...
...
Next Story

బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్: రాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. గట్టి దెబ్బే కొట్టిన రుద్రాణి, రాహుల్.. కావ్యకు ప్రమాదం

బ్రహ్మముడి బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ లో రుద్రాణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది ఇందిరాదేవి. ఆ అవమానాన్ని మరచిపోని ఆమె.. కొడుకు, కూతురితో కొత్త కుట్రకు తెరలేపుతుంది. రాహుల్, రేఖ కలిసి దుగ్గిరాల కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు.

Published on: Jan 7, 2026, 06:57:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 924వ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. రుద్రాణి కుట్రను భరించలేని ఇంట్లో వాళ్లు ఆమెను నానా మాటలు అంటారు. చివరికి ఇందిరా దేవి ఆమెను మెడపట్టి బయటకు గెంటేస్తుంది. కానీ ఆ సమయానికి నాటకమాడి ఆ ఇంట్లోనే ఉండిపోతారు రాహుల్, రేఖ. వాళ్ల కుట్రకు రాజ్ బలవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రుద్రాణిని నిలదీసిన ఇంట్లో వాళ్లు

బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్: రాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. గట్టి దెబ్బే కొట్టిన రుద్రాణి, రాహుల్.. కావ్యకు ప్రమాదం
బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్: రాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. గట్టి దెబ్బే కొట్టిన రుద్రాణి, రాహుల్.. కావ్యకు ప్రమాదం

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ రుద్రాణి కుట్రను కనకం బయటపెట్టే సీన్ తో మొదలవుతుంది. ఆమె తీసుకొచ్చిన వీరయ్యను సుభాష్ నాలుగు పీకడంతో అతడు నిజం చెబుతాడు. రుద్రాణియే ఇదంతా చేసిందని అంటాడు. దీంతో నువ్వు మనిషివేనా అంటూ ఆమెపై మండిపడతాడు సుభాష్. అటు అపర్ణ, ఇందిర, కావ్య, రాజ్ కూడా రుద్రాణిని నానా మాటలు అంటారు. ఈ ఇంటి మనిషివి కాకపోయినా.. నా బావ అడిగినందుకు నిన్ను ఇంటి ఆడపడచులా చేసుకున్నామని, ఇంతటి దారుణానికి తెగిస్తావా అంటూ ఇందిరా దేవి ఆమెను తిడుతుంది.

తల్లిని అసహ్యించుకున్న రాహుల్, రేఖ

చివరికి రాహుల్, రేఖ కూడా కన్నతల్లిని అసహ్యించుకుంటారు. తనను పూర్తిగా చెడు ఆలోచనలతో పాడు చేసినా రాజ్, కావ్య తనను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే నువ్వు ఇలా చేస్తావా అంటూ తల్లిని నిలదీస్తాడు రాహుల్. అటు రేఖ కూడా నిన్ను అమ్మ అని పిలవాలంటే అసహ్యమేస్తోందని అంటుంది. దీంతో రుద్రాణి ఒంటరిదవుతుంది.

రుద్రాణిని మెడపట్టి గెంటేసిన ఇందిర

ఇంట్లో వాళ్లందరూ ఆమెను నిందిస్తుంటారు. రాజ్, కావ్య కూడా రుద్రాణిని ఎందుకిలా చేశావంటూ నిలదీస్తుండగా.. ఇందిరాదేవి ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అంటుంది. ఆమె వినకపోవడంతో మెడపట్టి బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో రాహుల్ అంటూ కొడుకు వైపు రుద్రాణి చూసినా.. తానేమీ చేయలేనని అతడు అంటాడు. దీంతో ఇందిర ఆమెను బయటకు గెంటేస్తుంది. మళ్లీ ఇటు వైపు వచ్చావంటే తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇస్తుంది.

రుద్రాణి చేసిన పనికి రాహుల్ ను కూడా నిందిస్తుంది ధాన్యలక్ష్మి. నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని నిలదీస్తుంది. దీంతో స్వప్న గొడవకు దిగుతుంది. రాహుల్ మారిపోయినా ఎందుకు అతన్ని నమ్మడం లేదు.. ఈ ఇంట్లో ఏం జరిగినా అతన్ని ఎందుకు నిలదీస్తున్నారు అని ధాన్యంతో గొడవపడుతుంది. తల్లి కనకం వద్దని వారిస్తున్నా వినదు. దీంతో ఇందిరా దేవి ఆమెకు సర్దిచెబుతుంది. అతని గతం అలాంటిది కావడంతో అతన్ని నమ్మడం లేదని అంటుంది. దీంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆ కుటుంబాన్ని వదిలిపెట్టమని రాహుల్, రేఖ ప్రతిజ్ఞ

ఇటు తల్లి దగ్గరికి వెళ్తారు రాహుల్, రేఖ. ఆ సమయంలో తాము అలా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతారు. మీరు చేసింది కరెక్టే అని, మీరు అక్కడే ఉండి ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేయాలని చెబుతుంది రుద్రాణి. ఇక నుంచి తాను అదే పనిలో ఉంటానని, ఉదయంలోగా రాజ్ ను అరెస్ట్ చేయిస్తానని రాహుల్ చెబుతాడు. ఆ కావ్య జీవితాన్ని నాశనం చేస్తానని రేఖ ప్రతిజ్ఞ చేస్తుంది.

మరుసటి రోజే రాజ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. దొంగ బంగారం నీకే అమ్మానని ఈ వ్యక్తి చెప్పాడని సాండీని తీసుకొస్తారు. ఇంట్లో సోదాలు చేయగా ఓ సూట్ కేసులో బంగారం బయటపడుతుంది. దీంతో పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అది చూసి కావ్య విలవిల్లాడిపోతుంది. తన కడుపులో బిడ్డను పట్టుకొని నొప్పితో సతమతమవుతూ కుప్పకూలుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe