బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 947వ ఎపిసోడ్ లో మంత్రి ధర్మేంద్ర భార్యను కనిపించకుండా చేసి తమ ప్లాన్ సక్సెస్ చేస్తారు రాజ్, కావ్య. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన ధర్మేంద్రకు దిమ్మదిరిగే షాకిస్తారు. దీంతో చివరికి తన పాపను కావ్యకు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది.
దుగ్గిరాల ఇంట్లో వాళ్లను బెదిరించిన ధర్మేంద్ర

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ దుగ్గిరాల ఇంటికి మంత్రి ధర్మేంద్ర వచ్చి వారికి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. మీ ఇంట్లో ఆరు శవాలు లేచేవి.. అందరూ కొద్దిలో తప్పించుకున్నారు.. ఇలా ఎందుకు జరిగిందో మీ కొడుకు రాజ్, కోడలు కావ్యకు తెలుసు.. వాళ్లను అడగండి.. మరోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే మీ ఇంట్లో ఎవరూ మిగలరు అని ధర్మేంద్ర చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. రాజ్ అతని కాలర్ పట్టుకొని అడిగినా అతడు వెనక్కి తగ్గడు. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు.
రాజ్‌ను నిలదీసిన ధాన్యలక్ష్మి, స్వప్న.. కావ్య క్షమాపణ
అతడు వెళ్లిపోగానే ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. అసలు అతనికీ, మీకు ఉన్న శతృత్వం ఏంటి? అతడు చెప్పింది జరిగి ఉంటే కడుపుతో ఉన్న కా కోడలు, ఒక్కగానొక్క నా కొడుకుకు ఏం జరిగి ఉండేది అంటూ రాజ్ ను నిలదీస్తుంది.
అటు స్వప్న కూడా ఇలాగే వాళ్లను అడుగుతుంది. అసలు వాడేం చేశాడో తెలుసా అని రాజ్ నిజం చెప్పబోతాడు. దీంతో కావ్య జోక్యం చేసుకుంటుంది. కేవలం బిజినెస్ శతృత్వమే అని, ఇక నుంచీ మీ జోలికి రాకుండా చూసుకుంటామని, ఇవాళ జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నానని అంటుంది.
ధర్మేంద్ర, రుద్రాణి పార్టీ
ఇటు దుగ్గిరాల కుటుంబాన్ని భయపెట్టి వచ్చిన సంతోషంలో రుద్రాణితో కలిసి ధర్మేంద్ర పార్టీ చేసుకుంటాడు. నువ్వు ఇచ్చిన ప్లాన్ వల్లే ఇలా జరిగింది.. ఇక రాజ్, కావ్య నా జోలికి రానే రారు.. వాళ్ల కళ్లలో భయం చూశాను అని రుద్రాణితో అంటాడు ధర్మేంద్ర. ఆమెను ఆకాశానికెత్తుతాడు.
{{/usCountry}}ఇటు దుగ్గిరాల కుటుంబాన్ని భయపెట్టి వచ్చిన సంతోషంలో రుద్రాణితో కలిసి ధర్మేంద్ర పార్టీ చేసుకుంటాడు. నువ్వు ఇచ్చిన ప్లాన్ వల్లే ఇలా జరిగింది.. ఇక రాజ్, కావ్య నా జోలికి రానే రారు.. వాళ్ల కళ్లలో భయం చూశాను అని రుద్రాణితో అంటాడు ధర్మేంద్ర. ఆమెను ఆకాశానికెత్తుతాడు.
{{/usCountry}}నువ్వు రాజకీయాల్లో ఉంటే ఎక్కడికో వెళ్లేదానివని అంటాడు. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వడం లేదని అంటే.. టైమ్ వచ్చినప్పుడు అడుగుతానని అంటుంది. ఆ ఇంట్లో వాళ్ల పతనం, తన కొడుకు పట్టాభిషేకం ఒకేసారి జరుగుతాయని చెబుతుంది.
ఆవేశంతో రగిలిపోయిన రాజ్.. ఆలోచనతో కొట్టాలన్న కావ్య
ధర్మేంద్ర చేసిన పనికి రాజ్ ఆవేశంతో రగిలిపోతుంటాడు. దీంతో కావ్య అతనికి నచ్చజెపుతుంది. ఇప్పుడు తొందరపడితే నష్టపోయేది మనమే అని అంటుంది. చిన్న సాక్ష్యం కూడా వదల్లేదు కదా.. వాడు తప్పు చేశాడని ఎలా నిరూపించాలని రాజ్ అంటాడు. ఎంతటివాడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు.. ఈ విషయంలో డాక్టర్ చక్రవర్తి కనిపించకుండా పోయాడు.. అతన్ని దాచిపెట్టి ఓ సాక్ష్యాన్ని వదిలాడు కదా అని కావ్య అంటుంది. ముందు అతన్ని కనిపెడితే ధర్మేంద్రను ఇరికించవచ్చని చెప్పడంతో రాజ్ సరే అంటాడు. కావ్యకు కూడా ఓ ప్లాన్ చెబుతాడు.
ఇంట్లో కనిపించని తులసి.. ధర్మేంద్రకు రాజ్ ఫోన్
మరుసటి రోజు ఉదయం ధర్మేంద్ర ఇంట్లో తులసి కనిపించదు. అతడు కంగారుపడుతుంటాడు. దీంతో రాజ్ అతనికి ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా.. నువ్వు దాచి పెట్టిన డాక్టర్ చక్రవర్తి దగ్గరికి ఆమెను తీసుకెళ్తున్నాను.. మరికాసేపట్లో ఆమెకు అసలు నిజం తెలుస్తుంది అని బెదిరిస్తాడు. దీంతో మంత్రిలో మరింత ఆందోళన మొదలవుతుంది.
చక్రవర్తి దగ్గరికి మంత్రి.. ఫాలో అయిన రాజ్
వెంటనే డాక్టర్ చక్రవర్తిని దాచిన చోటికి మంత్రి బయలుదేరుతాడు. అతని ఇంటి బయటే వేచి చూస్తున్న రాజ్ కూడా అతన్ని ఫాలో అవుతాడు. తన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అటు హాస్పిటల్లో తులసితో ఉన్న కావ్య.. రాజ్ కు ఫోన్ చేస్తుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది.. వాడు డాక్టర్ చక్రవర్తిని దాచిన చోటికి వెళ్తున్నాడు.. నేను ఫాలో అవుతున్నాను.. తులసి నీతోనే ఉందా అని అడుగుతాడు. ఆమె తనతో ఉందని చెబుతుంది.
అటు తులసి తనను ఎందుకు హాస్పిటల్ కు రమ్మన్నారని కావ్యను అడుగుతుంది. పాలు సరిపోవడం లేదన్నారు కదా.. ఆయుర్వేదంలో మందు ఉంది.. అందుకే రమ్మన్నాను అని అంటుంది. నాకు ఇంత సాయం చేస్తున్నారు.. మీ పాప విషయంలో ఏమీ చేయలేకపోతున్నానని తులసి అంటుంది. టైమ్ వచ్చినప్పుడు అడుగుతాను.. అప్పుడు కాదనకుండా చేయండంటూ ఆమె చేతుల్లోని పాపను కావ్య ఎత్తుకుంటుంది.
ఇటు డాక్టర్ చక్రవర్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లి తులసికి అసలు నిజం చెప్పిస్తాడు రాజ్. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మేంద్ర వాళ్లను చూసి షాక్ తింటాడు. వాళ్లు చెప్పేదంతా అబద్ధం.. ఏదీ నమ్మకు అంటూ తన భార్యకు చెబుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.