...
...
Next Story

బ్రహ్మముడి అక్టోబర్ 25 ఎపిసోడ్: కావ్యకు తొలిగిపోయిన అబార్షన్ ప్రమాదం- క్షేమంగా బిడ్డను కనొచ్చన్న డాక్టర్- ఆందోళనలో రాజ్

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో కావ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. కానీ, అది ఎవరు నమ్మరు. తర్వాత హాస్పిటల్‌కు కావ్యను తీసుకెళ్తారు. కావ్యకు తెలియకుండా అబార్షన్ చేయమని డాక్టర్‌కు చెబుతారు. కావ్య రిపోర్ట్స్ చూసిన డాక్టర్ ఇక బేబీని కనొచ్చు అని చెబుతుంది. దాంతో ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు.

Published on: Oct 25, 2025, 07:24:52 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో కావ్య ప్రసాదం ఇస్తే ఎవరు తీసుకోరు. నువ్వు మనసు మార్చుకుని మేము చెప్పినట్లు వినకుంటే నువ్వు ఇచ్చే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోము అని ఇందిరాదేవి అంటుంది. అవునా, అయితే మరి ఇవాళ చేసిన పెసరట్టు ఉప్మా, వడలు, పూరీలు ఏమైపోతాయి అని ఊరిస్తుంది కావ్య.

కిందపడిపోయిన కావ్య

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 25 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 25 ఎపిసోడ్

ఇందిరాదేవి టెంప్ట్ అవడంతో అత్తయ్య కంట్రోల్ అని అపర్ణ గుర్తు చేస్తుంది. దాంతో తినేది లేదని చెబుతుంది ఇందిరాదేవి. నేను కూడా తగ్గేది లేదు అని ముందుకు నడిచిన కావ్య కింద పడిపోతుంది. అయ్యో కావ్య కింద పడిపోయిందని రుద్రాణి చెబుతుంది. కానీ, ఎవరు నమ్మరు. కావ్య కింద కావాలని పడిందని, నాటకం స్టార్ట్ చేసిందని అంతా అనుకుంటారు.

కావ్య లే.. అక్క లే మేము నీ నాటకాలు నమ్మట్లేదు అని అంతా అంటారు. కాసేపటికి స్వప్న, అప్పు చూసి నిజంగానే అక్క కళ్లు తిరిగి పడిపోయిందని చెబుతారు. దాంతో అంతా కంగారుపడతారు. కట్ చేస్తే హాస్పిటల్‌లో కావ్యకు డాక్టర్ ట్రీట్‌మెంట్ చేస్తుంటుంది. బయటకు వచ్చిన డాక్టర్‌ను ఏమైందని రాజ్ అడుగుతాడు. బేబీ ఫ్లక్చువేట్ అవుతుంది. కంగారుపడకండి. కొన్ని టెస్టులు చేయిస్తున్నా. రిపోర్ట్స్ వచ్చాకా తన పరిస్థితి ఏంటో తెలుస్తుందని వెళ్లిపోతుంది డాక్టర్.

కావ్య గురించి బాధగా మాట్లాడుతుంది అపర్ణ. కావ్య ఎలాగు స్పృహలో లేదు. పరీక్ష పెట్టిన దేవుడే మనకు కావ్యను కాపాడుకునే దారి ఇచ్చాడు. కావ్య స్పృహలోకి వచ్చేముందే అబార్షన్ చేయిద్దాం. కావ్యను కాపాడుకోవాలంటే ఇది తప్పదు. ఇది రాజ్ తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు చెప్పురా రాజ్ అని ఇందిరాదేవి అంటుంది. నాకు కళావతి జీవితం ముఖ్యం. నువ్వు చెప్పిందే కరెక్ట్ నానమ్మా అని రాజ్ అంటాడు.

