బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 946వ ఎపిసోడ్ రక్తికట్టించింది. రాజ్, మంత్రి ధర్మేంద్ర మధ్య ఫైట్ పర్సనల్‌గా మారి ఇంట్లో వాళ్లను ప్రమాదంలో పడేసింది. ఇటు మంత్రి భార్య తులసికి నిజం చెప్పించడానికి ఆమెను కిడ్నాప్ చేస్తాడు రాజ్. దీంతో ఈ సీరియల్ లో కీలకమైన ట్విస్ట్ వచ్చింది.
మంత్రికి రాజ్ గట్టి వార్నింగ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ మంత్రి ఇంటికి వెళ్లి అతనికే రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలైంది. తన పాపను కాసేపు ఎత్తుకొని ఎమోషనల్ అవుతుంది కావ్య. ఆ తర్వాత తులసి వెళ్లిపోతుంది. అప్పుడే ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నీకు 15 రోజుల టైమ్ ఇచ్చింది.. ఆ లోపు నువ్వు తప్పు ఒప్పుకొని బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో నీకూ తెలుసు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
పాప బారసాలకు ఇంట్లో వాళ్ల ప్లాన్.. వద్దని వారించిన రాజ్
ఇటు దుగ్గిరాల ఇంట్లో పాప బారసాల కోసం ప్లాన్ చేస్తుంటారు. అప్పుడే రాజ్, కావ్య ఇంటికి తిరిగి వస్తారు. వాళ్లకు ఆ విషయం చెప్పడంతో పాప ఇప్పుడున్న పరిస్థితిలో అవసరం లేదని రాజ్ అంటాడు. పాపకు సర్జరీ చేసిన తర్వాత సెట్ అవుతుంది.. అప్పటికి అప్పుకి కూడా నెలలు నిండి బిడ్డను కంటుంది.. ఇద్దరికీ ఒకేసారి బారసాల చేద్దామని కావ్య అంటుంది. దీంతో అందరూ సరే అంటారు.
ధర్మేంద్రను రెచ్చగొట్టిన రుద్రాణి
మరోవైపు ధర్మేంద్రను రుద్రాణి రెచ్చగొడుతుంది. వాళ్లకు నా ముందు నిలబడే ధైర్యం లేదు.. అందుకే నా భార్య జోలికి వచ్చారు అని ధర్మేంద్ర ఆవేశంతో రగిలిపోతాడు. అతనికి కూడా ఫ్యామిలీ ఉంది.. నువ్వు కూడా అదే రూట్లో వెళ్లు అని మంత్రిని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. దీంతో రాజ్, కావ్య తన దగ్గరికి రావాలంటేనే భయపడేలా చేస్తానని ధర్మేంద్ర అంటాడు.
రాజ్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మంత్రి
{{/usCountry}}మరోవైపు ధర్మేంద్రను రుద్రాణి రెచ్చగొడుతుంది. వాళ్లకు నా ముందు నిలబడే ధైర్యం లేదు.. అందుకే నా భార్య జోలికి వచ్చారు అని ధర్మేంద్ర ఆవేశంతో రగిలిపోతాడు. అతనికి కూడా ఫ్యామిలీ ఉంది.. నువ్వు కూడా అదే రూట్లో వెళ్లు అని మంత్రిని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. దీంతో రాజ్, కావ్య తన దగ్గరికి రావాలంటేనే భయపడేలా చేస్తానని ధర్మేంద్ర అంటాడు.
రాజ్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మంత్రి
{{/usCountry}}ఇంట్లో కాఫీ తాగుతూ కూర్చున్న రాజ్‌కు మంత్రి ధర్మేంద్ర ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో వాళ్లు ఎక్కడున్నావో చూసుకోవా అని అంటాడు. ముందు మీ నాన్నమ్మ, తాతయ్య ఎక్కడున్నారో చూడు.. వాళ్లకు ఏదైనా జరిగితే ఎలా అని అడుగుతాడు. దీంతో వెంటనే రాజ్.. ఇందిర, సీతారామయ్యలకు ఫోన్ చేస్తాడు. వాళ్లతో మాట్లాడుతుండగానే ఏదో ప్రమాదం జరిగినట్లుగా రాజ్ కు అనిపిస్తుంది.
ఆ తర్వాత ధర్మేంద్ర మరోసారి ఫోన్ చేసి ఈసారి నీ తల్లిదండ్రులు ఎక్కడు, నీ తమ్ముడు ఎక్కడ అంటూ మళ్లీ భయపెడతాడు. సుభాష్ కు ఫోన్ చేసిన మాట్లాడుతుండగానే వాళ్లకూ ఏదో ప్రమాదం జరిగినట్లుగా అనిపిస్తుంది. కల్యాణ్, అప్పులకు మాత్రం ఫోన్ చేయలేకపోతాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కావ్య, ప్రకాశం టెన్షన్ పడుతుంటారు.
సేఫ్‌గా తిరిగి వచ్చిన ఇంట్లో వాళ్లు
అయితే చివరికి ఇంట్లో వాళ్లందరూ సేఫ్ గా తిరిగి వస్తారు. మొదట ఇందిరా దేవి, సీతారామయ్య.. తర్వాత సుభాష్, అపర్ణ.. చివరికి కల్యాణ్, అప్పు వస్తారు. ముగ్గురూ తమకు తృటిలో ప్రమాదం తప్పిందని చెబుతారు. దీంతో ఇది ప్రమాదం కాదు.. ఇంకేదో జరుగుతోందని ధాన్యలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడే మంత్రి ఎంట్రీ ఇస్తాడు.
నీ అనుమానం కరెక్టే అంటూ ధర్మేంద్ర వస్తాడు. తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఈ ఇంట్లో ఇవాళ ఆరు శవాలు లేచేవే అని వార్నింగ్ ఇస్తాడు. మీ రాజ్, కావ్యకు అసలు ఏం జరిగిందో తెలుసు అని, తన జోలికి రావద్దని అంటాడు. దీంతో రాజ్ ఆవేశంతో రగిలిపోతాడు.
దెబ్బకు దెబ్బ తీయాలనుకొని మంత్రి భార్య తులసిని కిడ్నాప్ చేస్తాడు. ధర్మేంద్రకు ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా.. నువ్వు దాచిపెట్టిన డాక్టర్ చక్రవర్తి దగ్గరికే ఆమెను తీసుకెళ్తున్నాను.. అసలు నిజం అతనితోనే చెప్పిస్తానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ధర్మేంద్రలో ఆందోళన మొదలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.