బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్: మంత్రి దగ్గర ఉన్న పాపే తన పాప అని గుర్తు పట్టిన కావ్య.. బలవంతంగా లాక్కెళ్లిపోయిన ధర్మేంద్ర

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ లో మంత్రి దగ్గర ఉన్న పాపే తన పాప అని కావ్య గుర్తుపడుతుంది. అయితే ఆమె చేతుల్లో నుంచి పాపను బలవంతంగా తీసుకొని వెళ్లిపోతాడు మంత్రి ధర్మేంద్ర. దీంతో అతని వెంట పరుగెత్తుకుంటూ వెళ్తుంది.

Published on: Jan 27, 2026, 07:10:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 940వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. తన అసలు పాప కోసం కావ్య మరింత తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే గుడిలో కావ్యకు మంత్రి ధర్మేంద్ర అడ్డంగా దొరికిపోతాడు. దీంతో వెంటనే పూజను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పారిపోతాడు.

బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్: మంత్రి దగ్గర ఉన్న పాపే తన పాప అని గుర్తు పట్టిన కావ్య.. బలవంతంగా లాక్కెళ్లిపోయిన ధర్మేంద్ర
బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్: మంత్రి దగ్గర ఉన్న పాపే తన పాప అని గుర్తు పట్టిన కావ్య.. బలవంతంగా లాక్కెళ్లిపోయిన ధర్మేంద్ర

కావ్య మాటలకు కరిగిపోయిన డాక్టర్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ డాక్టర్ దగ్గరకు కావ్య వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమెను చూడగానే డాక్టర్ సీరియస్ అవుతుంది. కానీ కావ్య మాత్రం ఓ డాక్టర్ లా కాకుండా ఓ తల్లిలా ఆలోచించండి.. తన దగ్గర ఉన్న పాప తనను తాకినా ఆ మాతృత్వపు మాధుర్యం తనకు కలగడం లేదని కంటతడి పెడుతూ అంటుంది. కావ్య మాటలకు డాక్టర్ కరిగిపోతుంది. తానేం చేయాలని అడుగుతుంది. తనకు డెలివరీ అయిన రోజు ఇంకా ఎవరెవరికీ అయ్యాయో చెబితే తాను వెతుక్కుంటానని అంటుంది. డాక్టర్ సరే అంటుంది.

కావ్య ఎక్కడ అని స్వప్న, అప్పులను నిలదీసిన అపర్ణ

ఇటు ఇంట్లో పాప ఏడుస్తూనే ఉంటుంది. స్వప్న, అప్పు ఎంతగా ఓదార్చాలని చూసినా వినదు. పాప ఏడుపు విని మొదట అపర్ణ, తర్వాత ఇందిరా దేవి, రాజ్, రేఖ వస్తారు. ఇంతలా ఏడుస్తుంటే కావ్యకు ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు.. కావ్య ఎక్కడ అని అపర్ణ వాళ్లను నిలదీస్తుంది. అందరూ అదే ప్రశ్న వేస్తారు.

దీంతో కావ్య ఎక్కడికి వెళ్లిందో చెబుతారు. అపర్ణ కోపగించుకుంటుంది. కావ్య ఇక మారదా.. డీఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా ఎందుకు వినడం లేదు అని ప్రశ్నిస్తుంది. ఇదే అదును రేఖ వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. ఏడ్చి ఏడ్చి పాపకు ఏదైనా జరిగితే ఎలా.. 15 రోజులు కూడా నిండని పాపను ఇలా వదిలేసి వెళ్తే ఎలా అని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు టెన్షన్ పడతారు.

మంత్రి పాపకు శాంతి పూజ.. గుడికి రుద్రాణి

ఇటు గుడిలో శాంతి పూజ కోసం పాపను తీసుకొని మంత్రి ధర్మేంద్ర దంపతులు వస్తారు. పూజ మొదలవుతుంది. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది. మంత్రిని పిలిచి ఏం చేస్తున్నారని అడుగుతుంది. పాపకు శాంతి పూజ చేస్తున్నామని అంటే.. ఇంత సింపుల్ గా ఎందుకు.. గ్రాండ్ గా చేయొచ్చు కదా అని అంటుంది. పరిస్థితి తెలిసీ ఎలా చేయమంటావ్ అని అడుగుతాడు. కావ్య పాప మీ దగ్గరే ఉన్నదని ఎలా తెలుస్తుంది అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. తన భయాలు తనకు ఉన్నాయని మంత్రి అంటాడు. ఇంతలో తులసి పిలిస్తే ధర్మేంద్ర వెళ్లి పూజలో కూర్చొంటాడు.

గుడిలో తన పాపను చూసిన కావ్య

ఇటు హాస్పిటల్ నుంచి బయటకు ఏడుస్తూ వచ్చిన కావ్య ఓ దగ్గర కూర్చొంటుంది. పక్కనే గుడి గంటలు శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్తుంది. పక్కనే ఆ శాంతి పూజ జరుగుతూ ఉంటుంది. తనకు వచ్చిన కష్టంపై కావ్య దేవుడిని వేడుకుంటుంది. ఆ పాప తన కాదని, తన పాప దగ్గరికి దారి నువ్వే చూపించాలని ఏడుస్తుంది. ఇంతలో పూజ కొనసాగుతుండగానే పాప గట్టిగా ఏడుస్తుంటుంది. తులసి ఎంత ప్రయత్నించినా ఏడుపు మానదు.

కావ్య అక్కడికి వెళ్తుంది. పాపను ఎత్తుకుంటుంది. ఆ పాప వెంటనే ఏడుపు మానేస్తుంది. కావ్యకు కూడా తన పాపనే ఎత్తుకున్న అనుభూతి కలుగుతుంది. దీంతో షాక్ తిన్న మంత్రి ధర్మేంద్ర బలవంతంగా కావ్య చేతుల్లో నుంచి పాపను లాక్కొని వెళ్లిపోతాడు. కావ్య ఏడుస్తూ ఆ కారు వెనుక కాసేపు పరుగెత్తుతుంది. దూరంగా ఉండి చూస్తున్న రుద్రాణి.. ఇక నీ పాపను నీకు దక్కనీయను అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More