Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య పరీక్షల్లో పాస్ అవుతుంది. కంపెనీ కోసం ఇందుతో ఫైట్ చేస్తుంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోవడం, తర్వాత డాక్టర్ వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పే సీన్లు ఆసక్తి రేపాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఇందుతో కలిసే ఉంటానని హామీ ఇచ్చిన రాజు.. అపర్ణ ఎమోషనల్

రాజుని చూసి అపర్ణ ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండటమే తనకు కావాలని అపర్ణ అంటే.. తాను ఎప్పటికీ ఇందు చేయి వదలనని, కలిసే ఉంటానని రాజు హామీ ఇస్తాడు.
ఇక నుంచి సిరి నీ ఒక్కడి బాధ్యత కాదు.. తన బాధ్యత కూడా అని అపర్ణ అంటుంది. ఇంత మంచి మనసున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రాజు అంటాడు. అలా అనొద్దురా.. నిన్న ఎత్తుకొని పెంచాను.. గోరు ముద్దలు తినిపించాను.. నువ్వు నా మనవడివే అయినా చెప్పలేని పరిస్థితి అని అపర్ణ లోలోపల అనుకొని ఎమోషనల్ అవుతుంది.
రేఖ పరువు తీసిన భ్రమరాంబ, శేషు
మరోవైపు ఈ ప్లాన్ కూడా ఫెయిలవడంతో రేఖకు ఏం చేయాలో అర్థం కాదు. శేషును తిడుతుంది. దీంతో భ్రమరాంబ జోక్యం చేసుకొని తన భర్తను ఎందుకు తిడుతున్నావ్.. అందులో ఆయన తప్పేం చేశాడు.. నిజంగానే ఇక రాజును మనం ఏమీ చేయలేం.. ఏ ప్లాన్ వేసినా ఫెయిలవుతోంది.. నువ్వేమో ఎప్పుడూ ఒక్క అవకాశం అంటూ డైలాగులు కొడుతున్నావని పరువు తీసేలా మాట్లాడుతుంది.
శేషు కూడా రేఖ పరువు తీస్తాడు. మీకు ఆస్తి రావడానికి ఒకే మార్గం ఉంది.. అందరూ ఏడుస్తూ వెళ్లి రాజు కాళ్లు పట్టుకోండి.. మీకు ఏడుపు రాకపోతే ఈ గ్లిజరిన్ పెట్టుకొని వెళ్లండి.. అవసరమైతే ఆ ఇందు కాళ్లు కూడా పట్టుకోండి.. ఇది తప్ప మరో మార్గం లేదు.. అయితే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది.. ధర్మం మాత్రమే గెలుస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. రేఖ ఏమీ అనలేక బిక్కమొహం వేస్తుంది.
సిరి కోసం జోకర్‌లా మారిన రాజు.. గతం తలచుకొని ఎమోషనల్
{{/usCountry}}శేషు కూడా రేఖ పరువు తీస్తాడు. మీకు ఆస్తి రావడానికి ఒకే మార్గం ఉంది.. అందరూ ఏడుస్తూ వెళ్లి రాజు కాళ్లు పట్టుకోండి.. మీకు ఏడుపు రాకపోతే ఈ గ్లిజరిన్ పెట్టుకొని వెళ్లండి.. అవసరమైతే ఆ ఇందు కాళ్లు కూడా పట్టుకోండి.. ఇది తప్ప మరో మార్గం లేదు.. అయితే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది.. ధర్మం మాత్రమే గెలుస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. రేఖ ఏమీ అనలేక బిక్కమొహం వేస్తుంది.
సిరి కోసం జోకర్‌లా మారిన రాజు.. గతం తలచుకొని ఎమోషనల్
{{/usCountry}}ఇటు సిరి ఆ రౌడీల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇందు ఎంత చెప్పినా వినదు. తినదు. సమయానికి రాజు కూడా లేడని ఇందు అనుకుంటుంది. సిరి బయటకు వెళ్లి కూర్చోగానే రాజు జోకర్ లా మారి ఆమె ముందుకు వస్తాడు. పాట పాడతాడు. సిరిని నవ్విస్తాడు. తినేలా చేస్తాడు. అయితే ఆ పాటలోనే రాజు గతం గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు. సిరికి జరిగిన యాక్సిడెంట్, తండ్రి చనిపోవడం, ఆమె గతం మరచిపోవడంలాంటి తలుచుకొని ఎమోషనల్ అవుతాడు.
డిగ్రీ పాసయ్యానన్న ఐశ్వర్య.. కంపెనీ విషయంలో గొడవ
ఆ తర్వాత ఇంట్లో ఐశ్వర్య హడావిడి చేస్తుంది. ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తుంది. తాను డిగ్రీ పాసవనని ఎవరో ఛాలెంజ్ చేశారు.. ఇప్పుడు చూడండి నేను డిగ్రీ పాసయ్యాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇందు ఆమెకు కంగ్రాట్స్ చెబుతుంది. రేఖ కూడా అభినందిస్తుంది.
ఆ తర్వాత తనకు పెట్టిస్తానన్న కంపెనీ గురించి ఇందుని ఐషూ నిలదీస్తుంది. అయితే అది ఇప్పుడే కాదు.. నీకు అనుభవం రావాలి.. ఆ తర్వాత పెట్టిస్తాను.. అంత వరకూ మన కంపెనీలో ఉద్యోగిగా చేయు.. ఓ ప్రాజెక్ట్ ఇస్తాను.. అది సక్సెస్ ఫుల్ గా చేస్తే నీకు కంపెనీ పెట్టిస్తాను అని ఇందు అంటుంది.
ఐషూని రెచ్చగొట్టిన భ్రమరాంబ.. రెచ్చిపోయిన ఐశ్వర్య
అది విని ఐశ్వర్య కుదరదు అని గొడవకు దిగగా.. భ్రమరాంబ ఆమెను మరింత రెచ్చగొడుతుంది. నువ్వు ఇలా మాట మారుస్తావని నేను ముందే ఐషూకి చెప్పాను కానీ వినలేదు.. ఇందు మాటంటే మాటే అని చెప్పింది.. ఇప్పుడేమో నువ్వు ఛాలెంజ్ చేసి వెనక్కి తగ్గుతున్నావు.. కంపెనీ పెట్టించాల్సిందే అని అంటుంది. అటు రేఖ కూడా ఎప్పుడు పెట్టిస్తావ్ అని అడుగుతుంది. దీంతో ఇందు దానికి అనుభవం కావాలి.. కంపెనీలో పని చేస్తే అది మేలు చేస్తుంది అని అంటుంది.
కానీ ఐషూ వినదు. నీకేం అనుభవం ఉందని కంపెనీకి సీఈవో అయ్యావు.. ఇంటి పని, వంట పని తప్ప ఏమీ రాదు.. చదువు కూడా లేదు.. మరి నువ్వెలా సీఈవో అయ్యావని నిలదీస్తుంది. అది వేరు, ఇది వేరు అని చెప్పినా వినదు. ఈ క్రమంలో వాదిస్తూ కళ్లు తిరిగి పడిపోతుంది ఐశ్వర్య.
తల్లి కాబోతున్న ఐశ్వర్య
దీంతో అందరూ కంగారు పడతారు. డాక్టర్ వచ్చి చూసి నువ్వు తల్లి కాబోతున్నావని ఐశ్వర్యకు చెబుతుంది. అదే విషయం బయటకు వచ్చి ఇంట్లో వాళ్లకు కూడా చెప్పడంతో ఎవరి నోట మాట రాదు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.