Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మరోసారి రక్తి కట్టించింది. గత ఎపిసోడ్ లో ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని తెలవడం పెద్ద షాక్ అయితే.. దానికి కారణం లక్కీ అని చెప్పడం మరింత షాక్ కు గురి చేస్తుంది. అది తెలిసి లక్కీ, ఐశ్వర్య పెళ్లి చేద్దామని ఇందు అంటే.. ఐషూ మాత్రం అబార్షన్ కు సిద్ధమవుతుంది.
కళ్లు తిరిగి పడిపోయిన ఐశ్వర్య.. ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్

ఇందుతో తనకు కంపెనీ పెట్టించాలని వాదించిన ఐశ్వర్య కళ్లు తిరిగి పడిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. డాక్టర్ వచ్చి చూస్తుంది. స్పృహలోకి వచ్చిన ఐషూని నీకు పెళ్లయిందా అని అడుగుతుంది. కాలేదని, ఏం జరిగిందని అడిగితే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది.
దీంతో షాకయిన ఐశ్వర్య.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని ఆమె డాక్టర్ ను బతిమాలుతుంది. కానీ డాక్టర్ వినదు. తాను మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోనని తెగేసి చెబుతుంది. బయటకు వెళ్లిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్లకు డాక్టర్ వెల్లడిస్తుంది. అది విని అందరూ షాకవుతారు.
ఐశ్వర్యను నిలదీసిన ఇంట్లో వాళ్లు..
డాక్టర్ వెళ్లిన తర్వాత ఇంట్లో వాళ్లందరూ ఐషూని నిలదీస్తారు. కడుపులో బిడ్డకు తండ్రెవరు అని భ్రమరాంబ, ఇందు అడుగుతారు. ఇంటి పరువు తీశావని సుభాష్ నిందిస్తాడు. ఆ శశితో కలిసి తిరిగావ్.. పార్టీలు చేసుకున్నావ్.. వాడేనా అని అపర్ణ నిలదీస్తుంది.
ఇలాంటివి నీ రక్తంలోనే ఉన్నాయి.. మీ అమ్మ కూడా అలాగే చేసింది అని అంటుంది. దీంతో ఐశ్వర్య ఎదురు తిరుగుతుంది. హద్దుల్లో ఉండి మాట్లాడాలని అంటుంది. హద్దు దాటింది నువ్వు అంటూ రాజు ఆమెకు క్లాస్ పీకుతాడు. అసలు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని ఇందు మరోసారి గట్టిగా అడుగుతుంది.
ఐశ్వర్య కడుపుకు కారణం లక్కీ.. దారుణంగా కొట్టిన రాజు
దీంతో నీ ఫ్రెండే దీనికి కారణం అని రాజుతో ఐశ్వర్య అంటుంది. అంటే లక్కీయా అని శేషు అంటాడు. అవునని అంటుంది. లక్కీ వణికిపోతాడు. ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తాడు. ఐషూ బాగా తాగినప్పుడు ఆమెను బెడ్ రూమ్ లోకి లక్కీ తీసుకెళ్లి పడుకోబెడతాడు. కానీ తాగిన మత్తులో లక్కీ వద్దని వారిస్తున్నా.. అతన్ని బెడ్ పైకి లాగుతుంది. దాని కారణంగానే ఇప్పుడు ఐషూ ప్రెగ్నెంట్ అని అందరూ తెలుసుకుంటారు.
{{/usCountry}}దీంతో నీ ఫ్రెండే దీనికి కారణం అని రాజుతో ఐశ్వర్య అంటుంది. అంటే లక్కీయా అని శేషు అంటాడు. అవునని అంటుంది. లక్కీ వణికిపోతాడు. ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తాడు. ఐషూ బాగా తాగినప్పుడు ఆమెను బెడ్ రూమ్ లోకి లక్కీ తీసుకెళ్లి పడుకోబెడతాడు. కానీ తాగిన మత్తులో లక్కీ వద్దని వారిస్తున్నా.. అతన్ని బెడ్ పైకి లాగుతుంది. దాని కారణంగానే ఇప్పుడు ఐషూ ప్రెగ్నెంట్ అని అందరూ తెలుసుకుంటారు.
{{/usCountry}}ఈ విషయం విన్న రాజు ఆవేశంతో రగిలిపోతాడు. లక్కీని కాలర్ పట్టుకొని లాగి చితకబాదుతాడు. నిన్ను ఎంతో నమ్మాను.. తల్లి లేదని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను.. ఇంత ద్రోహం చేస్తావా అని కొడతాడు. లక్కీ ఏదో చెప్పబోతున్నా వినడు. ఇందు అతన్ని ఆపుతుంది.
లక్కీతో ఐశ్వర్య పెళ్లి జరిపిద్దామన్న ఇందు..
ఇంటి పరువు తీశావని సుభాష్, అపర్ణ ఐశ్వర్యను నిలదీస్తారు. దీంతో ఈ సమస్యకు ఒకటే మార్గం.. లక్కీ, ఐశ్వర్య పెళ్లి చేద్దామని ఇందు అంటుంది. కానీ ఐషూ మాత్రం అందుకు ఒప్పుకోదు. వీడితో నేను జీవితాంతం కలిసి ఉండాలి.. నా స్టేటస్ ఏంటి వాడి స్టేటస్ ఏంటి అని పొగరుగా మాట్లాడుతుంది. మరి వాడితో పడుకున్నప్పుడు ఆ స్టేటస్ తెలియదా అంటూ అపర్ణ నిలదీస్తుంది. కానీ ఐషూ మాత్రం తాను బిడ్డను తీయించుకుంటానని అనడంతో అందరూ షాకవుతారు. ఇందు ఎంత చెప్పినా వినదు.
జాబ్ విషయంలో మదన్, స్వాతి వాదన
మరోవైపు మదన్ మరో ఇంటర్వ్యూకి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇంతలో స్వాతి అతనిని ఆపుతుంది. తాను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానని అంటుంది. నువ్వేమో చిన్న ఉద్యోగం చేయనంటున్నావ్.. ఇంటి ఖర్చులకు డబ్బు కావాలి కదా.. ఆలోపు ఏదైనా చిన్నది వెతుక్కుంటాను అని స్వాతి అంటుంది. ఇంత చదివిన నాకే ఉద్యోగం రావడం లేదు.. డిగ్రీ కూడా పూర్తి చేయని నీకెలా ఇస్తారు అని మదన్ అనడంతో స్వాతి ఫీలవుతుంది. దీంతో మదన్ సారీ చెప్పి నీ ఇష్టం అని అంటాడు.
వారసుడిగా ఇంటి పరువు కాపాడాలని రాజుని కోరిన సుభాష్
ఇటు దుగ్గిరాల ఇంట్లో ఐశ్వర్య చేసిన పనికి అపర్ణ, సుభాష్ బాధపడుతుంటారు. ఈ దుగ్గిరాల ఇల్లు ఒకరి ప్రాణం నిలబెట్టిందే తప్ప ఎప్పుడూ తీయలేదని అపర్ణ అంటుంది. దీంతో రాజు, ఇందుని దగ్గర పిలుచుకొని వాళ్లిద్దరి చేతులను కలుపుతాడు సుభాష్. నువ్వు ఈ ఇంటి వారసుడివి రాజు అని అంటాడు. నువ్వే అంటావు కదా ఇందు ఈ ఇంటి వారసురాలు.. ఆమె భర్తగా నీకూ ఇంటిపై అధికారం ఉందని.. ఇప్పుడదే అధికారంతో ఓ ప్రాణం పోకుండా నిలబెట్టు.. ఐశ్వర్య కడుపులో బిడ్డను కాపాడు అని అడుగుతాడు. దీంతో ఇందు, రాజు తాము బిడ్డను కాపాడతామని హామీ ఇస్తారు.
అబార్షన్ చేయాలని డాక్టర్ ను అడిగిన ఐశ్వర్య
అటు డాక్టర్ కు ఐశ్వర్య ఫోన్ చేస్తుంది. తాను అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. బాగా ఆలోచించుకో అని డాక్టర్ చెప్పినా.. ఐషూ తాను అబార్షన్ కే సిద్దమని చెప్పడంతో సరే అని డాక్టర్ అంటుంది. అప్పుడే లక్కీ ఆమె దగ్గరికి వస్తాడు. నీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు కానీ ఈ పని మాత్రం చేయొద్దని అడుగుతాడు. కానీ ఆమె వినకుండా వెళ్లిపోతుంది.
దీంతో తల్లి రేఖ దగ్గరికి వెళ్లి లక్కీ ఇదే విషయం చెబుతాడు. అది తన చేతుల్లో లేదని, రాజు, ఇందుకి చెప్పాలని పంపిస్తుంది. లక్కీ వెళ్లి వాళ్లనే అడుగుతాడు. లక్కీ బిడ్డను కాపాడే బాధ్యత తనది అని, ఐషూతో మాట్లాడతానని ఇందు మాట ఇస్తుంది. కానీ ఆలోపే ఐశ్వర్య హాస్పిటల్ కు వెళ్లిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.