Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ సిరి గురించి తెలుసుకోవడానికి ఇటు రాజు, ఇందు.. అటు భ్రమరాంబ చేసే ప్రయత్నాల చుట్టూ తిరిగింది. అటు రాజు, ఇందు.. మదన్, స్వాతి ఇంటికి కూడా వెళ్తారు. కానీ రేఖ విషయంలో మదన్ వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతాడు.
సిరి ఇంటికి రాజు, ఇందు.. కుటుంబం గురించి తెలుసుకొని షాక్

సిరి ఇంటికి రాజు, ఇందు వెళ్లే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. అక్కడ ఇంట్లో ఎవరూ ఉండరు. పక్కనున్న ఓ మహిళ వచ్చి ఏం కావలని అడిగితే సిరి తండ్రి శ్రీనివాస్ గురించి అడుగుతారు. వాళ్లు రెండేళ్ల కిందట ఉండే వాళ్లని, తర్వాత కనిపించకుండా పోయారని ఆమె చెబుతుంది. వాళ్లకు ఇంకా ఎవరూ లేరని, ఆయన భార్య చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని అనడంతో రాజు బాధపడతాడు.
వాళ్లు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదని, వాళ్ల గురించి పెద్దగా విషయాలు తెలియవని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో సిరికి ఈ గతి పట్టడానికి తానే కారణమంటూ రాజు బాధపడతాడు. ఇందు అతనికి సర్ది చెబుతుంది. తర్వాత మదన్, స్వాతి ఉండే ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది.. వెళ్దామనడంతో రాజు సరే అంటాడు.
సిరితో భ్రమరాంబ పులుసాట.. అటూఇటూ వాయించేసిన సిరి
మరోవైపు ఇంట్లో సిరి నుంచి ఆమె విషయాలు రాబట్టడానికి పులుసాట ఆడుతుంటుంది భ్రమరాంబ. నువ్వు ఓడిపోతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.. నేను ఓడిపోతే నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చని భ్రమరాంబ చెబుతుంది.
తొలిసారి సిరి ఓడిపోవడంతో రాజు నీకేం అవుతాడు అని భ్రమరాంబ, శేషు అడిగితే మొగుడు అని అంటుంది. ఆ తర్వాత భ్రమరాంబ ఓడిపోతుంది. దీంతో సిరి ఆమెను లాగి పెట్టి కొడుతుంది. ప్రతిసారీ భ్రమరాంబే ఓడిపోవడంతో ఆమె చెంపలను అటూఇటూ వాయించేస్తుంది. దీంతో ఈ ఆట వద్దంటూ ఆమె వెళ్లిపోతుంది.
అపర్ణకు అసలు విషయం చెప్పిన సిరి
{{/usCountry}}తొలిసారి సిరి ఓడిపోవడంతో రాజు నీకేం అవుతాడు అని భ్రమరాంబ, శేషు అడిగితే మొగుడు అని అంటుంది. ఆ తర్వాత భ్రమరాంబ ఓడిపోతుంది. దీంతో సిరి ఆమెను లాగి పెట్టి కొడుతుంది. ప్రతిసారీ భ్రమరాంబే ఓడిపోవడంతో ఆమె చెంపలను అటూఇటూ వాయించేస్తుంది. దీంతో ఈ ఆట వద్దంటూ ఆమె వెళ్లిపోతుంది.
అపర్ణకు అసలు విషయం చెప్పిన సిరి
{{/usCountry}}శేషుకు తన కందిపోయిన బుగ్గలు చూపిస్తూ భ్రమరాంబ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణను సిరి తీసుకొని వస్తుంది. ఏం జరిగిందని అడిగితే.. తానే కొట్టానని సిరి చెబుతుంది. తాము ఆడిన ఆట గురించి సిరి చెప్పడంతో అపర్ణ షాక్ తింటుంది.
అలా కొట్టొద్దని, నీకేమైనా కావాలంటే తనను అడగాలని అపర్ణ చెప్పడంతో సిరి వెళ్లిపోతుంది. ఆ తర్వాత భ్రమరాంబను నిలదీస్తుంది. మీ మనవరాలి జీవితం గురించి మీరు పట్టించుకోవడం లేదు.. అందుకే నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆమె చెబుతుంది. మళ్లీ ఆ విషయం జోలికి వెళ్లొద్దని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చి అపర్ణ వెళ్లిపోతుంది.
మదన్, స్వాతి ఇంటికి రాజు, ఇందు.. జాబ్ ఆఫర్
మరోవైపు మదన్, స్వాతి ఇంటికి రాజు, ఇందు వెళ్తారు. పంతాలు మానేసి తిరిగి ఇంటికి రావాలని, ఇలాగే ఉండిపోతే దూరాలు పెరిగిపోతాయని మదన్ కు రాజు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మదన్ మాత్రం ఈ విషయంలో తన తల్లిని క్షమించబోనని, ఆమె తనను మోసం చేసిందని అంటాడు. ఏదైనా ఉద్యోగం చూసుకున్నావా.. ఇల్లు గడవాలి కదా అడిగితే ప్రయత్నం చేస్తున్నానని మదన్ చెబుతాడు.
ఎక్కడో ఎందుకు.. స్వరాజ్ గ్రూపులోనే ఉద్యోగం చేయు.. మాకు కూడా నువ్వు తోడుగా ఉన్నట్లు ఉంటుందని రాజు, ఇందు అంటారు. కానీ మదన్ దానికి కూడా అంగీకరించడు. అలా అయితే మా అమ్మ నన్ను నీచంగా చూస్తుందని, తనకు బతకడం చేతకాక మళ్లీ ఇక్కడికి వచ్చానని అంటుంది.. అంతేకాదు అక్కడికి వస్తే ఆమెను చూడాలి.. అది ఇష్టం లేదు అని మదన్ స్పష్టం చేస్తాడు. అటు స్వాతి కూడా అలాగే అంటుంది. దీంతో చేసేది లేక.. జాగ్రత్తలు చెప్పి రాజు, ఇందు వెళ్లిపోతారు.
డైనింగ్ టేబుల్ దగ్గర భ్రమరాంబ పరువు తీసిన సిరి
ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే సిరి కూడా తినడానికి వస్తుంది. భ్రమరాంబను చూసి ఆమెను ఆటపట్టిస్తుంది. డబ్బా పిన్ని బుగ్గలు ఎలా అయ్యాయో చూశారా అని అడుగుతుంది. దీంతో భ్రమరాంబ మొహం వాడిపోతుంది. తర్వాత సిరి తన చేతులతో తానే తినడం చూసి అందరూ షాక్ తింటారు. ఇలా తినడం ఇందు నేర్పించిందని అనడంతో శేషు మెచ్చుకుంటాడు. చేత్తో తిన్నంత మాత్రాన ఆమెకున్న వెర్రి తగ్గిపోతుందా అని రేఖ నోరు జారడంతో రాజు ఆమెకు క్లాస్ పీకుతాడు.
తాగి నిజం వాగేసిన రాజు
ఆ తర్వాత భ్రమరాంబ మరో ప్లాన్ వేస్తుంది. శేషుతో కలిసి రాజు మందు తాగేలా చేస్తుంది. రాజు పీకలదాకా తాగిన తర్వాత సిరి గురించి అడుగుతుంది. దీంతో అతడు ఆ మత్తులో అన్ని విషయాలు చెప్పేస్తాడు. అది చూసిన ఇందు కూడా షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.