అడ్డుపడిన రుద్రాణి

రేపు ఏం జరుగుతుందనేది అవసరం. ఇప్పుడు కావ్యను కాపాడుకోవడం ముఖ్యం అని ఇందిరాదేవి అంటుంది. కావ్య జీవితం కోసం జైలులో కూర్చొన్న పర్లేదని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే మీతో వేరే విషయం గురించి మాట్లాడాలని లోపలికి వెళ్తారు. కావ్యను అబార్షన్ గురించి ఒప్పించలేకపోయాం. బిడ్డనే కంటానంటుంది. ఇప్పుడు తను స్పృహలో లేదుగా అబార్షన్ చేసి నా భార్యను బతికించండి అని రాజ్ అంటాడు.

దాంతో డాక్టర్ కోప్పడుతుంది. తనకు తెలియకుండా అబార్షన్ చేయాలా. మీ బాధ అర్థం చేసుకోగలను. కానీ, అబార్షన్ అనేది తల్లికి తెలియకుండా చేయకూడదు. అది క్రైమ్ అవుతుంది. ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని అంటుంది డాక్టర్. తను బిడ్డను కంటే తన ప్రాణాలకే రిస్క్ అవుతుందిగా. కాబట్టి ఇది కూడా అత్యవసర పరిస్థితే అని రాజ్ అంటాడు.

కావ్య ప్రాణాలకు లేని ప్రమాదం

నిజమే. కానీ, కావ్య పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయలేం అని డాక్టర్ అంటుంది. రుద్రాణి డాక్టర్‌కే సపోర్ట్ చేస్తుంది. ఇంతలో కావ్య రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ చెక్ చేసి వస్తానని డాక్టర్ వెళ్తుంది. కావ్య స్పృహలోకి వస్తుంది. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తుంది. బయటకు వచ్చిన డాక్టర్ కంగ్రాట్స్ రాజ్ మీకు గుడ్ న్యూస్ అని డాక్టర్ అంటుంది. ఏంటది అని రాజ్ అంటాడు.

మీ వైఫ్ ప్రాణాలకు ప్రమాదమనేగా అబార్షన్ చేయించాలనుకుంటున్నారు. ఇక అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదు. తన గర్భసంచికి ప్రాబ్లమ్ ఉందన్నది నిజం. గర్భసంచి చిన్నదిగా ఉండటం వల్ల నెలలు నిండిన కొద్ది తల్లి ప్రాణానికి ప్రమాదం వస్తుందన్నది నిజం. కానీ, ఇప్పుడు అదంతా మారిపోయింది. గర్భసంచిలో డెవలప్‌మెంట్ కనిపిస్తుంది. బిడ్డను క్యారీ చేయడం వల్ల కావ్యకు ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెబుతుంది.

దాంతో అంతా సంతోషిస్తారు. ఆ దేవుడు ఉన్నాడని ఇందిరాదేవి అంటుంది. డాక్టర్లు అబద్ధం చెప్పరు. ఒకరి ప్రాణంతో ఆడుకోరు. రిపోర్ట్స్ చూసి చెబుతున్నాను అని డాక్టర్ అంటుంది. థ్యాంక్యూ సో మచ్ డాక్టర్ అని రాజ్ సంతోషిస్తాడు. రుద్రాణి మాత్రం షాక్ అయి ఓర్వలేకపోతుంది. కట్ చేస్తే అంతా ఇంట్లో ఉంటారు. కావ్యతో చెబుతూ సంతోషిస్తారు.

భయానికి స్వస్తి

బిడ్డను కంటే తల్లికి ప్రమాదమని తెలిసి భయపడిపోయాం. ఇక ఆ భయానికి స్వస్తి ఆ బాధ పటాపంచలు అయిపోయిందని ఇందిరాదేవి అంటుంది. ఇక చాలు అమ్మమ్మ. ఈ ఏడుపులు పెడబొబ్బులతో విసిగిపోయాను. మీరు కోరుకుందే జరుగుతుంది. ఈ క్షణం నుంచి అందరం ఆనందంగా ఉందాం అని కావ్య అంటుంది.

ఆనందం అంటే ఏంటో నువ్వే చూస్తావుగా అని సీతారామయ్య అంటాడు. రాజ్ మాత్రం డల్‌గా ఉంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe