Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుకు తాగించి సిరి వివరాలను రాబట్టాలని చూసిన భ్రమరాంబకు గట్టి షాకే తగులుతుంది. ఆ ప్లానంతా రివర్స్ అవుతుంది. మరోవైపు రాజు తాగినా అతనితో ఇందు రొమాన్స్ చేయడం ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.
ఈ ఇంటికి వారసురాలు నా భార్యే అన్న రాజు..

డైనింగ్ టేబుల్ దగ్గర సిరిని అవమానించేలా మాట్లాడిన రేఖకు రాజు క్లాస్ పీకే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. తన ఆంటీని అనే హక్కు నీకు లేదని, ఈ ఇంట్లో తాము జాలి చూపిస్తే ఉంటున్నావని ఐశ్వర్య జోక్యం చేసుకుంటుంది. దీంతో తన భర్త విషయంలో ఎలా పడితే అలా మాట్లాడొద్దని చెప్పానా అంటూ ఇందు అంటుంది.
అటు రాజు కూడా మరింత చెలరేగుతాడు. అసలు ఈ ఇంటికి వారసురాలు మీ ఆంటీ కాదు.. నా భార్య ఇందు.. ఆమె భర్తను కాబట్టి ఈ ఇంటిపై తనకూ పూర్తి హక్కులు ఉన్నాయని, అందువల్ల తాను ఏం చెబితే అది అందరూ వినాల్సిందే అని రాజు తేల్చి చెబుతాడు. ఇంకోసారి సిరి విషయంలో ఎవరైనా నోరు జారితే అప్పుడు చెబుతాను అంటూ వార్నింగ్ ఇస్తాడు.
శేషుకు భ్రమరాంబ ట్రీట్.. రాజుతో మందు పార్టీ..
మరోవైపు సిరి నుంచి వివరాలు రాబట్టే ప్లాన్ ఫెయిలవడంతో భ్రమరాంబ, రేఖ మరో ప్లాన్ వేస్తారు. శేషుని పిలిచి మందు బాటిల్ చేతిలో పెడుతుంది భ్రమరాంబ. దీంతో అతడు ఫుల్ ఖుషీ అయిపోతాడు. ఆ తర్వాత అసలు విషయం చెబుతుంది. ఆ రాజుతో కూర్చొని అతని నుంచి సిరి వివరాలు రాబట్టాలని అంటుంది. తాను చేయనని మొదట శేషు అంటాడు.
దీంతో మందు బాటిల్ లాక్కోవడానికి వెళ్తే సరే చేస్తాను లే అని శేషు రాజు దగ్గరికి వెళ్తాడు. కాస్త మందేద్దాం వస్తావా అని అడుగుతాడు. దీంతో రాజు కూడా టెంప్ట్ అవుతాడు. ఇందు దగ్గర రెండె గ్లాసులు అంటూ అనుమతి తీసుకుంటాడు. ఆమె ఓకే చెప్పడంతో ఆనందంతో ఆమెకు ముద్దిస్తాడు. తర్వాత సారీ చెప్పి శేషుతో వెళ్లిపోతాడు.
ఐశ్వర్య గదిలో లక్కీ.. బావామరదళ్లమంటూ..
{{/usCountry}}దీంతో మందు బాటిల్ లాక్కోవడానికి వెళ్తే సరే చేస్తాను లే అని శేషు రాజు దగ్గరికి వెళ్తాడు. కాస్త మందేద్దాం వస్తావా అని అడుగుతాడు. దీంతో రాజు కూడా టెంప్ట్ అవుతాడు. ఇందు దగ్గర రెండె గ్లాసులు అంటూ అనుమతి తీసుకుంటాడు. ఆమె ఓకే చెప్పడంతో ఆనందంతో ఆమెకు ముద్దిస్తాడు. తర్వాత సారీ చెప్పి శేషుతో వెళ్లిపోతాడు.
ఐశ్వర్య గదిలో లక్కీ.. బావామరదళ్లమంటూ..
{{/usCountry}}ఇటు తన గదిలో ఉన్న ఐశ్వర్య దగ్గరికి లక్కీ వస్తాడు. ఆమెకు పాలు తీసుకొని వస్తాడు. పరీక్షలు అయిపోయాయి కదా ఇంకా ఏం చదువుతున్నావని అంటాడు. ఇది పరీక్షల కోసం కాదు.. ఇందు నాకు బిజినెస్ పెట్టిస్తుంది కదా.. అందుకే ముందే బిజినెస్ పాఠాలు నేర్చుకుంటున్నాను అని ఐషూ చెబుతుంది. మరి నువ్వు డిగ్రీ పాసవుతావా.. ఒక్కదాంట్లో ఫెయిలైనా ఫెయిలైనట్లే కదా.. అప్పుడు ఇందు నీకు కంపెనీ పెట్టివ్వదు కదా అని లక్కీ అనడంతో అతనిపై మండిపడుతుంది.
నేను పాసైతానన్న నమ్మకం నాకుంది.. అయినా నువ్వెందుకు వచ్చావని అంటుంది. నీకు పాలు ఇద్దామని వచ్చాను.. రోజూ నువ్వే తెచ్చుకుంటున్నావు కదా.. నీకెందుకు అంత కష్టమని ఇలా చేశాను.. అయినా ఇప్పుడు మా అమ్మ నన్ను కొడుకుగా అంగీకరించింది కదా.. మనం బావామరదళ్లం కదా అని లక్కీ అంటాడు. దీంతో ఐశ్వర్య మరింత అసహ్యించుకుంటూ.. అసలు నువ్వు గదిలోకి రావద్దని వార్నింగ్ ఇస్తుంది.
శేషు, రాజు పార్టీ.. ఆమ్లెట్ తీసుకొచ్చిన భ్రమరాంబ
శేషు, రాజు పార్టీ స్టార్ట్ చేస్తారు. స్టఫ్ ఎక్కడ అని రాజు అడిగితే వస్తుంది చూడు అని శేషు అంటాడు. అప్పుడే ఆమ్లెట్లతో భ్రమరాంబ ఎంట్రీ ఇస్తుంది. అది చూసి రాజు షాక్ తింటాడు. మేము పార్టీ చేసుకుంటున్నది మీకెలా తెలుసు అని రాజు అడిగితే.. మీ మామయ్యే చెప్పాడని అంటుంది. తర్వాత భ్రమరాంబ వెళ్లిపోతానంటే రాజు మాత్రం ఆమెను బలవంతంగా కూర్చోబెడతాడు.
మందెక్కువై భ్రమరాంబతో ఆడుకున్న రాజు
ఆ తర్వాత మెల్లగా రాజుకు మందెక్కువవుతుంది. దీంతో భ్రమరాంబతో ఆడుకోవడం మొదలు పెడతాడు. ఏమే సూర్యకాంతం అత్త.. నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే.. ఎవడికో ఇచ్చి చేస్తావా.. వాడు ఆమెను ఎన్ని కష్టాలు పెడుతున్నాడో తెలుసా అంటూ క్లాస్ పీకుతాడు. సూర్యకాంతం ఏంటి అని భ్రమరాంబ అంటే.. అల్లుడు పాత జ్ఞాపకాల్లో వెళ్లాడు.. నువ్వు క్యారెక్టర్ లో ఉండు అని శేషు అంటాడు.
ఆమె సరే అంటూ మెల్లగా.. ఆ విషయాలు వద్దు కానీ అసలు సిరి గురించి చెప్పు.. ఆమె ఎవరు? నీకు ఎప్పుడు పరిచయం అయింది.. పెళ్లెప్పుడైంది అంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. దీంతో రాజు రెచ్చిపోతాడు. భ్రమరాంబను చితకబాదుతాడు. ముందు చేత్తో, ఆ తర్వాత కర్రతో ఎడాపెడా బాదేస్తాడు. దీంతో శేషుతో కలిసి ఆమె పారిపోతుంది.
రాజు, ఇందు రొమాన్స్
ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రాజు.. ఇందు కాళ్ల దగ్గర ఉంటాడు. తాగి వచ్చావా అని ఇందు అడుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాను.. తాగి గదిలోకి రావద్దని అంటూ క్లాస్ పీకుతుంది. అప్పుడే రాజుకు బల్లి కనిపించడంతో భయంతో ఇందును హగ్ చేసుకుంటాడు. దీంతో ఆమెలోనూ ప్రేమ పడుతుంది. రాజును ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.