...
...
Next Story

బ్రహ్మముడి అక్టోబర్ 31 ఎపిసోడ్: లింగరాజుగా రాజ్, మంగతాయారుగా కావ్య- బుట్టలో పడిన కుయిలి- నాటకం తెలుసుకున్న కుయిలి భర్త

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో కుయిలి ఇంటికి రాహుల్ వెళ్తాడు. అది చూసి కుయిలి షాక్ అవుతుంది. కుయిలి భర్త మాత్రం మెల్లిగా పంపించాలని అంటాడు. రాజ్, కావ్య తాత బామ్మలుగా ఎంట్రీ ఇస్తారు. వాళ్ల కోట్ల ఆస్తి రాహుల్‌కే అనడంతో రాజ్, కావ్య బుట్టలో పడిపోతుంది కుయిలి. రాహుల్ మాత్రం నాటకం కనిపెడతాడు.

Published on: Oct 31, 2025, 06:58:04 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడు అని భర్తతో కుయిలి అంటుంది. విడాకులు ఇస్తే సరిపోదు వాడి ఆస్తి కూడా రావాలి అని కుయిలి భర్త అంటే.. ముందు విడాకులు ఇస్తే తర్వాత ఆస్తి దానంతట అదే వస్తుందని కుయిలి అంటుంది. ఇంతలో సూట్‌కేస్‌తో రాహుల్ వస్తాడు.

కుయిలి ఇంటికి రాహుల్

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 31 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 31 ఎపిసోడ్

అది చూసి కుయిలి షాక్ అవుతుంది. ఇంట్లో మన ప్రేమను ఒప్పుకోవట్లేదు. అందుకే వాళ్లతో తెగదెంపులు చేసుకుని వచ్చాను అని రాహుల్ అంటాడు. వీడేంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. ఆస్తి లేకపోతే నువ్వేందుకు నాకు అని మనసులో అనుకుంటుంది కుయిలి.

పెళ్లయి పాప ఉన్నాక కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకొంటానంటే ఎవరు ఒప్పుకోరు. దానికే తెగదెంపులు చేసుకుని వస్తావా. నాకు కోట్ల ఆస్తి ఉండి కూడా అమ్మనాన్న లేరు. నాకు ఉంది మావయ్య ఒక్కరే. పెళ్లి చేసుకుంటే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందనుకున్నాను అని కుయిలి అంటుంది. అందరిని వదిలేసి వస్తే నెత్తిన పెట్టుకుంటుంది అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని రాహుల్ అనుకుంటాడు.

నిన్ను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే అని కుయిలి అంటే.. రాహుల్ ఏంటని అడుగుతాడు. కుయిలి కవర్ చేస్తాడు. రాహుల్ ఆల్రెడీ తన కుటుంబాన్ని వదిలేసి వచ్చాడు. నువ్విలా మాట్లాడితే ఎలా. రాహుల్ నువ్వెళ్లి ముందు ఫ్రెష్ అయిరా అని కుయిలి భర్త రంజిత్ అంటాడు. దాంతో రాహుల్ వెళ్లిపోతాడు. ఇంట్లోవాళ్లను హ్యాండిల్ చేయలేక వచ్చాడు. నువ్వే మ్యానిపులేట్ చేసి ఇంటికి పంపించాలి అని కుయిలితో రంజిత్ అంటాడు.

రాహుల్‌కు ట్రీట్‌మెంట్

దాని నాటకం ఏంటో కనిపెట్టాలంటే అక్కడికి వెళ్లి మనం కూడా నాటకం ఆడాలి అని కావ్య అంటుంది. మనం కుయిలి ఇంటికి వెళ్లాలి. దాన్ని కుదిపి కుదిపి కూతపెట్టించాలని రాజ్‌తో కావ్య అంటుంది. మరోవైపు రాహుల్‌ను ఎలాగైనా ఇంటికి పంపించాలని కుయిలి అనుకుంటుంది. రాహుల్‌కు కాఫీ ఇచ్చి మాట్లాడుతుంది. ఇంతలో రాజ్, కావ్య తాత, బామ్మ గెటప్పులలో ఎంట్రీ ఇస్తారు.

రాజ్ ఫ్లోలో నడుచుకుంటు వెళ్తే మీరు ఇప్పుడు యంగ్ రాజు గారు కాదు కుంగిపోయిన లింగరాజు గారు. వయసుకు తగ్గట్లు నడవండి అని కావ్య అంటుంది. నువ్వు కూడా ముడతలు పడ్డ మంగతాయారువి అని రాజ్ అంటాడు. ఇద్దరు ముసలివాళ్లలా వస్తారు. రాహుల్ కోసమే వచ్చామంటారు. మీరేవరు అని రాహుల్ అంటాడు. దాంతో అంతమాట అనేసావా అని రాజ్, కావ్య పెద్ద డ్రామా చేస్తారు.

లింగరాజుగా రాజ్

మన మనవడు అలా మాట్లాడుతుంటే ఎలా తట్టుకోగలం అని లింగరాజు తాతయ్య అంటారు. నేను మంగతాయారు బామ్మని, ఈయన లింగరాజు తాతయ్య అని కావ్య అంటుంది. నో డౌట్ వీళ్లు రాజ్, కావ్యనే. ఏదో ప్లాన్ వేసుకుని వచ్చారు అని రాహుల్ మనసులో అనుకుంటాడు. నువ్వు ఇంట్లోంచి అలిగి రావడంతో మేము బెంగపెట్టుకొన్నాం అని అంటారు.

అవును నువ్వు అన్ని వదిలేసి వచ్చిన ఆ సుందరాంగీ ఏది. తను ఇక్కడ లేదా. మరి ఆస్తి పరిస్థితి ఏంటీ అని కావ్య అంటుంది. ఆస్తి పరిస్థితి అంటే అని ఆబరాగా అడుగుతుంది కుయిలి. వీడు అలిగి వచ్చాడు. అక్కడ ఒంటరి అయిపోయాం. కోట్ల ఆస్తిని ఎలా కాపాడుకోవాలి. ఎలాగు నచ్చినదాని దగ్గరికి వచ్చాడు. మేము కూడా వీడితోనే ఉండి కోట్ల ఆస్తి చేతిలో పెట్టాలనుకుందామంటే ఆ గాడిద ఎవరో కనిపించట్లేదు అని కావ్య అంటుంది.

ఆ గాడిదను నేనే బామ్మ గారు అని ముందుకు వస్తుంది కుయిలి. అదే ఆడదాన్ని నేనే అని కుయిలి అంటుంది. ముందు తిట్టి ఈడు జోడు బాగుందని రాజ్, కావ్య అంటారు. రాహుల్ వెళ్లిపోమ్మంటే కుయిలి అడ్డు పడుతుంది. వాళ్లు ఎక్కడికి వెళ్తారు అని ఆపుతుంది. దాంతో తమ బుట్టలో కుయిలి పడిందనుకుంటారు రాజ్, కావ్య.

బయటపడిన నాటకం

తర్వాత రాజ్, కావ్య వాళ్లు భోజనం అంతా ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తీసుకురమ్మంటున్నారు. అలా చేస్తే 30 వేల వరకు బిల్ అవుతుందని కుయిలితో రంజిత్ చెబుతాడు. రాహుల్ గాడితో వచ్చే ఆస్తితోపాటు ఈ ముసలోళ్ల ఆస్తి కూడా కావాలి. మనం పెట్టే ఖర్చుకు వెయ్యి రెట్లు రాబట్టాలి అని కుయిలి అంటుంది.

ఉక్కపోస్తుందని కావ్య, రాజ్ విగ్గు తీసేస్తారు. అది కుయిలి భర్త రంజిత్ చూస్తాడు. దాంతో రాజ్, కావ్య నాటకం బయటపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe