...
...
Next Story

Brahamamudi September 11 Episode: బ్రహ్మముడి.. ఇందు చేయి వదలనన్న రాజు.. గతం మరిచిపోయిన సిరి.. మదన్, స్వాతి తంటాలు

Brahamamudi Serial September 11th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్ లో రాజుకు ఊహించిన షాక్ తగులుతుంది. సిరి తన గతాన్ని మరచిపోతుంది. మరోవైపు మదన్, స్వాతి అద్దె గది దొరకక రోడ్డుపై తంటాలు పడుతుంటారు.

Published on: Sep 11, 2026, 08:18:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahama Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఓవైపు మదన్, స్వాతి ఎపిసోడ్ తోపాటు రాజు, సిరి ఎపిసోడ్.. మధ్యలో ఇందు కష్టాలను చూపిస్తూ సాగిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో సిరి గతాన్ని మరచిపోయే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

నడిరోడ్డుపై మదన్, స్వాతి.. హోటల్ గదిలో రాత్రి

Brahamamudi September 11 Episode: బ్రహ్మముడి.. ఇందు చేయి వదలనన్న రాజు.. గతం మరిచిపోయిన సిరి.. మదన్, స్వాతి తంటాలు
Brahamamudi September 11 Episode: బ్రహ్మముడి.. ఇందు చేయి వదలనన్న రాజు.. గతం మరిచిపోయిన సిరి.. మదన్, స్వాతి తంటాలు

మదన్, స్వాతి రాత్రి వేళ రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో కూర్చునే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో తోచక రోడ్డుపైనే స్వాతితో కలిసి కూర్చుంటాడు మదన్. ప్రస్తుతానికి ఈ రాత్రికి హోటల్లో ఉందాం.. ఉదయాన్నే అద్దె గది చూసుకుందామని స్వాతి చెబుతుంది. సరే అని ఎదురుగా కనిపించిన హోటల్ కు వెళ్తారు. అక్కడి వ్యక్తి వాళ్లను చూసి నవ్వుతాడు. అదోలా చూస్తాడు. మదన్ అతన్ని తిట్టి గది తాళాలు తీసుకొని వెళ్లిపోతాడు.

సిరి స్పృహలోకి.. గతం మరచిపోయి చిన్నపిల్లలా మారి..

మరోవైపు ఉదయాన్ని రాజుకు డాక్టర్ ఫోన్ చేస్తాడు. సిరి స్పృహలోకి వచ్చిందని చెబుతాడు. దీంతో రాజు పరుగెత్తుకొని హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసిన రాజుకి షాక్ తగులుతుంది. సిరి స్పృహలోకి వచ్చినా.. ఆమె గతాన్ని మరచిపోతుంది. ఆరేళ్ల చిన్న పిల్లలా వ్యవహరిస్తుంది.

అక్కడే ఉన్న ఓ అమ్మాయి చేతిలోని బొమ్మ కోసం కొట్లాడుతుంది. అది చూసి రాజు ఏం జరిగిందని అడిగితే.. ఆమె గతం మరచిపోయిందని, గతం గుర్తుకు రావడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేమని, అంత వరకూ జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు. సరే అని సిరిని తీసుకొని రాజు వెళ్తాడు.

ఇందుని నిందించిన భ్రమరాంబ.. అపర్ణకు సర్ది చెప్పిన ఇందు

అటు సిరిని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొస్తాడు రాజు. అప్పుడే ఇందు ఫోన్ చేస్తుంది. సిరి స్పృహలోకి వచ్చిందని డాక్టర్ ఫోన్ చేస్తే వచ్చానని చెబుతాడు. ఆమె గురించి ఇందు మరిన్ని వివరాలు అడుగుతుండగానే రాజు మళ్లీ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత సిరిని కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు.

అద్దె గది కోసం మదన్, స్వాతి తంటాలు..

మరోవైసు ఉదయాన్నే మదన్, స్వాతి అద్దె గది కోసం వెతకడం మొదలు పెడతారు. టులెట్ బోర్డు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతారు. కానీ పెళ్లి కాని జంటకు ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్లకు ఇవ్వం.. పెళ్లి చేసుకున్న తర్వాత రండి.. ఇల్లు ఇస్తామని అంటారు. దీంతో మదన్ వాళ్లతో గొడవ పడతాడు. స్వాతి అతనికి సర్ది చెబుతుంది. ఎవరైనా అలాగే మాట్లాడతారు.. ముందు ఓ గది దొరకగానే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం.. తర్వాత మంచి గదిలోకి మారదాం అని అంటుంది. మదన్ సరే అంటాడు.

స్వాతికి ఇందు ఫోన్.. ఇంటికి రాలేనని చెప్పి.. భ్రమరాంబకు క్లాస్ పీకి..

ఇంటి కోసం వెతుకుతూ అలసిపోయి రోడ్డుపైనే మదన్, స్వాతి కూర్చొంటారు. అప్పుడే స్వాతికి ఇందు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అడిగితే.. అద్దె గది కోసం వెతుకుతున్నామని చెబుతుంది. నువ్వు తొందరపడినట్లు అనిపిస్తోంది స్వాతి.. వెంటనే మదన్ ను ఒప్పించి ఇంటికి వచ్చేయండి అని ఇందు అంటుంది. కానీ స్వాతి మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడే తనకు బావ ప్రేమ దక్కిందని, చాలా సంతోషంగా ఉన్నానని, ఈ విషయంలో బావ ఏది చెబితే అదే అని స్పష్టం చేస్తుంది.

ఇందుతో మాట్లాడుతుండగానే భ్రమరాంబ వచ్చి ఫోన్ లాక్కొంటుంది. స్వాతిని తిడుతుంది. ఒక్క రూపాయి వద్దని వెళ్లిపోయిన వాడితో వెళ్తావా అని అంటుంది. నీకు డబ్బే కావాలి.. నువ్వు అక్కడే ఉండు.. నేను బావతో సంతోషంగా ఉన్నాను.. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది.. నేను తిరిగి రాను అని తేల్చి చెబుతుంది.

ఇందు వల్లే ఇలా జరిగిందన్న భ్రమరాంబ

తల్లిదండ్రులను ఇలా బాధ పెట్టి వెళ్లిన నువ్వు బాగుపడవే అని భ్రమరాంబ శాపనార్థాలు పెడుతుంది. దీంతో ఇందు ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది. కన్న కూతురు మాట కాదని వెళ్తే ఇలా శాపం పెడతారా అని తిడుతుంది. దీంతో అంతా నీవల్లే జరిగింది.. నిన్ను వదలను అని భ్రమరాంబ ఆమెను తిట్టి వెళ్లిపోతుంది.

ఇందు చేయి వదలనన్న రాజు

అటు ఇందుకి రాజుపై ఏవేవో చెప్పి గొడవలు పెట్టాలని రేఖ, భ్రమరాంబ చూస్తారు. ఆ అమ్మాయిని మోసం చేసినట్లే రేపు నిన్నూ మోసం చేస్తాడని అంటారు. దీంతో తాను ఇందు చేయిని ఎప్పటికీ వదలను అని రాజు స్పష్టం చేస్తాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లి సిరి గతం మరచిపోయిందని, ఆమెను తన ఇంటికి తీసుకెళ్లానని, అయితే నాన్న ఇంట్లో ఉండటానికి అంగీకరించలేదు అని రాజు చెప్పడంతో ఇందు షాకవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks