Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మదన్ ఇంట్లోంచి వెళ్లిపోతానంటాడు. నీకు ఇంకో కొడుకు ఉన్నాడు. వాడు ఉండగా నేనెందుకు, నేను ఎలాగో బతుకుతాను. ఈ లక్కీగాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది. రూమ్‌లోనే ఉంచుకోలేకపోయాను. మాటవరసకే తమ్ముడు అంటే సహించలేదు. అలాంటిది అన్న అని ఎలా పిలవను మదన్ అంటాడు.
నాకు మాత్రం హెల్ప్ చేశావ్

రాజు నువ్వంటే నాకు చాలా కోపం. కానీ, ఈ విషయంలో నాకు మాత్రం హెల్ప్ చేశావ్. థ్యాంక్యూ రాజు అని మదన్ అంటాడు. కోపంలో ఈ నిర్ణయం తీసుకున్నావ్. వద్దని రాజు అంటే.. లేదు బాగా ఆలోచించే తీసుకున్నా అని మదన్ అంటాడు. స్వాతి కూడా వెళ్లకంటుంది. నాకంటే ఎక్కువ మా అమ్మను నమ్మాను. నాకు ఇష్టం లేకున్నా ఇందుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డా. కానీ ఈరోజు నేను తప్పుడు మనిషి కొడుకుగా అందరిముందు నిలబెట్టిందని మదన్ అంటాడు.
ఈ బాధ, ఈ బారం మోయలేకపోతున్నా. క్షణ క్షణం నరకంగా ఉంటుందని మదన్ వెళ్లిపోతాడు. రేఖ ఎంత బతిమిలాడిన వినిపించుకోడు. భూషణ్ దగ్గరికి వెళ్లి నీ కొడుకు వెళ్లిపోతున్నాడు, ఆపరా అని భ్రమరాంబ అంటుంది. వాడు ఈ లోకానికి మొహం చూపించలేక పారిపోతున్నాడు, నేను వాడికి మొహం చూపించలేక ఈ గదిలో ఉన్నాను. వెళ్లడం వెళ్లకపోవడం వాడి చేతిలోనే ఉందని భూషణ్ అంటాడు.
రేఖ ఎంత ప్రాధేయపడిన మదన్ వినడు. నీకు పెద్ద కొడుకు ఉన్నాడుగా. ఆ చీప్ ఫెలో నీ కొడుకు అని ఒప్పుకున్నావుగా అని మదన్ అంటాడు. ఇదంతా జస్ట్ నథింగ్‌రా అని రేఖ అంటుంది. ఏంటీ నథింగా. అలా అనడం నన్ను ఎంతగా చంపుతుందో తెలుసా. రేపు లక్కీ గురించి నా ఫ్రెండ్స్ అడిగితే ఏమని చెప్పాలి. మా అమ్మ ఒక్కటే గానీ నాన్నలు మాత్రం వేరని ఎలా చెప్పాలని మదన్ అంటుంది.
నువ్వు మా అమ్మవే కాదు
రేఖ వినలేకపోతుంది. నేను అంటేనే ఇలా ఉంటే నాకెలా ఉంటుంది. నువ్వు మా అమ్మవే కాదు. నాకు నిన్ను తల్లిలా చూడాలనే లేదు. నన్ను ఆపితే నా మీద ఒట్టే అని మదన్ కారులో వెళ్లిపోతుంది. నడిరోడ్డుమీద పడి రేఖ తెగ ఏడుస్తుంది. కోపంగా వెళ్లి రాజు కాలర్ పట్టుకుని నీవల్లేరా ఇదంతా జరిగిందని రేఖ నిందిస్తుంది. ఒక్కమాటతో పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమను దూరం చేశావుగారా అని రేఖ అంటుంది.
{{/usCountry}}రేఖ వినలేకపోతుంది. నేను అంటేనే ఇలా ఉంటే నాకెలా ఉంటుంది. నువ్వు మా అమ్మవే కాదు. నాకు నిన్ను తల్లిలా చూడాలనే లేదు. నన్ను ఆపితే నా మీద ఒట్టే అని మదన్ కారులో వెళ్లిపోతుంది. నడిరోడ్డుమీద పడి రేఖ తెగ ఏడుస్తుంది. కోపంగా వెళ్లి రాజు కాలర్ పట్టుకుని నీవల్లేరా ఇదంతా జరిగిందని రేఖ నిందిస్తుంది. ఒక్కమాటతో పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమను దూరం చేశావుగారా అని రేఖ అంటుంది.
{{/usCountry}}నువ్వు ఏడుస్తున్నావా పిన్ని. మనం కూడా ఒకరి ప్రేమను దూరం చేస్తే ఇలాగే ఉంటుంది. నీలాగే పాతికేళ్లుగా నీ కొడుకు లక్కీ కూడా అనుభవించాడు. వాడు పసిబిడ్డగా ఎంతగా గుక్కపెట్టి ఏడ్చి ఉంటాడో గుర్తు చేసుకో. అది ఎప్పుడైనా ఆలోచించావా. కనీసం వాడు నీ కొడుకు అని తెలిసిన తర్వాతైన వాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా. ఎవరికి ఎలాంటి తీర్పు, శిక్షవేయాలన్నది దేవుడు నిర్ణయం అని రాజు అంటాడు.
ఇదంతా నీ తప్పు గురించి చెప్పట్లేదు. పగలు, ప్రతికారాలు మానేసి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. జరిగిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు అని రేఖకు సలహా ఇస్తాడు రాజు. రేఖ, లక్కీ గురించి అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటారు. ఈరోజు రాజు వల్లే రేఖ చీకటి కోణం బయటపడింది. కాబట్టి పగ పెంచుకుని మన కుటుంబానికి ఏం చేస్తుందో. ఒకప్పుడు వాళ్ల అమ్మ రుద్రాణి ఏం చేసిందో తెలుసుగా. తల్లికంటే రేఖ క్రూరురాలు అని సుభాష్ అంటాడు.
రేఖ పతనం మొదలైంది
నాకు తెలిసి ఆ రేఖ ఇప్పుడు పగతో రగిలిపోతుంటుంది. తన నుంచి ఎలా కాపాడుకోవాలో అని సుభాష్ అంటాడు. అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు రాజు అండగా ఉన్నాడు. మన మనవడు ఉండగా రేఖ ఏం చేయలేదు. రేఖ పతనం మొదలైందని అపర్ణ అంటుంది. కరెక్టుగా చెప్పావ్. ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఇందు అంటుంది.
జాగ్రత్తగా ఉండాలిగా అని సుభాష్ అంటే.. బావ ఏం చేసిన చాలా ముందు చూపుతో చేస్తాడని ఇందు అంటుంది. రేపే రాజు పుట్టినరోజు. నిన్ను చిన్నప్పుడు ఫ్రెండు ఫ్రెండు అంటూ బర్త్ డే చేయించుకునేవాడని చెప్పావుగా అని ఇందు గుర్తు చేస్తుంది. అవును, నా మనవడు ఇంటికొచ్చాక వచ్చిన పుట్టినరోజు. బాగా బర్త్ డే సెలబ్రేట్ చేద్దాం. చాలా హ్యాపీగా ఫీలవ్వాలని అపర్ణ అంటుంది.
కానీ, రాజుకు డౌట్ వస్తుందిగా. చలపతి వాళ్లు వేరే పుట్టినరోజు జరిపించొచ్చుగా అని సుభాష్ అంటాడు. అది నిజమే. సరే నాకు వదిలేయండి. బావకు డౌట్ రాకుండా జరిపిస్తా. చలపతి అంకుల్ వాళ్లను ఇంటికి రప్పిస్తా. నందును కూడా లీవ్ తీసుకుని రమ్మంటా అని ఇందు అంటుంది. చలపతికి ఇందు కాల్ చేస్తుంది. రేపు రాజు పుట్టినరోజు మీరందరూ తప్పకుండా రావాలని ఇందు అంటుంది.
చలపతికి షాక్
మా బావ పుట్టినరోజు రేపే. మీకు ఇది తెలియదు. నానమ్మా వాళ్లు చాలా గ్రాండ్‌గా బర్త్ డే చేద్దామంటున్నారు అని ఇందు అంటుంది. ఏంటమ్మా అనేది. రాజు దుగ్గిరాల ఇంటి వారసుడని మీ నానమ్మ వాళ్లకు తెలిసిపోయిందా అని చలపతి అడుగుతాడు. తెలిసిపోయిందని ఇందు అంటే.. ఎవరికి చెప్పనని మాటిచ్చావుగా. ఇలా చేశావేంటమ్మా, రేఖ ఊరుకుంటుందా అని చలపతి అంటాడు.
కేవలం తాతయ్య, నానమ్మకు మాత్రమే చెప్పాను. ఇంకెవరికి తెలియదు. చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని ఇందు అంటుంది. సరే ఇప్పుడు బర్త్ డే అవసరమా. ఎందుకు అనవసరమైన టెన్షన్. కావాలనుకంటే మా ఇంటికి రండి, ఇక్కడ జీరో బడ్జెట్‌లో చేయొచ్చుగా అని చలపతి అంటాడు.
రాజు బర్త్ డే సెలబ్రేషన్స్
నానమ్మ, తాతయ్య వాళ్లు ఇక్కడ చేయాలని ఆశపడుతున్నారని ఇందు అంటుంది. చలపతి ఒప్పుకుంటాడు. దుగ్గిరాల ఇంటి వారసుడిగా రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. చలపతి, లక్ష్మి వెళ్తారు. రాజు, ఇందు వాళ్లంతా చాలా సంతోషంగా ఉంటారు. నా కొడుకును దూరం చేసి మీరంతా సంతోషంగా ఉంటున్నారా. మీకు సంతోషం లేకుండా చేస్తానని రేఖ అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.