Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. రాజు గురించి ఎవరూ ఊహించని నిజాన్ని రేఖ ఆధారాలతో బయటపెడుతుంది. అందరూ ఆ విషయం విని షాకైనా.. ఇందు మాత్రం రేఖకు అంతకంటే పెద్ద షాక్ ఇవ్వడం ఈ రోజు ఎపిసోడ్ హైలైట్.
వెంకీ, నందును బయటకు పంపిన ఇందు.. లక్ష్మికి హామీ ఇచ్చి..

రాజు బర్త్ డే ఏర్పాట్లలో భాగంగా కేక్, చికెన్ తీసుకురావాలని వెంకీ, నందును కావాలని ఇందు బయటకు పంపించే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. వాళ్ల మధ్య దూరం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అది చూసి లక్ష్మి ఆందోళనగా ఇందు దగ్గరికి వస్తుంది. ఇది వాళ్ల మరింత దూరం పెంచుతుందేమో అని అంటుంది.
అలా ఏమీ జరగదు.. ఇలా కలిపితేనే దూరం తగ్గుతుంది.. ఇక అంకుల్ గురించి వదిలేయండి.. మా ఇంటికి వస్తే ప్రమాదం కాదు.. మంచే జరుగుతుందని తెలిస్తే వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు.. అంకుల్ ను ఒప్పించే బాధ్యత నాది అని లక్ష్మికి ఇందు హామీ ఇస్తుంది. నువ్వు మా ఇంటికి కోడలివి అయితే సమస్య అనుకున్నాం కానీ.. ఒక్కో సమస్యను నువ్వే పరిష్కరిస్తున్నావంటూ ఇందుపై లక్ష్మి ప్రశంసలు కురిపిస్తుంది.
సిరి కోసం హాస్పిటల్‌కు రాజు.. మాట్లాడలేకపోవడంతో షాక్
అటు సిరి కోసం హాస్పిటల్ కు రాజు పరుగెత్తుకొని వెళ్తాడు. కళ్లు తెరించిందటగా మాట్లాడుతోందా అని డాక్టర్ ను రాజు అడుగుతాడు. కానీ సిరి కళ్లు తెరిచినా.. ఏమీ మాట్లాడదు.. దీంతో రాజు మరింత ఆందోళన పడతాడు. ఆమె కళ్ల ముందు ఏమి కనిపిస్తే దానిని చూస్తోంది కానీ మెదడు ఇంకా పూర్తి రెస్పాండ్ కావడం లేదని రాజుకు చెబుతాడు డాక్టర్. త్వరలోనే కోలుకుంటుందని హామీ ఇస్తాడు.
రాజు సీక్రెట్ తెలుసుకున్న రేఖ
అటు రేఖ మనిషి రాజును ఫాలో అవుతూ హాస్పిటల్ కు వస్తాడు. రాజును డాక్టర్ తో చూసి ఆ విషయం రేఖకు ఫోన్ చేసి చెబుతాడు. రాజు ఇక్కడ వసుంధర హాస్పిటల్ కు వచ్చాడని, ఓ అమ్మాయి కోసం డాక్టర్ తో మాట్లాడుతున్నాడని అంటాడు. అమ్మాయి కోసమా అని రేఖ ఆశ్చర్యపోతుంది. సరే నువ్వు అక్కడే ఉండి.. ఏం మాట్లాడుతున్నాడో విను.. నేను వస్తున్నాను అని రేఖ అంటుంది. రాజు గురించి ఏదో సీక్రెట్ తెలిసిందని రేఖ సంబరపడుతుంది.
నందుకు మళ్లీ అబద్ధం చెప్పిన వెంకీ
{{/usCountry}}అటు రేఖ మనిషి రాజును ఫాలో అవుతూ హాస్పిటల్ కు వస్తాడు. రాజును డాక్టర్ తో చూసి ఆ విషయం రేఖకు ఫోన్ చేసి చెబుతాడు. రాజు ఇక్కడ వసుంధర హాస్పిటల్ కు వచ్చాడని, ఓ అమ్మాయి కోసం డాక్టర్ తో మాట్లాడుతున్నాడని అంటాడు. అమ్మాయి కోసమా అని రేఖ ఆశ్చర్యపోతుంది. సరే నువ్వు అక్కడే ఉండి.. ఏం మాట్లాడుతున్నాడో విను.. నేను వస్తున్నాను అని రేఖ అంటుంది. రాజు గురించి ఏదో సీక్రెట్ తెలిసిందని రేఖ సంబరపడుతుంది.
నందుకు మళ్లీ అబద్ధం చెప్పిన వెంకీ
{{/usCountry}}అటు కేక్ కోసం బయటకు వెళ్లిన వెంకీ, నందు బైక్ పై సైలెంట్ గా వెళ్తుంటారు. పిలిచావా అని నందుయే మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. కానీ తానేమీ పిలవలేదని వెంకీ అంటాడు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే ఏమీ లేదని వెంకీ అంటాడు. కేక్ తోపాటు వదిన చికెన్ కూడా తీసుకురమ్మంది కదా అని అనడంతో నందు షాకవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు అని విసుక్కుంటుంది.
హాస్పిటల్‌కు రేఖ.. సిరితో రాజును చూసి షాక్
మరోవైపు రేఖ వెంటనే హాస్పిటల్ కు వెళ్తుంది. ఆమె మనిషి రాజు ఎక్కడున్నాడో చూపించి వెళ్లిపోతాడు. అక్కడ సిరితో కలిసి రాజును చూసి రేఖ షాక్ తింటుంది. రాజు డాక్టర్ తో మాట్లాడుతుంటే.. బయట నుంచి చూస్తూ ఉంటుంది. సిరి కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెడతానని రాజు అంటాడు. ఇంత వరకూ చాలా ఖర్చు పెట్టారు.. ఇక అవసరం లేదు.. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్ హామీ ఇస్తాడు. ఆ తర్వాత నర్సును బయటకు పంపించి మందులు తీసుకురమ్మని చెబుతాడు.
రాజుకు పెళ్లయిందన్న నర్సు.. మురిసిపోయిన రేఖ
నర్సు బయటకు రాగానే రేఖను చూసి ఎవరని అడుగుతుంది. నేను లోపల ఉన్న అబ్బాయి కోసం వచ్చానని చెబుతుంది. రాజు కోసమా అని అడుగుతుంది. అవునని రేఖ అంటుంది. ఏం తెలుసుకోవాలని అని నర్సు అడగడంతో మా అమ్మాయి కోసం సంబంధాలు చూస్తున్నామని, ఓ పెళ్లిళ్ల పేరయ్య రాజు గురించి చెప్పడంతో వచ్చానని రేఖ అబద్ధం చెబుతుంది.
కానీ నర్సు మాత్రం అతనికి ఇప్పటికే పెళ్లయిందని, ఆ బెడ్ పై ఉన్న సిరి అనే అమ్మాయే అతని భార్య అని చెప్పడంతో రేఖ మైండ్ బ్లాకవుతుంది. భర్త స్థానంలో అతని పేరే ఉందని ఫైల్ చూపిస్తుంది నర్సు. రేఖ దానిని ఫొటో తీసుకుంటుంది. రాజు తనకు దొరికిపోయాడని తెగ సంతోషపడుతుంది.
రాజు బర్త్‌డే కోసం వెంకీ, నందు ఏర్పాట్లు.. ఐశ్వర్యకు క్లాస్
ఇంట్లో రాజు బర్త్ డే కోసం వెంకీ, నందును కలిసి డెకరేషన్ చేయమని ఇందు చెబుతుంది. దీంతో ఇద్దరూ ఆ పనుల్లో ఉంటారు. అప్పుడే ఐశ్వర్య వచ్చి నువ్వు వరంగల్లో ఉండాలి కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్.. నువ్వు రావని నేను చాలా సంతోషించానని ఐశ్వర్య అంటుంది. దీంతో నందు ఆమెతో గొడవ పడుతుంది. క్లాస్ పీకుతుంది. ముందు నువ్వు డిగ్రీ పాసై చూపించు అని ఛాలెంజ్ చేస్తుంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. లక్కీ కూడా వచ్చి పరువు తీయడంతో ఐషూ వెళ్లిపోతుంది.
అందరి ముందు రాజు నిజం బయటపెట్టిన రేఖ.. షాకిచ్చిన ఇందు
అటు రాజు కోసం అందరూ ఎదురు చూస్తుండగా అతడు వస్తాడు. నీ బర్త్ డే నాడే నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అని ఇందు అడుగుతుంది. ఒక ముఖ్యమైన పని అని రాజు అంటాడు. అవును నిజంగానే చాలా ముఖ్యమైన పని అని రేఖ ఎంట్రీ ఇస్తుంది. రాజు వెళ్లిన పని చాలా ముఖ్యమైనదని, ఆ విషయం అతన్నే అడగండి అని అంటుంది.
రాజు వెళ్లింది ఓ హాస్పిటల్ కు అని రేఖ చెబుతుంది. అక్కడ ఉన్న ఆ అమ్మాయి ఎవరు రాజు.. సిరితో నీకు పెళ్లయింది కదా అని అడగడంతో అందరూ షాకవుతారు. తన దగ్గర ఉన్న ఆధారాన్ని కూడా చూపిస్తుంది. కానీ ఇందు మాత్రం సిరి గురించి తనకు ముందే తెలుసు అని అనడంతో రేఖకు దిమ్మదిరిగపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.