...
...
Next Story

Brahmamudi September 10 Episode: బ్రహ్మముడి- రాజు, ఇందుపై పగతో రగిలిపోయిన రేఖ, భ్రమరాంబ- చలపతి ఇంటికి కోలుకున్న సిరి

Brahmamudi Serial September 10th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ ఎపిసోడ్‌‌లో రేఖ, భూషణ్ తనకు తల్లిదండ్రులు కాదని, ఆస్తి కూడా వద్దని స్వాతితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని మదన్ వెళ్లిపోతాడు. రాజు, ఇందులపై రేఖ, భ్రమరాంబ పగతో రగిలిపోతారు. స్పృహలోకి వచ్చిన సిరిని చలపతి ఇంటికి తీసుకెళ్తాడు రాజు.

Published on: Sep 10, 2026, 07:29:08 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీని పెద్దకొడుకుగా రేఖ అనౌన్స్ చేసే పార్టీలో తన మనసులోని మాటను మదన్ చెబుతానంటాడు. ఇంత జరిగాక నేను తన కొడుకుగా ఉండటానికి ఒప్పుకోవట్లేదని మదన్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

థ్యాంక్స్ బ్రో

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ ఎపిసోడ్

థ్యాంక్స్ బ్రో. నువ్వు లేకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండేది. నువ్వు చెప్పకుంటే ఇక్కడికి వచ్చేవాన్ని కాదని రాజుతో మదన్ అంటాడు. మదన్ నేను చెప్పిందేంటీ నువ్వు మాట్లాడుతుందేంటీ అని రాజు అడుగుతాడు. నా మనసుకు అనిపించింది చెబుతున్నా అని మదన్ అంటాడు. ఇందు నచ్చజెప్పడానికి ప్రయత్సిస్తే మదన్ అడ్డుకుని మా అమ్మతో మాట్లాడాలని మదన్ అంటాడు.

రేఖ చెబితేనే ప్రపంచాన్ని చూశానని, కానీ, నీ మనసుకున్న ముసుగు వెనుకున్న తల్లిని చూడలేకపోయానని, నీకంటే గొప్పగా నన్ను ఎవరు ప్రేమించలేదనుకున్నాను. కానీ, ఈరోజు అది అబద్ధమని తేలింది. నీకంటే గొప్పగా ప్రేమించే మనిషిని ఈరోజే గుర్తించాను. తనెవరో కాదు స్వాతి అని మదన్ అంటాడు.

తనుమాత్రమే నన్నుగా ఇష్టపడి ప్రేమించింది. సారీ స్వాతి ఇన్నాళ్లు మా అమ్మ ప్రేమతో నిన్ను దూరం పెట్టాను, బాధపెట్టాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్యూ స్వాతి అని మదన్ అంటాడు. దానికి భ్రమరాంబ తెగ సంబరపడుతుంది. రేఖ వచ్చి అడిగితే.. నీకు నచ్చినట్లు నువ్వుంటున్నావ్, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. నేను స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే అందరిముందు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాను అని మదన్ అంటాడు.

నాకు ఎలాంటి ఆస్తి వద్దు

నాతో నీకు ఎంగేజ్‌మెంట్ ఇష్టమేనా అని స్వాతిని అడుగుతాడు మదన్. ఇలా సడెన్‌గా నిశ్చితార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు మదన్ అని అపర్ణ అంటుంది. మీకు ఇష్టం లేదా అని మదన్ అంటాడు. ఇష్టమే. కానీ, అందరం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుందామని అపర్ణ అంటుంది. మా ఇద్దరిని దయచేసి విడదీయకండి. స్వాతిని నీకు నేను ఇష్టమేనా అని మదన్ అడిగితే ఇష్టమే అని స్వాతి చేయి ఇస్తుంది.

మదన్ రింగ్ తొడుగుతుంటే భ్రమరాంబ వచ్చి స్వాతి చేయి ఇవ్వనివ్వదు. భ్రమరం ఇన్నాళ్లు ఇదే కోరుకున్నావుగా అని శేషు అంటాడు. ఈ మదన్ రేఖ కొడుకు కాబట్టి, స్వాతికి ఆస్తి వస్తుంది కాబట్టి ఒప్పుకున్నా. కానీ, ఇప్పుడు తల్లి వద్దు ఆస్తి వద్దు అంటే వీళ్ల పెళ్లికి ససేమిరా ఒప్పుకోను అని భ్రమరాంబ అంటుంది. నేను ఒప్పుకుంటున్నాను. నేను బావను ప్రేమిస్తున్నా. నాకు ఆస్తి, ఐశ్వర్యం కంటే బావ ముఖ్యం అని స్వాతి కోపంగా అంటుంది.

మదన్‌పై పోలీస్ కంప్లైంట్ ఇస్తా

ఇప్పుడే ఈ మదన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని భ్రమరాంబ అంటుంది. స్వాతి మేజర్. కంప్లైంట్ ఇచ్చి లాభం లేదని భ్రమరాంబను పక్కకు తీసుకెళ్తాడు శేషు. స్వాతికి మదన్ ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతాడు. మదన్ వెళ్లిపోతుంటే.. రాజు ఆపి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని అంటాడు. ఇలా చేస్తే మీరిద్దరు ఇద్దరి తల్లులకు దూరమవుతారు అని ఇందు అంటుంది.

స్వాతి నువ్వైనా చెప్పు అని ఇందు అంటే.. మదన్ మాటే నా మాట. నాకు మదన్‌ను ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావుగా ఇప్పుడు అదే జరుగుతోందని ఇందు ప్రామిస్ బయటపెడుతుంది స్వాతి. రేయ్ అమ్మ నీకోసం ఎంతో చేసిందిరా అని భూషణ్ అంటే.. అదంతా నాటకం, ఆస్తికోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసి గొంతు కోయాలని చూసింది. మీతో మాటలేంటీ అని మదన్ వెళ్లిపోతుంటాడు.

రేఖ, భూషణ్ అడ్డుకోవాలని చూస్తే ఆపకుంటే నేను చచ్చినంత ఒట్టే అని మదన్ అంటాడు. దాంతో రేఖ ఆగుతుంది. మదన్, స్వాతి వెళ్లిపోతారు. తర్వాత రేఖ బాధగా కూర్చుని ఉంటుంది. రాజు వెళ్లి ఇలా జరుగుతుందనుకోలేదు. మాట్లాడినప్పుడు మీతో కలవాలన్నట్లుగా మాట్లాడాడు. కానీ, ఇక్కడ ఇలా చేశాడని, అంతా కలిసి ఉందామనే ఇలా చేశామని రాజు, ఇందు అంటారు.

ఏదోలా చేసి ఇంటికి తీసుకొస్తా

ఏమాత్రం వీలున్న మదన్‌ను తిరిగి తీసుకొస్తాం అది నా బాధ్యత. కొత్తగా పెళ్లయిన జంట ఇంట్లో ఉండాలని, సాంప్రదాయమని ఏదోటి చెప్పి తీసుకొస్తా. నేను చెప్పినట్లుగానే ఇద్దరు కొడుకులు మీతో ఉండేలా చేస్తాను అని రాజు చెబుతాడు. రాజు, ఇందు వెళ్లిపోతారు. అసలు ఇదంతా జరగడానికి కారణమే మీరు. మీరు సంతోషంగా ఉంటానంటే ఎలా వదిలేస్తాను. ఈరోజు నుంచి మీ అందరికి ఈ రేఖ అంటే ఏంటో చూపిస్తాను అని రేఖ అనుకుంటుంది.

ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు మీ జీవితాలను తలకిందులు చేస్తాను అని రేఖ పగతో రగిలిపోతుంది. స్వాతి కోసం భ్రమరాంబ ఏడుస్తుంటుంది. స్వాతి కోసమేగా, ఆస్తి కోసమేగా రేఖ ఎంత అరిచిన భరించాను. అలాంటిది మదన్ గాడు ఆస్తి అవసరం లేదని వెళ్లిపోయాడు. స్వాతిని మదన్ ఎలా చూసుకుంటాడు. వాడితో స్వాతి కూడా కష్టపడాల్సిందేగా. అది చూడలేను అని భ్రమరాంబ అంటుంది.

నువ్వు ఆస్తి కోసం చూశావు కాబట్టే స్వాతి నీ జోక్యం అవసరం లేదని వెళ్లిపోయిందని శేషు అంటుంది. లేదు. రేఖకు ఆస్తి రాగానే వాళ్లను తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను అని భ్రమరాంబ అంటుంది. రాజు, ఇందు ఉండగా ఆస్తి రాదని శేషు అంటాడు. అసలు ఇదంతా రాజు, ఇందు వల్లే జరిగింది. నా కన్నీళ్లకు కారణమైన రాజు ఇందును అస్సలు వదిలిపెట్టను అని భ్రమరాంబ కూడా పగతో రగిలిపోతుంది.

చలపతి ఇంటికి సిరి

మరోవైపు సిరి స్పృహలోకి వస్తుంది. డాక్టర్ చెప్పడంతో రాజు హాస్పిటల్‌కు వెళ్తాడు. రాజు తన మొదటి పెళ్లాం దగ్గరికి వెళ్లినట్లు ఉన్నాడని ఇందుతో భ్రమరాంబ అంటుంది. సిరి చేయి పట్టుకుని తండ్రి చలపతి ఇంటికి తీసుకెళ్తాడు రాజు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks