...
...
Next Story

Brahmamudi September 22 Episode: బ్రహ్మముడి- సిరి జీవితాన్నే కథగా చెప్పిన రాజు- పడవలా మారిన ఐశ్వర్య హాల్ టికెట్-ఎగ్జామ్?

Brahmamudi Serial September 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22వ ఎపిసోడ్‌‌లో రాజు కింద పడుకుంటానంటే బెడ్ పైనే పడుకోమ్మని సిరి మారం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం రాజు పక్కనే సిరి పడుకుంటుంది. అదంతా చూసి భ్రమరాంబ, రేఖ గొడవ చేస్తారు. రాజు పక్కన పడుకుంటే తప్పేంటని అపర్ణ రివర్స్ అవుతుంది.

Published on: Sep 22, 2026, 08:28:41 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బెడ్ రూమ్‌లో సిరి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. రాజు, ఇందు వస్తారు. సిరితో బెడ్ మీద పడుకో, నేను కింద చాపేసుకుని పడుకుంటానని రాజు అంటాడు. నేను కూడా నీ పక్కనే పడుకుంటానని సిరి అంటుంది.

సిరి జీవితాన్నే కథగా చెప్పిన రాజు

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22 ఎపిసోడ్

మాతోపాటే పడుకో అని రాజును బెడ్ మీదకు లాగుతుంది. రాజు పడుకోనంటాడు. కానీ, సిరి వినదు. మారం చేస్తుంది. చేసేదిలేక బెడ్‌పై కూర్చుంటాడు రాజు. మొగుడా కథ చెప్పు. అలా అయితేనే నాకు నిద్ర వస్తుందని సిరి అంటుంది. రాజుకు కథలు బాగా చెప్పడం వచ్చని ఇరికిస్తుంది ఇందు.

తర్వాత రాజు కథ చెబుతాడు. కానీ, అది సిరి కథే. సిరి తండ్రి, జరిగిన యాక్సిడెంట్‌ను రాజు కథగా చెబుతాడు. అమ్మో అని సిరి అంటుంది. నీకేమైనా గుర్తుకు వచ్చిందా అని రాజు, ఇందు అడుగుతారు. ఆ గుర్తొచ్చింది.. నేను.. నేను.. నేనే అని సిరి ఆటపట్టిస్తుంది. నీకేం గుర్తుకు రాలేదా అని ఇందు అంటే.. అయ్యో పిచ్చి అక్కా.. నాకెందుకు గుర్తుకు వస్తుందని సిరి అంటుంది.

మొగుడా.. ఈ యాక్సిడెంట్ కథలు వద్దు. మంచివి చెప్పు అని సిరి అంటే.. రాజు చెబుతాడు. కథలు వింటూ రాజు ఒళ్లోనే సిరి పడుకుండిపోతుంది. దాంతో రాజు కింద పడుకుంటాడు. మరోవైపు అపర్ణ ముందు కావాలనే ఇంట్లో హాట్ టాపిక్ ఏముంది. ఇద్దరు పెళ్లాల ముద్దులు మొగుడు తప్పా అని భ్రమరాంబ అంటుంది. అపర్ణ వచ్చి తప్పుగా మాట్లాడుతున్నారని అంటుంది.

అలాంటి ఉద్దేశంతో చూస్తే ఏమనాలి

మరుసటి రోజు ఉదయం ఇందు నిద్ర లేచి వెళ్లిపోతుంది. తర్వాత సిరి నిద్రలేచి చూస్తుంది. మొగుడా.. అంటూ రాజు పక్కనే పడుకుంటుంది సిరి. అటు నుంచి వెళ్తున్న అపర్ణ అది చూసి షాక్ అవుతుంది. ఇందు కోసం వెతుకుతుంది. అప్పుడే రేఖ, భ్రమరాంబ వస్తారు. ఇందు అంటూ అపర్ణ గట్టిగా అరుస్తుంది. దాంతో రాజు నిద్రలేస్తాడు.

పక్కనే సిరిని చూసి ఉలిక్కిపడి లేస్తాడు. నీ మొదటి భార్య పక్కనే పడుకున్నావ్‌గా ఎందుకు షాక్ అని భ్రమరాంబ అంటుంది. అపర్ణ తిడుతుంది. ముందు మీ మనవరాలి జీవితం తెల్లారిపోకుండా చూసుకోండని రేఖ అంటుంది. రాత్రి నేను చెబితే వక్ర బుద్ధితో చూడొద్దన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉన్నారు అని భ్రమరాంబ అంటుంది.

పడుకుంటే తప్పేంటీ- రివర్స్ అయిన అపర్ణ

అవును, కలిసి ఉన్నారు. దాంట్లో తప్పేముంది. తను చిన్న పిల్లలా ఉంది. అలాగే రాజు పక్కన ఉంది అని అపర్ణ రివర్స్ అవుతుంది. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారని భ్రమరాంబ, రేఖ వెళ్లిపోతారు. ఇందుపై కోపంగా అపర్ణ ఉంటుంది. నానమ్మ కోప్పడకు. రాత్రి నాతోపాటే బెడ్ మీద పడుకుంది. నేను లేకపోవడం చూసి భయంతో రాజు పక్కన పడుకుందని ఇందు చెబుతుంది.

ఇకనుంచి ఇలాంటివి జరగొద్దంటే సిరి నాతోపాటే పడుకుంటుంది అని అపర్ణ అంటుంది. లేదు. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు నాకు నచ్చలేదని సిరి అంటుంది. వీళ్లే చెబుతారు అని అపర్ణ వెళ్లిపోతుంది. ఐశ్వర్య హాల్ టికెట్ పట్టుకుని కిందకు వస్తుంది. కీస్ మర్చిపోయానే అని మళ్లీ పైకి వెళ్తుంది. హాల్ టికెట్, బ్యాగ్ కింద పెట్టేసి వెళ్లిపోతుంది.

అప్పుడే కిందకు వచ్చిన సిరి హాల్ టికెట్‌తో పడవ చేసుకుందామని తీసుకెళ్తుంది. కిందకు వచ్చిన ఐశ్వర్య హాల్ టికెట్ కోసం వెతుకుతుంటుంది. అందరిని పిలిచి అడుగుతుంది. ఎవరు తీయలేదంటారు. నాకు తెలిసి ఇందునో, రాజునో తీసి ఉంటారు. వీళ్లకు తప్పా ఆ అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు ఐషు ఎగ్జామ్ పాస్ అయితే కంపెనీ రాసివ్వాలిగా. అది ఇష్టం లేక ఇలా చేసి ఉంటారని భ్రమరాంబ అంటుంది.

పడవగా మారిన ఐశ్వర్య హాల్ టికెట్

మేము తీయడం చూడనప్పుడు ఎందుకు అంటున్నావ్ అని రాజు కోప్పడుతాడు. రాజు తీస్తే ఇవ్వు. నేను ఏమనుకోను అని ఐశ్వర్య అంటుంది. తీయలేదని రాజు చెబుతాడు. హాల్ టికెట్ పోయిందో లేకుంటే డ్రామాలు ఆడుతుందో. ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతో ఇలా డ్రామాలు ఆడుతుందని రాజు అంటాడు. రాజు, ఐశ్వర్య ఇద్దరు వాదించుకుంటారు.

ఇంతలో సిరి వచ్చి ట్రైన్ ఆట ఆడుతుంది. సిరిని ఆపి తను ఏమైనా తీసిందేమో అడుగుదామని శేషు అంటాడు. సిరిని రాజు హాల్ టికెట్ తీశావా అని అడుగుతాడు. తీశానని సిరి చేసిన పడవ చూపిస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఐశ్వర్య కోప్పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks