...
...
Next Story

Brahmamudi September 30 Episode: బ్రహ్మముడి.. సిరిని ఎత్తుకెళ్లిన ఆటోవాలా.. పోలీసుల పేరు చెప్పి ఇందుని భయపెట్టిన రేఖ

Brahmamudi Serial September 30 Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 30 ఎపిసోడ్ లో సిరిని రేఖ మనిషి సిటీకి దూరంగా వదిలేస్తాడు. అయితే ఆమె కోసం ఎంతో వెతికిన రాజు, ఇందు.. చివరికి సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకున్నా అప్పటికే ఆలస్యమవుతుంది.

Published on: Sep 30, 2026, 08:59:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మొత్తం సిరి తప్పిపోవడం, ఆమెను వెతికే పనిలో రాజు, ఇందు ఉండటం చుట్టూ తిరిగింది. సిరిని ఓ ఆటోవాలా తీసుకెళ్లడంతో ఆమె ప్రమాదంలో పడుతుంది. సిరి కనిపించకపోవడం వెనుక రేఖ హస్తం ఉందని అనుమానించిన రాజు.. ఆమెను నిలదీయగా.. పోలీసుల పేరు చెప్పి ఆమె బెదిరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

సిరి కోసం వెతికిన రాజు, ఇందు.. దొరకనే దొరకదన్న రేఖ

Brahmamudi September 30 Episode: బ్రహ్మముడి.. సిరిని ఎత్తుకెళ్లిన ఆటోవాలా.. పోలీసుల పేరు చెప్పి ఇందుని భయపెట్టిన రేఖ
Brahmamudi September 30 Episode: బ్రహ్మముడి.. సిరిని ఎత్తుకెళ్లిన ఆటోవాలా.. పోలీసుల పేరు చెప్పి ఇందుని భయపెట్టిన రేఖ

సిరి కనిపించడం లేదని ఇందు చెప్పడంతో రాజు కంగారు పడుతూ ఆమె కోసం వెతికే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ మొదలైంది. రాజు, ఇందు టెన్షన్ పడుతూ ఇల్లంతా వెతుకుతారు. కానీ రేఖ మాత్రం లోలోపల సంతోషిస్తుంది. ఆమె దొరకనే దొరకదు.. దూరంగా పంపించేశాను.. మీరు ఎంత వెతికినా ప్రయోజనం లేదు అని అనుకుంటుంది. ఎంత వెతికినా సిరి దొరకకపోవడంతో రాజు, ఇందుకి ఏం చేయాలో తోచదు.

సిరిని దూరంగా వదిలేసిన రేఖ మనిషి

మరోవైపు సిటీకి దూరంగా వెళ్లిన తర్వాత రేఖ మనిషి సిరిని అక్కడ దింపేస్తాడు. తాను ఎక్కడికి వచ్చానో తెలియక సిరి ఏడుస్తుంది. తనను తన మొగుడి దగ్గరకు తీసుకెళ్లు అని ఆ డ్రైవర్ వెంట పడుతుంది. కానీ అతడు మాత్రం సిరిని తిట్టి అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. కొంత దూరం వెళ్లి రేఖకు ఫోన్ చేసి ఆమెను సిటీ ఔట్‌స్కర్ట్స్ లో వదిలేసినట్లు చెబుతాడు. నీ డబ్బు ఇప్పటికే నీకు పంపించాను అని రేఖ అంటుంది.

రేఖను నిలదీసిన రాజు.. శేషును బతిమాలినా..

ఆమెది చిన్న పిల్లల మనస్తత్వం.. వీళ్లకు ఎలాగూ మనసు లేదు.. కనీసం నువ్వయినా చెప్పు.. నీకు దండం పెడతాను అని బతిమాలుతాడు. కానీ శేషు కూడా అసలు విషయం చెప్పడు. తామందరం కలిసి ఆడుకుంటుంటే సిరి వచ్చిందని, ఆ తర్వాత కనిపించకుండా పోయిందని చెబుతాడు. దీంతో ఇందులో రేఖ పాత్ర కచ్చితంగా ఉందని రాజు ఫిక్సయిపోతాడు.

పోలీసులను పిలిపించమన్న రేఖ.. వద్దని వారించిన ఇందు

అయితే రేఖ మాత్రం బుకాయిస్తూనే ఉంటుంది. ఆమెకు మద్దతుగా భూషణ్ వస్తాడు. ఇప్పటికే మా కొడుకుని మాకు దూరం చేసి.. ఇప్పుడు ఈ నిందలు కూడా మాపై వేస్తావా అంటాడు. ఇలా కుదరదు.. పోలీసులను పిలిస్తే వాళ్లే చూసుకుంటారు అని రేఖ అంటుంది. సరే నేను కూడా అదే చేస్తాను.. పోలీసులను పిలుస్తాను అని రాజు అంటాడు. పిలువు చూద్దాం అని రేఖ మరింత రెచ్చగొడుతుంది. కానీ ఇందు మాత్రం వద్దని వారించి రాజుని గదిలోకి లాక్కెళ్తుంది. పోలీసుల పేరు చెప్పగానే కంగారు పడుతున్నారంటే ఏం చేయాలో క్లారిటీ వచ్చేసిందని రేఖ అనుకుంటుంది.

సిరిపై కన్నేసిన ఆటోవాలా

మరోవైపు సిరి రోడ్డుపై దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తనను తన మొగుడి దగ్గరికి తీసుకెళ్లాలని కనిపించిన వాళ్లందరినీ అడుగుతుంది. కానీ మీ ఇంట్లో వాళ్ల వివరాలు ఇవ్వమంటే మాత్రం తెలియదంటుంది. దీంతో ఎవరూ ఆమెకు సాయం చేయరు. ఆ సమయంలోనే ఓ ఆటోవాలా ఆమెపై కన్నేస్తాడు. ఆమెను తీసుకెళ్దామని అనుకుంటాడు.

రాజుకు క్లాస్ పీకిన ఇందు.. సీసీటీవీ కెమెరాలు చూసి తెలుసుకొని..

ఇటు రాజుని గదిలోకి తీసుకెళ్లిన ఇందు.. అతనికి క్లాస్ పీకుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్తే మనకే ప్రమాదం.. రేఖ ఆంటీ కావాలనే రెచ్చగొడుతోంది.. ఇప్పుడు పోలీసులు వస్తే ఆమె ఎవరు.. నీకెలా తెలుసులాంటి ప్రశ్నలు అడుగుతారు. దీనివల్ల అందరూ చిక్కుల్లో పడతారు అని ఇందు అనడంతో రాజు అర్థం చేసుకుంటాడు. మరిప్పుడేం చేద్దాం అని అడుగుతాడు.

ఇంటి ముందు ఉన్న సీసీటీవీ వీడియో చూస్తే తెలుస్తుందేమో అనుకొని ఇందు ఆ ఫుటేజీ చూస్తుంది. అందులో అందరూ ఆడుకుంటుంటే సిరి ఓ కారు డిక్కీలో వెళ్లి దాక్కోవడం, ఆ కారు వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఆ కారు ఓ ట్రావెల్స్ కంపెనీది అని తెలుసుకొని వాళ్లకు ఫోన్ చేసి ఆ కారు వివరాలు తెలుసుకుంటారు రాజు, ఇందు.

ప్రమాదంలో సిరి

అయితే అప్పటికే ఆ ఆటోవాలా సిరి దగ్గరికి వెళ్తాడు. నీ మొగడు నాకు బాగా తెలుసు నిన్ను తీసుకెళ్తానని అంటాడు. దీంతో సిరి అతని వెంట వెళ్తుంది. తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి రమ్మంటాడు. సిరిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్లంతా చుట్టుముడతారు. అటు రాజు, ఇందు ఆ డ్రైవర్ కు ఫోన్ చేసి అతడు చెప్పిన లొకేషన్ కు వెళ్తారు. ఆమెను ఇక్కడే వదిలేశానని అతడు చెబుతాడు. దీంతో సిరి కోసం అక్కడంతా వెతుకుతుంటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks