Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఓవైపు అపర్ణ, సుభాష్ పెళ్లిరోజు సెలబ్రేషన్స్.. మరోవైపు వెంకీని నందు అరెస్ట్ చేసే సీన్లతో సాగిపోయింది. వెంకీని కాపాడటానికి ఐశ్వర్యను బాగా ప్లాన్ చేసి బుక్ చేస్తారు రాజు, ఇందు. దీంతో కథలో మరో పెద్ద ట్విస్ట్ రాబోతున్నట్లు స్పష్టమైంది.
అపర్ణ, సుభాష్ పెళ్లిరోజు వేడుకలు

అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకలు జరిపే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. ఇద్దరూ దండలు మార్చుకుంటారు. వాళ్ల షష్టిపూర్తిని రాజు, ఇందు ఎంతో ఘనంగా చేస్తూ మురిసిపోతుంటారు. మరోవైపు రేఖ, భ్రమరాంబ మాత్రం అది చూసి కుళ్లుకుంటారు. ఈ వయసులో వీళ్లకు ఇది అవసరమా అనుకుంటారు. ఆ తర్వాత అసలు షష్టిపూర్తి ఎందుకు జరుపుకుంటారని సుభాష్ ను రాజు అడుగుతాడు.
షష్టిపూర్తి ఎందుకు చేసుకుంటారో చెప్పిన సుభాష్.. అపర్ణ ఎమోషనల్
దీంతో సుభాష్ ఎమోషనల్ అవుతూ దాని వెనుక ఉన్న కారణాన్ని చెబుతాడు. ఓ మగాడు మొదట ఓ తండ్రికి కొడుకుగా పెరిగి పెద్దవాడవుతాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని తాను బాధ్యతలు తీసుకుంటాడు.. 60 ఏళ్ల వచ్చే వరకు పిల్లలు, ఇంటి బాధ్యత తీసుకుంటాడు.. ఆ తర్వాత ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు.. షష్టిపూర్తి అంటే కేవలం మరోసారి దండలు మార్చుకొని పెళ్లి చేసుకోవం కాదు.. అన్నేళ్లు తనకు అండగా నిలిచి, తాను పిల్లల కోసం బయట కష్టపడుతుంటే.. ఇంటి బాధ్యతలు చూసుకునే భార్యకు మరోసారి హామీ ఇవ్వడం.. ఇన్నాళ్లూ నాకోసం బతికాను.. ఇక నుంచి నీకోసం బతుకుతాను అని చెప్పడం అని సుభాష్ అనడంతో అపర్ణ కూడా ఎమోషనల్ అవుతుంది.
ఇంజెక్షన్ గురించి గుర్తు చేసిన భ్రమరాంబ
ఆ తర్వాత అపర్ణ, సుభాష్ కేక్ కట్ చేయడానికి సిద్ధమవుతారు. కేక్ కట్ చేసిన తర్వాత సుభాష్ కు తినిపించబోతే ఇంజెక్షన్ గురించి భ్రమరాంబ గుర్తు చేస్తుంది. మరచిపోయానని సుభాష్ అంటాడు. ఏంటో ఇవాళ అత్తకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది అని రాజు అనుమానిస్తాడు. మా భ్రమరం ఇలా చెప్పిందంటే ఏదో అల్లకల్లోలం జరగబోతోందని అర్థం అని శేషు ఆ అనుమానం మరింత పెరిగేలా మాట్లాడతాడు. ఆ తర్వాత ఇందు ఇంజెక్షన్ కోసం వెళ్తుంది.
ప్లాన్ ఫెయిల్.. కిందపడి పగిలిన ఇంజెక్షన్.. మరొకటి తెచ్చిన ఇందు
{{/usCountry}}ఆ తర్వాత అపర్ణ, సుభాష్ కేక్ కట్ చేయడానికి సిద్ధమవుతారు. కేక్ కట్ చేసిన తర్వాత సుభాష్ కు తినిపించబోతే ఇంజెక్షన్ గురించి భ్రమరాంబ గుర్తు చేస్తుంది. మరచిపోయానని సుభాష్ అంటాడు. ఏంటో ఇవాళ అత్తకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది అని రాజు అనుమానిస్తాడు. మా భ్రమరం ఇలా చెప్పిందంటే ఏదో అల్లకల్లోలం జరగబోతోందని అర్థం అని శేషు ఆ అనుమానం మరింత పెరిగేలా మాట్లాడతాడు. ఆ తర్వాత ఇందు ఇంజెక్షన్ కోసం వెళ్తుంది.
ప్లాన్ ఫెయిల్.. కిందపడి పగిలిన ఇంజెక్షన్.. మరొకటి తెచ్చిన ఇందు
{{/usCountry}}ఇంజెక్షన్ తీసుకొని తిరిగి వచ్చే క్రమంలో ఫోన్ రావడంతో ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఆలస్యం అవుతుండటంతో రాజు వెళ్లి ఇందు చేతుల్లో నుంచి ఇంజెక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అది కింద పడి పగిలిపోతుంది. అది చూసి రేఖ, భ్రమరాంబ షాకవుతారు. తమ ప్లాన్ ఫెయిలైందని తెలియడంతో రాజును భ్రమరాంబ తిడుతుంది. చూసుకోనక్కరలేదా అని అంటుంది. ఏంటీ ఓవర్ చేస్తున్నావంటూ రాజు ఆమెను అడుగుతాడు. అప్పుడే ఇందు వచ్చి మరో ఇంజెక్షన్ ఫ్రిజ్ లోపెట్టాను తెస్తానంటూ వెళ్తుంది. ఆ ఇంజెక్షన్ సుభాష్ కు ఇస్తుంది.
వెంకీని ఇంటికెళ్లి అరెస్ట్ చేసిన నందు
ఓవైపు ఇక్కడ వేడుకలు జరగుతుండగా.. అటు వెంకీ, చలపతి, లక్ష్మీ ఇంట్లో తినడానికి కూర్చుంటారు. అప్పుడే నందు పోలీస్ యూనిఫామ్ లో ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకొని ఇంటికి వస్తుంది. ఆమెను అలా చూసి అందరూ షాకవుతారు. ఈ టైమ్ లో ఇలా వచ్చావేంటి.. ఎలా ఉన్నావ్ అంటూ కుశల ప్రశ్నలు అడుగుతారు చలపతి, లక్ష్మి. కానీ తాను పలకరించడానికి రాలేదని, వెంకీని అరెస్ట్ చేయడానికి వచ్చానని చెప్పడంతో షాకవుతారు.
తానేం తప్పు చేయలేదని వెంకీ అంటాడు. బంగారాన్ని మార్చి దొంగ బంగారం పెట్టావని మీ కంపెనీ జీఎం కేసు పెట్టాడని నందు చెబుతుంది. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని చలపతి, లక్ష్మీ వాదించినా.. కేసు వెంకీపైనే అని స్పష్టం చేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది నందు. దీంతో లక్ష్మి, చలపతి కంగారుపడతారు.
రాజుకు ఫోన్ చేసి చెప్పిన చలపతి.. ఐశ్వర్యకు వార్నింగ్
అటు ఇంట్లో వేడుకల్లో బిజీగా ఉన్న రాజుకు చలపతి ఫోన్ చేస్తాడు. నందు వచ్చి వెంకీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిందని చెబుతాడు. ఏదో దొంగ బంగారం కేసు పెట్టి ఇరికించారని అంటాడు. అది విన్న ఇంట్లో వాళ్లు కూడా షాకవుతారు. ఐశ్వర్య, రేఖ మాత్రం సంతోషిస్తారు. ముందే అనుకున్నాను.. అన్న రూట్లోనే తమ్ముడు కూడా వెళ్తున్నాడు.. ఇలాంటి పనులే చేస్తాడు అని ఐశ్వర్య అంటుంది.
దీంతో రాజు ఆమెపై మండిపడతాడు. అంతేకాదు ఆమెపైనే అతనికి అనుమానం కలుగుతుంది. స్టేషన్ కు వెళ్తున్నాను.. ఇందులో నీ పేరు వస్తే మాత్రం నిన్ను వదలను అని ఐషూకి వార్నింగ్ ఇస్తాడు. ఆమెకు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నావని రేఖ అడిగినా కూడా రాజు పట్టించుకోడు.
స్టేషన్‌కు చలపతి, లక్ష్మి.. కుట్ర జరుగుతుందన్న వెంకీ.. హామీ ఇచ్చిన నందు
అటు అప్పటికే చలపతి, లక్ష్మి స్టేషన్ కు వెళ్తారు. వెంకీని సెల్ లో చూసి లక్ష్మీ ఏడుస్తూనే ఉంటుంది. నందు తన డ్యూటీ తాను చేసిందని, ఆమెను ఏమీ అనొద్దని వెంకీ అంటాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఏదో కుట్ర జరగుతోందని, ఎవరో కావాలని ఇరికించారిన వెంకీ అంటాడు. ఓ పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ తాను చేశానని, అదే సమయంలో ఓ ఫ్రెండ్ గా వెంకీని ఎలా బయటకు తీసుకు రావాలో కూడా ప్లాన్ చేసినట్లు నందు చెబుతుంది. అప్పుడే రాజు, ఇందు కూడా వచ్చి ఏం జరిగిందో తెలుసుకుంటారు.
ఐశ్వర్యను నిలదీసి.. బుక్ చేసి..
ఇంటికి వెళ్లి రాజు మరోసారి ఐశ్వర్యను నిలదీస్తాడు. కానీ ఆమె తనకేమీ తెలియదని బుకాయిస్తుంది. దీంతో ఆమెను ఎలాగైనా బుక్ చేయాలని రాజు, ఇందు ప్లాన్ చేస్తారు. నేరుగా వెంకీ కంపెనీ జీఎం దగ్గరికి వెళ్తారు. రహస్యంగా పక్కనుంచి మరో వ్యక్తితో వీడియో తీయిస్తారు. అసలు ఏం జరిగింది? ఐశ్వర్యను ఇందులో నుంచి ఎలా తప్పించారన్న వివరాలు రాబడతారు. ఈ క్రమంలోనే వెంకీని ఇరికించినట్లు అతడు చెబుతాడు. దీంతో రాజు, ఇందు షాకవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.