా నువ్వు ఏం చేయగలవనేదే అక్కడ మ్యాటర్. ఇలా చేస్తేనే నీ ఎబిలిటీ వస్తుందని ఇందు అంటుంది.
కుదరకుంటే సంసార బాధ్యతలు తీసుకో అని రాజు రెచ్చగొడతాడు. నాకు డీల్ ఓకే. నేను గెలుస్తానని ఐశ్వర్య వెళ్లిపోతుంది. మరోవైపు మళ్లీ ఇందు, రాజులను కలపడం గురించి పరధ్యానంగా ఆలోచిస్తుంది అపర్ణ. ప్రేమలేఖల ప్లాన్ బెడిసికొట్టిందిగా అని అపర్ణ అంటుంది. ఇంతలో నందు వచ్చి వింటుంది. ఆ లవ్ లెటర్ కాన్సెప్ట్ మీదా. కాన్సెప్ట్ బాగుంది. కానీ, టైమింగ్ కుదర్లేదని నందు అంటుంది.
నేను మీతో చేయి కలుపుతాను. ఏం చేయాలో చెప్పండని నందు అంటుంది. నా దగ్గర ఇంకో ఐడియా ఉందని సుభాష్ చెబుతాడు. తాతయ్య నువ్వు నాటీ. చాలా రొమాంటిక్ ఐడియా. ఈ వయసులో కూడా ఇంతమంచి ఐడియా ఇచ్చావంటే అని నందు అంటే.. కాలేజ్ రోజుల్లో ఎంతమంది దగ్గర ఇంప్లిమెంట్ చేశారో అని అపర్ణ అంటుంది.
స్వాతి అతి ఉత్సాహం
నేను అప్పుడు ఇన్నోసెంట్ అని సుభాష్ అంటాడు. ఐడియా ఇంప్లిమెంట్ చేద్దామని నందు అంటుంది. మరోవైపు మదన్ బ్రష్ వేస్తుంటాడు. ఇంతలో స్వాతి బాస్ వస్తాడు. రెండు నిమిషాల్లో వస్తానని స్వాతి ఉత్సాహంగా అంటుంది. మళ్లీ లిప్‌స్టిక్ పెట్టుకుంటూ రెడీ అవుతుంది స్వాతి. హారన్ కూడా కొట్టలేదు వచ్చాడని ఎలా కనిపెట్టావని మదన్ అడుగుతాడు.
రోజు వచ్చే బైక్ సౌండ్. ఆ మాత్రం గుర్తుపట్టలేనా అని స్వాతి అంటుంది. ఇద్దరు సింక్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకోవాలి అని మదన్ అతనిదగ్గరికి వెళ్తాడు. ఎవరు మీరు అని అడిగితే.. నా గురించి ఇంకా చెప్పలేదా. నేను స్వాతి సీనియర్ని అని అతనంటాడు. ఇంతలో స్వాతి వచ్చి లేట్ అవుతుందని ఇద్దరూ వెళ్లిపోతారు. సేమ్ కాలేజా అని మదన్ అనుకుంటాడు.
మరోవైపు ఇందు రాజును కలిపేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇందు రాగానే నేను సైగ చేస్తాను. నువ్వు గన్ పట్టుకుని ఉండు. రాజు రాగానే మరో సైగ చేస్తాను. రాజుచేతిలోకి గన్ పడేసి నువ్వు బెలూన్ పేల్చు అని అపర్ణ అంటుంది. పువ్వులు ఇందు మీద పడతాయ్. అదంతా రాజు చేశాడని అనుకుంటుంది. తర్వాత మనసు విప్పి మాట్లాడుకుంటారు అని అపర్ణ చెబుతుంది.
తాతయ్య రొమాంటిక్ ప్లాన్ ఫెయిల్
సరేనని పైకి వెళ్లి ఉంటుంది నందు. రాజు వచ్చి హాల్లో ఉంటాడు. ఇందును అపర్ణ పిలుస్తుంది. ఇందు కిందకు వస్తుంది. పైన నందు ఉండటం చూసి అనుమానంగా చూస్తుంది ఇందు. పైన బెలూన్ని కూడా చూస్తుంది ఇందు. హో.. ఇదంతా మీ ప్లానా అని ఇందు అనుకుంటుంది. పక్కనుంచి ఐశ్వర్య వస్తుంది. ఇందు ఆగిపోతుంది.
రాజుపై నందు గన్ పడేస్తుంది. దాన్ని వెంటనే లక్కీ తీసుకుని కాలుస్తాడు. పూలన్నీ ఐశ్వర్యపై పడతాయి. అవన్నీ లవ్ షేపులో ఉంటాయి. లక్కీని లాగిపెట్టి కొడుతుంది ఐశ్వర్య. ఇలాంటి ప్లాన్స్ వేసి నన్ను ఇంప్రెస్ చేయాలని చూడకని ఎన్నిసార్లు చెప్పాలని కోపంగా వెళ్లిపోతుంది లక్కీ. అంతా వెళ్లిపోతారు.
ప్లాన్ ఫెయిల్ అయినందుకు అపర్ణ, సుభాష్‌లను నిందిస్తుంది నందు. దీన్ని చెడగొట్టింది నువ్వే అని అపర్ణ అంటుంది. ఇద్దరు గొడవ పడతారు. రెండుసార్లు మంచి ప్లాన్ చెడగొట్టారని సుభాష్ అంటాడు. వాళ్ల గొడవను నందు చూస్తుంది. ఇద్దరు ఆగిపోతారు. బెలూన్ విషయం గురించి తనకు ముందే తెలుసని ఇందు అంటుంది. ఇదంతా మీ ఇద్దరికోసమే అని సుభాష్, అపర్ణ అంటారు.
రాజుకు లక్కీ వెన్నుపోటు
నాకు మాత్రం ఆశ లేదా. కానీ, ఆశ పడితే బోల్తా పడతాను. రాజు మనసులో నేను ఉన్నానో తెలియాలి. బలవంతంగా పరిస్థితులు క్రియేట్ చేయకూడదు. బావ కోసం నేను ఎదురుచూస్తుంటాను. అందులో బాధ, సంతోషం ఉంటాయి. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకండని చెప్పి ఇందు వెళ్లిపోతుంది. అక్క ప్రేమ గెలుస్తుందని నందు అంటుంది.
తర్వాత రాజు చెబుతుంటే ఇందు జ్యూవెలరీ డిజైన్స్ వేస్తుంటుంది. పక్కనుంచి వెళ్తున్న లక్కీ చూస్తాడు. కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు. డిజైన్ గురించి మాట్లాడుకుంటున్నారా. కష్టపడి డిజైన్స్ వేస్తున్నారా. ఇలా జరకూడదు. టెండర్ ఈసారి ఐశ్వర్యకు రావాలి. ఐశ్వర్య కళ్లలో ఆనందం చూడాలి. తన మనసులో స్థానం సంపాదించాలి. వీళ్ల పని చెడగొట్టాలని లక్కీ అనుకుంటాడు.
వెళ్లి కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్చ చేస్తాడు. లైట్స్ ఆఫు అవుతాయి. కానీ స్వీచ్ దానికదే ఆన్ అవుతుంది. ఇదేంటీ కరెంట్ ఎలా వచ్చిందని మళ్లీ ఆఫ్ చేస్తాడు లక్కీ. అయినా మళ్లీ కరెంట్ వస్తుంది. ఇలాగే జరుగుతుంటుంది. అమ్మనీ.. జెనరేటర్ ఉందిగా అని అందులో చక్కెర పోస్తాడు లక్కీ. ప్రాబ్లమ్ సాల్వ్ అని మెయిన్ ఆఫ్ చేస్తాడు లక్కీ.
లక్కీ ప్లాన్ ఫెయిల్
ఇప్పుడు ఐశ్వర్య దగ్గరికి వెళ్లి మెయిన్ ఆఫ్ చేసింది నేనే. నీకోసం చేశాను. రాజు, ఇందు కష్టపడి డిజైన్స్ వేస్తున్నారు. వాడు నా ఫ్రెండ్ అయిన నీకోసం అది చెడగొట్టేందుకు ఇలా చేశానని లక్కీ చెబుతాడు. నాతోరా చూపిస్తానని ఇందు, రాజులను చూపిస్తాడు లక్కీ. కానీ వాళ్లు క్యాండిల్ పెట్టుకుని డిజైన్స్ వేస్తారు. అది చూసి ఐశ్వర్య, లక్కీ షాక్ అవుతారు.
టెండర్ ఎలా గెలవాలో నాకు తెలుసు. నీ బోడి సలహాలు వద్దని కోప్పడి వెళ్లిపోతుంది ఐశ్వర్య. లక్కీ ప్లాన్ ఫెయిల్ అయిందని తలపట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం త్వరగా వెళ్లాలని ఇందు కంగారుపడుతుంటుంది. లేటుగా లేచామని ఇందు అంటుంది.
కరెంట్ లేదుగా అని రేఖ అంటుంది. క్యాండిల్స్ ఉన్నాయిగా అని ఇందు అంటుంది. ఐశ్వర్యను తీసుకొచ్చి లక్కీ కూడా హడావిడి చేస్తాడు. టిఫిన్ పెడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


