...
...
Next Story

బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్: మంటల్లో దుగ్గిరాల ఇల్లు.. దొంగ బంగారంతో రాజ్, కావ్యలకు రాహుల్ చెక్

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ లో రాజ్, కావ్య మళ్లీ స్వరాజ్ గ్రూపును నంబర్ వన్ గా నిలుపుతారు. అయితే వాళ్లను దెబ్బ కొట్టడానికి రాహుల్ మరోసారి అడ్డదారి తొక్కడానికి సిద్ధమవుతాడు. దుగ్గిరాల ఇల్లు మంటల్లో ఉన్నట్లు కావ్యకు పీడకల వస్తుంది.

Published on: Dec 26, 2025, 08:13:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 914వ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే అది చూసిన ఓర్వలేని రాహుల్, రుద్రాణి మరో కుట్రకు సిద్ధమవుతారు. దొంగ బంగారంతో రాజ్, కావ్యలను దెబ్బ కొట్టాలని రాహుల్ భావిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

వెనక్కి తగ్గిన ధాన్యం.. ఉద్యోగం చేసుకోమంటూ..

బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్: మంటల్లో దుగ్గిరాల ఇల్లు.. దొంగ బంగారంతో రాజ్, కావ్యలకు రాహుల్ చెక్
బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్: మంటల్లో దుగ్గిరాల ఇల్లు.. దొంగ బంగారంతో రాజ్, కావ్యలకు రాహుల్ చెక్

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ అప్పు విషయంలో ధాన్యలక్ష్మి వెనక్కి తగ్గే సీన్ తో మొదలవుతుంది. అందరూ అప్పును ఓదారుస్తుండగా అక్కడికి ధాన్యం వచ్చి తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, నిన్ను వేధించి తాను ఏం సాధిస్తానని అంటుంది.

నీకు నచ్చిన ఉద్యోగం చేసుకో.. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాతే అని చెబుతుంది. ఇది విని అప్పు సంతోషిస్తుంది. ఇంట్లో వాళ్లందరు కూడా ఓ సమస్య తీరిపోయిందనుకుంటారు. బిజినెస్ లోనూ అదే జరిగితే బాగుంటుందని సుభాష్ అంటాడు.

కావ్య, అప్పులకు నిండిన నెలలు.. రాజ్, కల్యాణ్ సేవలు

ఆ తర్వాత కావ్య, అప్పులకు నెలలు నిండినట్లుగా చూపించారు. భార్యలకు రాజ్, కల్యాణ్, ఇంట్లో వాళ్లు సేవలు చేస్తుంటారు. ఓవైపు స్వరాజ్ గ్రూపును మళ్లీ టాప్ లో నిలబెట్టాలని ఆఫీసులో బిజీగా ఉంటారు రాజ్, కావ్య. వెళ్లిపోయిన పాత క్లైంట్లు మళ్లీ వాళ్ల దగ్గరికి వస్తారు. అటు రాహుల్ ఫ్రస్ట్రేషన్ పీక్ కు చేరుకుంటుంది. బిజినెస్ చేజారిపోతోందని భయపడతాడు.

స్వరాజ్ గ్రూప్ నంబర్ వన్.. ఇంట్లో సంబరాలు

అప్పుడే రాహుల్ కూడా వచ్చి రాజ్ కు కంగ్రాట్స్ చెబుతాడు. పక్కనే ఉన్న సుభాష్ అతనికి క్లాస్ పీకుతాడు. బిజినెస్ నైతికతతో ఎలా చేయాలో రాజ్ ను చూసి నేర్చుకోవాలని, అతనిలా కష్టపడాలని చెబుతాడు. దీంతో స్వప్న, రుద్రాణి సీన్ లోకి ఎంటరవుతారు. అంటే ఇన్నాళ్లూ రాహుల్ అసలు కష్టపడటం లేదు.. ఎవరినో దోచుకొని బాడు పడినట్లుగా మాట్లాడుతున్నారేంటని నిలదీస్తారు. దీంతో కావ్య వాళ్లకు సర్ది చెబుతుంది.

కొత్త ఇంటి ప్లాన్ వేసిన కావ్య

మరోవైపు కావ్య కొత్త ఇల్లు డిజైన్ వేస్తూ ఉంటుంది. అది ఎందుకు అని రాజ్ అడిగితే.. రేపు పుట్టబోయే పిల్లలకు ఈ ఇల్లు సరిపోదని, మారుతున్న కాలంతో మనమూ మారాలని కావ్య అంటుంది. తాను ఇంటికి వచ్చినప్పుడు స్టోర్ రూమ్ ఇచ్చినట్లుగా పిల్లలకు ఇవ్వలేం కదా అని రాజ్ ను కావ్య దెప్పిపొడుస్తుంది. దీంతో రాజ్ ఫీలవుతాడు.

అటు రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. రాజ్, కావ్యలను బిజినెస్ లో కొట్టడం సాధ్యం కాదు కానీ.. ఇంటి నుంచే నరుక్కొద్దామని రాహుల్ తో చెబుతుంది. దీంతో అతడు దొంగ బంగారం దారి ఎంచుకుంటాడు. అందులో రాజ్ ను ఇరికించాలని ప్లాన్ చేస్తాడు. ఇటు పడుకున్న కావ్యకు దుగ్గిరాల ఇల్లు మంటల్లో కాలిపోతున్నట్లు పీడకల వస్తుంది. ఆమె ఉలిక్కిపడి లేస్తుంది. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks