...
...
Next Story

బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్: దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి.. ముస్తాబైన సుభాష్, అపర్ణ.. ఎండీగా ఆఫీసుకు రాహుల్

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ లో రాహుల్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అతడు ఎండీగా ఆఫీసుకు వెళ్తాడు. ఇటు దుగ్గిరాల ఇంట్లో సుభాష్, అపర్ణ పెళ్లి సందడి మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Nov 19, 2025, 07:03:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 882వ ఎపిసోడ్ లో రాహుల్ నటనకు పూర్తిగా అతని బుట్టలో పడిపోయిన రాజ్, కావ్య అతనికి తాత్కాలికంగా ఎండీ బాధ్యతలు అప్పగిస్తారు. అతడు ఆ హోదాలో ఆఫీసుకు వెళ్లగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు సందడి పెళ్లి చూపుల ఘట్టంతో మొదలవుతుంది.

రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు

బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్: దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి.. ముస్తాబైన సుభాష్, అపర్ణ.. ఎండీగా ఆఫీసుకు రాహుల్
బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్: దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి.. ముస్తాబైన సుభాష్, అపర్ణ.. ఎండీగా ఆఫీసుకు రాహుల్

బ్రహ్మముడి బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ రాహుల్ కు రాజ్, కావ్య కంపెనీ తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పగించే సీన్ తో మొదలవుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ తింటారు. తనకు వద్దంటూనే రాహుల్ ఆ ఆఫర్ అంగీకరిస్తాడు.

రాజ్ తీసుకున్న నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లు ఎవరూ వ్యతిరేకించరు. అయితే ఈ నమ్మకం కావ్యది అని, ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకూడదని రాహుల్ కు రాజ్ స్పష్టంగా చెబుతాడు. తాను రేయింబవళ్లు కష్టపడి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రాహుల్ అంటాడు.

రాజ్, కావ్యలను అవమానించాలన్న రుద్రాణి

ఆ ఆఫర్ లెటర్ పట్టుకొని రాహుల్ గదిలో మురిసిపోతుంటాడు. అతని దగ్గరికి వచ్చిన రుద్రాణి.. రాజ్ ఇంత త్వరగా నిన్ను ఇలా ఎండీని చేస్తాడని ఊహించలేదని అంటుంది. ఆ కావ్య పిచ్చిదని, తన అక్క స్వప్న కన్నీళ్లు పెట్టడం చూసి కరిగిపోయి తనకు ఈ ఆఫర్ ఇచ్చారని రాహుల్ అంటాడు.

రాజ్ ఆఫీసుకు రావడానికి కనీసం ఆరు నెలల పడుతుందని, ఈలోపు వాళ్లు నిన్ను గతంలో ఆఫీసు నుంచి ఎలా వెళ్లగొట్టి అవమానించారో నువ్వు కూడా వాళ్లను అలాగే అవమానించాలని రుద్రాణి అంటుంది. అప్పుడు ఈ ఇంట్లో వాళ్లందరినీ తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుంటానని చెబుతుంది. రాహుల్ సరే అంటాడు.

సుభాష్, అపర్ణ పెళ్లి రోజు ప్లాన్

ఇన్నాళ్లూ తన వల్ల ఇంట్లో వాళ్లు బాధపడ్డారని, వాళ్ల 30వ పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసి ఆ బాధను పోగొట్టాలని కావ్య అంటుంది. తాను ఈ విషయం మరచిపోయానని, మీ ఆడవాళ్లకే ఇలాంటివన్నీ ఎలా గుర్తుంటాయని రాజ్ ఆటపట్టిస్తాడు. ఇంట్లోనే గ్రాండ్ గా వాళ్ల పెళ్లి రోజు సెలబ్రేట్ చేద్దామని కావ్య అంటుంది.

ఎండీగా ఆఫీసుకు రాహుల్

అటు రాహుల్ ఎండీగా ఆఫీసుకు వెళ్తాడు. అతన్ని చూడగానే రాజ్ పీఏ.. వీడేంటి మళ్లీ వచ్చాడని అనుకుంటుంది. ఇంతలో మేనేజర్ వచ్చి రాహుల్ ను రాజ్ కొన్ని రోజులు ఎండీగా నియమించాడని చెబుతాడు. ఆఫీసుకు వెళ్లగానే రాహుల్ తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. బొకేలు, కార్పెట్లేమీ లేవా అని మేనేజర్ ను అడుగుతాడు. ఆ తర్వాత పీఏ దగ్గరికి వెళ్లి షాకయ్యావా అని అడుగుతాడు. అదేం లేదు సర్.. కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యానంతే అని అంటుంది. పెండింగ్ ఫైల్స్, తాను సంతకాలు చేయాల్సిన ఫైల్స్ అన్నీ తీసుకొని తన క్యాబిన్ కు రమ్మని చెప్పి రాహుల్ వెళ్తాడు.

సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు

దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. సుభాష్, అపర్ణ కోసం కొత్త బట్టలు తెప్పిస్తారు రాజ్, కావ్య. ఆ బట్టలు ఎవరికి అని అందరూ ఆశ్చర్యపోతుంటే తామే తెప్పించామని వాళ్లు వస్తారు. రేపు పండగ రోజు కదా అని అంటారు. పండగేంటని ఇంట్లో వాళ్లు అంటే.. రేపు అమ్మా, నాన్నల 30వ పెళ్లి రోజు అని రాజ్ చెబుతాడు. అది విని అందరూ సంతోషిస్తారు. ఆ తర్వాత అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి చూపులు ఎలా అయ్యాయి అని కావ్య వాళ్లను అడుగుతుంది.

ఆ రోజుల్లో అలాంటివేవీ లేవు.. మా నాన్న, వాళ్ల నాన్న మాట్లాడుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెబితే నేను సరే అన్నాను.. పెళ్లి పీటలపైనే మీ అత్తను చూశానని సుభాష్ అంటాడు. తానైతే కనీసం పెళ్లి పీటలపైనా సరిగా చూడలేదని అపర్ణ అంటుంది. అయితే ఈరోజు మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామంటూ కావ్య, రాజ్ వాళ్లిద్దరినీ రెడీ చేస్తామని తీసుకెళ్తారు.

కాలంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారు. సుభాష్, అపర్ణ పెళ్లి చూపుల ఘట్టం మొదలవుతుంది. పెళ్లి రోజుకు ఒక రోజు ముందే ఈ తంతు జరుగుతుంది. అపర్ణ సిగ్గు పడుతూ పాట పాడుతుంటే.. సుభాష్ కూడా సిగ్గుపడుతుంటాడు. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe