బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 913వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అప్పు విషయంలో మొదట వెనక్కి తగ్గని ధాన్యం తర్వాత దిగి వస్తుంది. అటు రాహుల్ కు క్లైంట్స్ షాకిచ్చి మళ్లీ రాజ్ దగ్గరికి వస్తారు. నెల రోజుల్లోనే స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్ గా నిలుస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంలో గంతులేస్తుంది.
అత్తకు ఎదురు తిరిగిన ధాన్యం.. కంగు తిన్న ఇందిరా దేవి

బ్రహ్మముడి సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ ధాన్యలక్ష్మికి ఇందిరా దేవి క్లాస్ పీకే సీన్ తో మొదలువుతుంది. నువ్వు నీ కోడలు ఎలా మాట వినాలని అనుకుంటున్నావో తాను కూడా నువ్వు అలాగే వినాలని అనుకుంటున్నట్లు ఇందిరా దేవి అంటుంది. దీంతో ధాన్యం ఎదురు తిరుగుతుంది. ఇన్నేళ్లూ ఎప్పుడూ మీ మాట జవదాటలేదని, ఇప్పుడు కూడా మీకు ఇష్టం లేని అన్నదానం చేయనని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్ తింటారు. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో రాజ్, కావ్య, ఇందిరా దేవి బాధపడతారు.
రాహుల్‌కు క్లైంట్స్ షాక్.. రుద్రాణి కొత్త ప్లాన్
ఇటు మన కంపెనీ క్లైంట్స్ అందరూ మన డిజైన్ల కంటే స్వరాజ్ గ్రూపు డిజైన్లే బాగున్నాయని అక్కడికి వెళ్తామంటున్నారని రాహుల్ కు ఫోన్ చేసి చెబుతాడు మేనేజర్ మూర్తి. దీంతో రాహుల్ ఆగ్రహంతో ఊగిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి.. రాజ్, కావ్యలను దెబ్బ కొట్టడానికి మరో ప్లాన్ చెబుతుంది. ఇలా డిజైన్లంటే కుదరదని, వాళ్లను ఎమోషనల్ గా దెబ్బకొట్టి బిజినెస్ తన వైపు తిప్పుకోవాలని చెబుతుంది. రాహుల్ సరే అంటాడు.
అప్పుకి రేణుక థ్యాంక్స్.. కరిగిన ధాన్యం మనసు
తన కూతురిని తనకు అప్పగించిన అప్పుకి థ్యాంక్స్ చెప్పడానికి రేణుక వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుని పిలిచి థ్యాంక్స్ చెబుతుంది. ఆ పాప కూడా మీరు పోలీస్ డ్రెస్ వేసుకోవాలని, తనలాంటి వాళ్లను రక్షించాలని, తాను కూడా పోలీస్ అవుతానని అంటుంది. ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం అని ధాన్యంతోనూ రేణుక అంటుంది. దీంతో ఆమె మనసు కాస్త కరిగినట్లు అనిపిస్తుంది.
ధాన్యలక్ష్మికి క్లాస్ పీకిన ప్రకాశం
{{/usCountry}}తన కూతురిని తనకు అప్పగించిన అప్పుకి థ్యాంక్స్ చెప్పడానికి రేణుక వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుని పిలిచి థ్యాంక్స్ చెబుతుంది. ఆ పాప కూడా మీరు పోలీస్ డ్రెస్ వేసుకోవాలని, తనలాంటి వాళ్లను రక్షించాలని, తాను కూడా పోలీస్ అవుతానని అంటుంది. ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం అని ధాన్యంతోనూ రేణుక అంటుంది. దీంతో ఆమె మనసు కాస్త కరిగినట్లు అనిపిస్తుంది.
ధాన్యలక్ష్మికి క్లాస్ పీకిన ప్రకాశం
{{/usCountry}}రేణుక మాటలను గుర్తు చేసుకుంటూ ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రకాశం అక్కడికి వచ్చి ఆమెకు క్లాస్ పీకుతాడు. తాను అప్పు మీద ప్రేమతోనే ఇలా చేస్తున్నానని ధాన్యం అంటుంది. పక్షులకు రెక్కలు వచ్చిన తర్వాత వాటిని వదిలేయాలని, ఇలా పట్టుకొని ఉంటే ఎలా అని ప్రకాశం అంటాడు.
కల్యాణ్ బిజినెస్ చేయను రైటర్ అవుతాను అంటే ఒప్పుకున్న నువ్వు అప్పు విషయంలో ఎందుకిలా చేస్తున్నావని నిలదీస్తాడు. కొడుకు విషయంలో ఒకలా, కోడలి విషయంలో మరోలా చేయడం కరెక్టేనా అని ప్రకాశం అనడంతో ధాన్యం ఆలోచనలో పడుతుంది.
రాజ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శృతి..
మరోవైపు ధాన్యం అలా ఎందుకు చేసిందంటూ రాజ్, కావ్య ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో శృతి రాజ్ కు ఫోన్ చేస్తుంది. ఓ గుడ్ న్యూస్ అని, మన క్లైంట్స్ అందరూ మన దగ్గరికే వస్తున్నారని అంటుంది. దీంతో రాజ్ ఎగిరి గంతేస్తాడు. కానీ కావ్య మాత్రం ఇప్పుడే ఆర్డర్ తీసుకోవద్దని, తాము వాళ్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తుంది.
రాజ్ ఎందుకలా చేస్తున్నావని అడిగితే.. మనను కాదని వెళ్లారు.. ఇప్పుడు మళ్లీ మనమే కావాలని వస్తున్నారు.. రేపు మళ్లీ ఇలా చేయరని గ్యారెంటీ ఏంటని అనడంతో రాజ్ కూడా ఆలోచనలో పడతాడు. బిజినెస్ లో నన్ను మించిపోతున్నావని కావ్యను మెచ్చుకుంటాడు.
అప్పును ఓదార్చిన అపర్ణ, ఇందిరా దేవి
ఇటు బాధపడుతూ కూర్చున్న అప్పుని ఇంట్లో వాళ్లందరూ ఓదారుస్తుంటారు. నువ్వు ఏ తప్పు చేయలేదని అంటారు. అప్పుడే ధాన్యం అక్కడికి వస్తుంది. తన తప్పు తెలుసుకున్నానని, ఇక నుంచి నువ్వు ఉద్యోగం చేయొచ్చని చెప్పడంతో అప్పుతోపాటు అందరూ సంతోషిస్తారు. అటు బిజినెస్ సమస్య కూడా తీరితే ఇక సంతోషమే సంతోషం అని సుభాష్ అంటాడు.
నెల రోజుల్లో కంపెనీని మళ్లీ నంబర్ వన్ చేయాలని రాజ్ స్పష్టం చేస్తాడు. ఆ దిశగానే పని చేసి విజయం సాధిస్తారు. మళ్లీ మనమే నంబర్ వన్ అని కావ్య సంతోషంగా చెబుతుంది. అటు రాహుల్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతాడు. న్యాయంగా పని చేయాలంటూ అందరి ముందే రాహుల్ కు సుభాష్ క్లాస్ పీకుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.