...
...
Next Story

Brahmamudi October 27 Episode: బ్రహ్మముడి- రాజు అద్దె మొగుడు అని చెప్పేసిన లక్కీ- ఫ్రెండ్‌కి విశ్వాసఘాతకుడిగా రేఖ కొడుకు

Brahmamudi Serial October 27th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 27వ ఎపిసోడ్‌‌లో వెంకీ మేనేజర్‌కి విషం తాగించినట్లు చెప్పి రాజు, ఇందు నిజాలు బయటపెట్టిస్తారు. వెంకీ కాళ్లు పట్టుకునేలా చేస్తారు. ఐశ్వర్యే అంతా చేసిందని ఒప్పుకుంటాడు మేనేజర్. ఇందుకు రాజు అద్దె మొగుడుగా వచ్చాడని లక్కీ చెప్పేస్తాడు.

Published on: Oct 27, 2026, 09:51:13 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు, ఇందు డాక్టర్ వేషంతో నటించే యాక్టర్‌ను కలుస్తారు. వెంకీ మేనేజర్‌తో నిజం రాబట్టేందుకు ప్లాన్ వేస్తారు. నేను వాడితో మాట్లాడుతున్నప్పుడు అదంతా వీడియో తీయమని యాక్టర్‌కి చెబుతాడు రాజు.

పక్కా 420 మెటీరియల్

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్

రెస్టారెంట్‌లో వెంకీ మేనేజర్‌ను కలుస్తారు రాజు, ఇందు. రేపు డీల్ గురించి ఆఫీస్‌లో మాట్లాడుకుందామని రాజు అంటాడు. ఈరోజుల్లో డబ్బు చుట్టూనే బంధాలన్నీ తిరుగుతున్నాయని మేనేజర్ చెబుతాడు. మీరు డీల్ కరెక్ట్‌గా ఫినీష్ చేయగలరా. మాకేం సమస్య రాదుగా అని రాజు అడుగుతాడు. ఐశ్వర్యకు డీల్ చేసింది నేనే. ఆ దుగ్గిరాల ఇంట్లో ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే ఐశ్వర్య. పక్కా 420 మెటీరియల్. మీ అక్క గురించి చెబుతున్నందుకు సారీ అని మేనేజర్ అంటాడు.

ఐశ్వర్యను ఎలా కాపాడారు అని రాజు అడుగుతాడు. అది చెప్పకూడదు సర్ అని మేనేజర్ అంటాడు. ఇతనితో అయ్యేలా లేదని రాజు వెళ్లబోతుంటే మేనేజర్ ఆపి జరిగింది చెబుతాడు. కొంతమంది అమాయకులను తీసుకుని వాళ్లదే నేరమని రుజువు చేస్తాం. అలా వెంకీని చేశాం. వాళ్లు జైలుకు వెళ్తారు, మనం జాలీగా ఉంటామని మేనేజర్ చెబుతాడు. ఇంతలో వెయిటర్ జ్యూస్ తీసుకొస్తాడు.

ఫ్యూచర్‌లో జరిగే మన డీల్‌కి చిన్న ట్రీట్. తాగండని ఇందు అంటుంది. మేనేజర్ జ్యూస్ తాగుతాడు. తర్వాత బయటకు మేనేజర్‌ను తీసుకెళ్లి రాజు కొడతాడు. జరిగింది చెప్పాలని, నీ జ్యూస్‌లో పాయిజన్ కలిపాం. కాసేపట్లో నీకు చెమటలు వస్తాయి. తర్వాత చనిపోతావని రాజు చెబుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఇంగ్లీషులో పాయిజన్ గురించి చెబుతాడు.

యాంట్ డోట్ ఇవ్వాలి

ఇంతలో చలపతి వస్తాడు. కేసు పెట్టిందని చెప్పడంతో చలపతి చావబాదుతాడు. లక్ష్మి వచ్చి కొడవలి ఎత్తుతుంది. మీరు చంపకున్న వాడే చనిపోతాడని డాక్టర్ అంటాడు. వెంకీ కాళ్లు పట్టుకుని బతిమిలాడుకుంటాడు. చలపతి, లక్ష్మి కాళ్లు కూడా పట్టుకుంటాడు. ఆ కేసుతో వెంకీకి సంబంధం ఏం లేదు. అదంతా ఐశ్వర్య చేసిందంటాడు మేనేజర్.

మేనేజర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదిగో ఈ అడ్రస్‌కి వెళ్లు అని చిట్టీ ఇస్తాడు వెంకీ. వెళ్దామని మేనేజర్ తొందరపెడితే.. ఇది పోలీస్ స్టేషన్ అడ్రస్ అయ్యా అని డాక్టర్ చెబుతాడు. అక్కడికి వెళ్లి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే యాంటీ డోట్ దొరుకుతుందని రాజు అంటాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నిజాలు ఒప్పుకుంటానంటాడు మేనేజర్.

ఐశ్వర్యే చేసినట్లు సాక్ష్యాలు

నందు దగ్గరికి వెళ్తారు. నిజాలు ఒప్పుకుంటాడు మేనేజర్. వెంకీని కావాలనే ఇరికించానని, నన్ను అరెస్ట్ చేయండి మేడమ్ అని మేనేజర్ అంటాడు. సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేయలేనుగా అని నందు అంటే.. అన్ని ఆధారాలు నా మెయిల్‌లో ఉన్నాయని మేనేజర్ అంటాడు. ఐశ్వర్యతో కలిసి డీల్ చేస్తుంటే వెంకీని ఇరికించమని చెప్పిందని మేనేజర్ అంటాడు.

యాంటీ డోట్ మర్చిపోయానని డాక్టర్ చెబుతాడు. దాంతో మరింత భయపడిపోతాడు మేనేజర్. ఇంకా పది సెకన్లే ఉన్నాయి అని కౌంట్ చేస్తుంది ఇందు. దాంతో కిందపడిపోతాడు మేనేజర్. నీళ్లు చల్లి లేపుతారు. చచ్చి బతికావని ఇందు చెబుతుంది. అసలు నీ బాడీలో విషం లేదు. చెమటలు, వణికేలా ట్యాబ్లెట్ ఇచ్చామని రాజు చెబుతాడు.

మేనేజర్ మాట్లాడింది అంతా వీడియో తీసింది చూపిస్తాడు. డాక్టర్‌గా వచ్చిన యాక్టర్‌కి రూ. 10 వేలు కొట్టమని మేనేజర్‌కే చెబుతాడు. దాంతో మేనేజర్ డబ్బు పంపిస్తాడు. నందు అరెస్ట్ చేస్తుంది. ఇదంతా చేసిన ఐశ్వర్యను ఏం చేద్దామో చెప్పు. తనను జైలుకు పంపించేవరకు ఊరుకోను అని రాజు ఆవేశంగా ఉంటాడు. కారులో వెళ్తారు.

ఆ కలుపు మొక్కను తుంచేసి ఉంటే

ఓ చోట ఆపి ఐశ్వర్య గురించి మాట్లాడుకుంటారు. ఐశ్వర్యను అరెస్ట్ చేయిస్తే దుగ్గిరాల కుటుంబానికి మచ్చ అవుతుంది. నేనే కొట్టి నాలుగు గోడల మధ్య చేద్దామని ఇందు అంటుంది. దాంతో ఏం లాభం లేదు. మీ తాతయ్య గారు మంచితనంతో ఒక కలుపు మొక్కను నాటారు. అది విషం చిమ్మి అందరి ప్రాణాలు తీసింది. అదే ఆ మొక్కను మొదటే తుంచేసి ఉంటే నీకు తల్లిదండ్రులు ఉండేవారు. అప్పుడు ఈ రేఖ, భ్రమరాంబ ఎవరు ఉండేవారు కాదని రాజు అంటాడు.

నాకు కోపం ఎక్కువై ఉండొచ్చు కానీ దానివల్ల మంచే జరుగుతుందని రాజు అంటాడు. మరోవైపు చలపతి ఇంటికి నందు వెళ్తుంది. గడపదాటి అడుగు వేయడానికి ఆలోచిస్తుంది నందు. లోపలికి రమ్మంటే రాదు. చలపతి అన్నమాటలను గుర్తు చేస్తుంది. మేనేజర్ నిజం ఒప్పుకున్నాడు. నీ మీద కేసు కొట్టేశారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని నందు అంటుంది.

ఈ మాట చాలని లక్ష్మి అంటుంది. చలపతి మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. గుమ్మంపైనే ఆర్డర్ కాపీ పెట్టి వెళ్లిపోతుంది నందు. చలపతి ఆపడు. లక్ష్మి వెళ్లి మాట్లాడుతుంది. అంకుల్‌ను తప్పుగా అర్థం చేసుకోలేదని, కోపం లేదని, పైగా వెంకీ బయటపడినందుకు సంతోషంగా ఉందని నందు చెప్పి వెళ్లిపోతుంది.

రాంగ్ రూట్‌లో ఇంట్లోకి వచ్చావ్

చేసిన నేరానికి ఐశ్వర్యను ఇందు మాటలు అంటుంది. ఇంకోసారి చేస్తే ఇంట్లో స్థానం ఉండదంటుంది. ఇందును ఐషు కొట్టబోతుంటే రాజు కొట్టబోతాడు. రాజును ఆపిన లక్కీ ఎదురుతిరుగుతాడు. ఇందును అబద్ధపు పెళ్లి చేసుకుని డబ్బుకోసం రాంగ్ రూట్‌లో ఇంట్లో అడుగుపెట్టిన అద్దె మొగుడువి అని లక్కీ అంటాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. ఈ ఇందు వీడికి డైలీ పేమెంట్ ఇచ్చి యాక్ట్ చేయించింది అని లక్కీ నిజం బయటపెడతాడు. ఎంతో నమ్మిన ఫ్రెండ్ రాజుకు నమ్మకద్రోహం చేసి విశ్వాసఘాతకుడిగా రేఖ కొడుకు లక్కీ నిలుస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks