Dil Raju: సస్పెన్స్ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన- విన్నావా ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన దిల్ రాజు- నిర్మాత ఏం చెప్పారంటే?
Dil Raju Released Missing Meghana Second Lyrical Song: తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న సరికొత్త సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ వినవా ప్రేమ పాటను అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కామెంట్స్ చేశారు.
Dil Raju Released Missing Meghana Second Lyrical Song: తెలుగులో వస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, మిస్సింగ్ మేఘన మూవీకి వాచస్పతి దర్శకత్వం వహించారు.

మిస్సింగ్ మేఘన నటీనటులు
మిస్సింగ్ మేఘన సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
ఇటీవల మిస్సింగ్ మేఘన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. అనంతరం మిస్సింగ్ మేఘన సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ "పిల్ల పిల్ల పిల్ల" అనే పాటను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
మిస్సింగ్ మేఘన నుంచి రెండో పాట రిలీజ్
ఈ క్రమంలోనే తతాజాగా మిస్సింగ్ మేఘన సినిమాలోని రెండో పాట విన్నావా ప్రేమ అనే పాటను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా వినవా ప్రేమ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ బాగున్నాయని, సినిమా కూడా హిట్ అవుతుందని దిల్ రాజు ప్రశంసించారు.
మిస్సింగ్ మేఘన రెండో పాట విడుదల సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. "ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాలు ఇచ్చి..పెద్ద ..పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో రెండో లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది" అని అన్నారు.
ఎమోషన్స్ మిస్ కాకుండా
"మేము రిలీజ్ చేసిన సాంగ్‌కు , టీజర్‌కు ఆడియన్స్ నుంచి, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. సినిమా విషయానికి వస్తే మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా చేయడం జరిగింది. మా సాంగ్స్, టీజర్ ఎంత బాగున్నాయో.. సినిమా అంత కంటే బాగుంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు డైరెక్టర్ వాచస్పతి.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. "నేను సంగీతం అందించిన మిస్సింగ్ మేఘనలోని సాంగ్‌ను దిల్ రాజు లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజు గారికి మ్యూజిక్‌లో మంచి టేస్ట్ ఉంది. అందుకే ఆయన సినిమాలోని పాటలు చాట్ బస్టర్స్ అవుతున్నాయి" అని తెలిపారు.
మంచి బూస్ట్‌నిచ్చింది
"అటువంటి రాజు గారు మా పాట విని చాలా బాగుంది అనడం.. మాకు మంచి బూస్ట్‌నిచ్చింది. నేనే స్వరపరచి, సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు గారు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్" అని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్ఆర్ ధృవన్.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. "ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఆయన హార్ట్ ఫుల్‌గా పాట బాగుంది. సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు. ఆయన అన్నట్టే సినిమా కూడా బాగా వచ్చింది. అలాగే ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను" అని ఆశించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


