Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు, ఇందులకు పెళ్లి కాలేదన్న నిజం లక్కీ బయటపెడతాడు. ఎంత మోసం చేశావు, ఇంత టార్చర్ పెట్టావని రేఖ అంటుంది. డబ్బుకోసం మమ్మల్ని రోజు చీట్ చేస్తున్నావా అని భ్రమరాంబ అంటుంది. ఇందులో రాజు తప్పేంలేదు అని ఇందు అంటుంది.
రాజుకు ఇక్కడ ఉండే అర్హత లేదు

రాజుకు ఇక్కడే ఉండే అర్హతే లేదు. వెళ్లురా ఇక్కడి నుంచి అని రేఖ అంటుంది. ఏయ్.. రేఖ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇక చాలు ఆపు. రాజు ఇంట్లో ఉండాలా వద్దా అని తేల్చాల్సింది నువ్వు కాదు నేను. ఇందు రాజుల పెళ్లి అప్పుడు అబద్ధం కావచ్చు.. కానీ, ఇప్పుడు నిజం చేస్తానని అపర్ణ అంటుంది. అసలు వాడు ఎవడో ఏంటో తెలియకుండా ఎలా పెళ్లి చేస్తారని భ్రమరాంబ అంటుంది.
అసలు వాడు ఎవడో తెలుసా అని అపర్ణ అంటుంటే ఇందు ఆపుతుంది. నువ్వు నీ తమ్ముడిని రేఖకు ఎలా పెళ్లి చేశావో అలాగే చేస్తానని, నాకు కావాల్సింది ఉత్తమ లక్షణాలు, పుట్టుపూర్వోత్తరాలు కాదని అపర్ణ అంటుంది. మీ ఇద్దరు ఒక్కటైతే సంతోషంగా ఉంటారనే నమ్మకంతో అడుగుతున్నా. ఇందును పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైనా అని రాజును అడుగుతుంది అపర్ణ.
ఇంతలో చలపతి ఎంట్రీ ఇచ్చి నాకు ఇష్టం లేదని అంటాడు. ఏంటీ ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ. ఇలా అవమానాలు పడేందుకా ఇక్కడికి వచ్చావా. ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను అని చలపతి అంటాడు. అంతా తెలిసి ఇలా ఎందుకు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటని అపర్ణ అడుగుతుంది. వాడు కొత్త సమస్యల్లో పడతాడు. దానికి నేను ఒప్పుకోను అని చలపతి అంటాడు.
రాజు పెళ్లికి ఒప్పుకోని చలపతి
అసలు ఒప్పుకోడానికి నువ్వెవరు. ఒప్పుకోడానికి కారణం చెప్పండని అపర్ణ నిలదీస్తుంది. చలపతి ఈ ఇంటి సంబంధాన్ని నో అంటున్నాడు. కారణం ఏంటీ. రాజుకు ఏమైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా అని రేఖ అంటాడు. మీ కుటుంబం ఎన్ని కష్టాలు పడిందో గుర్తుందిగా. ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కాపాడగలను అని చలపతి అంటాడు. మీ నాన్న విషయం పక్కనపెట్టు ఇందును పెళ్లిచోసుకోవడం నీకిష్టమేనా అని అపర్ణ అడుగుతుంది.
{{/usCountry}}అసలు ఒప్పుకోడానికి నువ్వెవరు. ఒప్పుకోడానికి కారణం చెప్పండని అపర్ణ నిలదీస్తుంది. చలపతి ఈ ఇంటి సంబంధాన్ని నో అంటున్నాడు. కారణం ఏంటీ. రాజుకు ఏమైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా అని రేఖ అంటాడు. మీ కుటుంబం ఎన్ని కష్టాలు పడిందో గుర్తుందిగా. ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కాపాడగలను అని చలపతి అంటాడు. మీ నాన్న విషయం పక్కనపెట్టు ఇందును పెళ్లిచోసుకోవడం నీకిష్టమేనా అని అపర్ణ అడుగుతుంది.
{{/usCountry}}రాజు మళ్లీ అడుగుతున్నా. నీకు ఈ ఇల్లు కావాలా ఈ తల్లిదండ్రులు కావాలా అని చలపతి అంటే.. ఇందును ఒంటరి చేసి వెళ్లకని అపర్ణ వేడుకుంటుంది. ఈసారి ఈ ఇల్లు దాటి రాకుంటే నా శవాన్ని చూస్తావురా అని చలపతి అంటాడు. మా నాన్న ఇష్టమే నా ఇష్టమని రాజు అంటాడు. రాజు ఇది మనస్ఫూర్తిగా చెబుతున్నావా అని ఇందు అడుగుతుంది.
మా నాన్న మాటను కాదని నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని రాజు అంటాడు. అందరూ విన్నారుగా. ఇక ఇందులో ఎవరు జోక్యం చేసుకోకండని రాజును లాక్కెళ్తాడు చలపతి. ఇందు, అపర్ణ ఏడుస్తుంటారు. గదిలోకి వెళ్లిన ఇందును అపర్ణ రాజు గురించి అడుగుతుంది. రాజును ఆపాలని అనిపించలేదా. రాజు ఇంటి వారసుడు అని చెబితే అందరి నోళ్లు మూతపడేవి అని అపర్ణ అంటుంది. చలపతి అంకుల్‌కి రాజు నిజం బయటపెట్టనని మాటిచ్చాను అని ఇందు అంటాడు.
రేఖ చేతికి ఇంటి పగ్గాలు
రాజు చలపతి కొడుకే కాదు. మనకే అధికారం ఉంటుందని అపర్ణ అంటుంది. ఇన్నేళ్లు రాజును బాగా చూసుకున్నారు. మనకంటే ఎక్కువగా అధికారం వాళ్లకే ఉందని ఇందు అంటుంది. రాజును నువ్వు పెళ్లి చేసుకోకపోతే రాజుకు గండం అని చెప్పింది మర్చిపోయావా. చలపతి భయపడుతున్నాడని వదిలేస్తావా. వీటన్నింటికి ఒక్కటే పరిష్కారం మీ పెళ్లి. అవసరమైతే చలపతి కాళ్లు పట్టుకుంటాను అని అపర్ణ అంటుంది.
ఇప్పుడే వెళ్లి మాట్లాడదాం పదా అని ఇందును కిందకు తీసుకొస్తుంది అపర్ణ. రేఖ ఆపి ఎక్కడికి అని అడుగుతుంది. నాకు నచ్చినచోటికి తీసుకెళ్తానని అపర్ణ అంటుంది. అది పెళ్లి అయినప్పుడు ఇప్పుడు కాదు. ఇక మీ ఇష్టాలు నా కంట్రోల్‌లో ఉంటాయని రేఖ అంటుంది. రాజుతో పెళ్లి చేయించి తీసుకొస్తానని అపర్ణ అంటుంది. రెండు నిమిషాలు ఆగి టీవీలో వచ్చే ఫ్లాష్ న్యూస్ చూడండని రేఖ చెబుతుంది.
టీవీ ఆన్ చేస్తుంది. అడ్డంగా బుక్కైన దుగ్గిరాల కుటుంబం. నగలో బిజినెస్‌లో అగ్రగామిగా వస్తున్న దుగ్గిరాల కుటుంబంలోని ఇంద్రాదేవి ఫేక్ పెళ్లి కొడుకును పెట్టుకుని మోసం చేసింది. అలాంటి ఆడది క్లైంట్స్‌ను మోసం చేయకుండా ఉంటుందా. ఇలాంటి వాళ్లను నమ్మి కంపెనీలో నగలు కొంటామా అని భ్రమరాంబ చెబుతుంది. అదంతా చూసి ఇందు, అపర్ణ షాక్ అవుతారు.
న్యూస్‌తో బ్లాక్‌మెయిల్
భ్రమరాంబ వచ్చి నా పర్ఫామెన్స్ ఎలా ఉందంటుంది. ఈ న్యూస్ బయటకెళ్తే మన బిజినెస్ అంతా పడిపోతుంది. మీ పరువు అంతా పోతుంది. దుగ్గిరాల కుటుంబం రోడ్డునపడుతుందని రేఖ అంటుంది. ఇప్పుడు కూడా అడుగుపెట్టి రాజు దగ్గరికి వెళ్తే ఇదంతా బయటకొస్తుందని రేఖ అంటుంది. నువ్వు నాలుగు మాటలు చెబితే క్లైంట్స్ నమ్ముతారా పదా ఇందు అని అపర్ణ అంటే.. ఇందు ఆపుతుంది.
ఇందు రానని పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. జరగబోయే నష్టం గురించి ఇందుకు అర్థమైందని రేఖ అంటుంది. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు ఇష్టం లేకుండా ఎవరైనా ప్రవర్తించాలని చూస్తే అస్సలు క్షమించను అని రేఖ అంటుంది. మళ్లీ రేఖ పవర్, పగ్గాలు చేతికి తీసుకుంటుంది. ఎందుకు ఆగిపోయావని అపర్ణ అంటే.. ఒక్కసారి కంపెనీ గురించి తప్పుగా అనుకుంటే లక్షలాది మంది రోడ్డునపడతారని ఇందు అంటుంది.
అటు రాజు, ఇంటు ఇందు ఒకరినొకరు తలుచుకుంటూ బాధపడుతుంటారు. రాజు ఇంటికి కారులో లక్కీ వస్తాడు. రాజు మొహం తిప్పుకుంటాడు. ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడతానని అనుకోలేదు. ఆవేశంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేదు. మాట తూలాను. ఇన్ని రోజులు చెప్పనిది మనమధ్య బంధంతోనేగా. కానీ నిన్న ఎందుకు మాట్లాడానో అర్థంకావట్లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలుసురా అని లక్కీ అంటాడు.
లక్కీ పశ్చాత్తాపం
దాంతో లక్కీ కాలర్ పట్టుకుని అక్కడ వాగాల్సింది వాగి ఇక్కడ పశ్చాత్తాపపడితే సరిపోతుందా. నీ ఆవేశంలో రెండు జీవితాలు నాశనం చేశావు. ఐషు ముందు గొప్పోడివి అవ్వాలని చూసి ఎవరికి మంచి జరిగిందిరా. ఇందు ఎన్నో ఆశలు పంచుకుంది. తన కలలన్నీ చెల్లాచెదురు అయ్యాయి. అక్కడున్న మనుషుల గురించి ఒక్క క్షణం ఆలోచించావా. ఇందు ఏం చేసిందిరా అని రాజు అంటాడు.
ఇప్పుడు ఇందుతో మాట్లాడేందుకు, ఆ ఇంటి గడపతొక్కేందుకు నాన్న ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎలా నా మనసు ఇందుతో ఉన్నా కాళ్లు మాత్రం ఈ గడప దాటి వెళ్లేందుకు కుదరట్లేదు. ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించను. మనసుకు దగ్గరైన మనిషిని దూరం చేస్తే దాన్ని ఎవరు పూర్తి చేయలేరు అని రాజు అంటాడు. నీ మీద చాలా కోపంగా ఉంది. అది బయటకు రాకముందే వెళ్లిపోరా అని లోపలికి వెళ్లిపోతాడు రాజు.
ఇందుకు పెళ్లి చూపులు
మరుసటి రోజు ఇందుకు కాబోయే భర్త అని ఓ ఫోటో చూపిస్తుంది రేఖ. ఈరోజే పెళ్లిచూపులకు వస్తున్నారని రేఖ అంటుంది. పెళ్లి చూపులు జరిగినా ఏం జరిగిన నేను పెళ్లి చేసుకునేది బావనే. బావ నాకోసం వస్తాడని అపర్ణతో ఇందు అంటుంది. ఇందుకు పెళ్లి చూపులు అని రాజుతో చెబుతుంది నందు. అది చలపతి, లక్ష్మి వింటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.