బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 863వ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్లే జరిగాయి. కావ్య ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా చాలా వింతగా ప్రవర్తించడం ఓవైపు, అప్పు, కల్యాణ్ రొమాన్స్ మరోవైపు.. రాహుల్, స్వప్న విడాకుల గోల ఇంకోవైపు.. ఇలా ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగిపోయింది.
కావ్య, రాజ్ సరదా పోట్లాట.. ఎగ్జిట్ ప్లాన్ అంటూ..

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ కావ్య, రాజ్ మధ్య జరిగే సరదా పోట్లాటతో మొదలవుతుంది. యోగా చేయడానికి సిద్ధమవుతున్న కావ్యను రాజ్ తిడతాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇది అవసరమా అని నిలదీస్తాడు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే అని కావ్య అంటుంది.
ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని రాజ్ అంటాడు. ఇద్దరి మధ్యా సరదాగా మాటా మాటా పెరుగుతుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఏమయింది.. ఈ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. కావ్య చనిపోయే విషయం అని చెప్పలేక ఏదో రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.
అప్పు, కల్యాణ్ రొమాంటిక్ మూడ్
అటు అప్పుతో కల్యాణ్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాడు. బాత్‌రూమ్ లో నుంచి వచ్చిన అప్పు ఓ వెరైటీ డ్రెస్సులో సెక్సీగా కనిపించడంతో కల్యాణ్ ఆపుకోలేకపోతాడు. ఆమెను వాటేసుకుంటాడు. నీకు డెలివరీ అయ్యేంత వరకు తాను ఏ కథలు రాయను, ఏ ప్రొడ్యూసర్ నూ కలవనని అప్పుతో చెబుతాడు.
కావ్య అక్క సమస్య కూడా ఇంత సులువుగా పరిష్కారం అవుతుందని తాను కూడా అనుకోలేదని, ఇప్పుడన్ని సమస్యలూ పోయినట్లే అని అప్పు కూడా చాలా ఆనంద పడుతుంది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి ముద్దు పెట్టుకోబోతుండగా.. ధాన్యలక్ష్మి అప్పుని పిలవడంతో ఆమె వెళ్లిపోతుంది.
ఆఫీసుకు వెళ్లే విషయంలో రాజ్ గొడవ
{{/usCountry}}కావ్య అక్క సమస్య కూడా ఇంత సులువుగా పరిష్కారం అవుతుందని తాను కూడా అనుకోలేదని, ఇప్పుడన్ని సమస్యలూ పోయినట్లే అని అప్పు కూడా చాలా ఆనంద పడుతుంది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి ముద్దు పెట్టుకోబోతుండగా.. ధాన్యలక్ష్మి అప్పుని పిలవడంతో ఆమె వెళ్లిపోతుంది.
ఆఫీసుకు వెళ్లే విషయంలో రాజ్ గొడవ
{{/usCountry}}అటు ఆఫీసు పనులు చూసుకోలేకపోతున్నానని సుభాష్ తో ప్రకాశ్ అంటాడు. ఇంతలో రాజ్ లోపలికి రావడంతో ఇక అన్ని సమస్యలు తీరినట్లే కదా.. బాబాయితో కావడం లేదు.. నువ్వు ఆఫీసుకు వెళ్లు అని రాజ్ తో చెబుతాడు సుభాష్. కానీ రాజ్ మాత్రం కావ్యకు డెలివరీ అయ్యే వరకూ తాను వెళ్లనని, ఆమెను చూసుకుంటానని అంటాడు.
అప్పుడే కావ్య కూడా వచ్చి తనను తాను చూసుకుంటాను కానీ మీరు ఆఫీసుకు వెళ్లండని చెబుతుంది. ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని రాజ్ అంటాడు. ఆ మాట విని అందరూ అర్థం కానట్లుగా ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. ఏదో రిటైర్మెంట్ ప్లాన్ అట అని ఇందిరా దేవి అంటుంది. తర్వాత రాజ్, కావ్య వెళ్లిపోతారు.
కావ్య, స్వప్నలకు దొరికిపోయిన రాహుల్
అటు రాహుల్ మరోసారి గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి నడిరోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య, స్వప్న అక్కడికి వస్తారు. రాహుల్ ని చూసి వెంటనే వెళ్లి నిలదీయమని స్వప్నకు చెబుతుంది. కానీ ఆమె ఇప్పుడు వద్దు.. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటానని అంటుంది.
అప్పుడు అంత జరిగినా రాహుల్ చెడు తిరుగుళ్లు ఇంకా మానలేదా అని కావ్య అంటుంది. వాడు మారతాడని అనుకోవడం మన బుద్ది తక్కువ, ఇంటికి రాని అప్పుడు చెబుతా.. ఇప్పుడు వెళ్లిపోదాం అని కావ్యను తీసుకొని వెళ్లిపోతుంది స్వప్న.
శోభనం పెళ్లికూతురిలా కావ్య
ఇటు ఇంట్లో కావ్య మరోసారి శోభనం పెళ్లి కూతురిలా రెడీ అవుతుంది. మంచి చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, పాల గ్లాసు చేతిలో పట్టుకోవడం చూసి అపర్ణ, ఇందిరాదేవి షాక్ తింటారు. ఏం చేస్తున్నావే అని అడుగుతారు. మీరనుకుంటున్నదే చేస్తున్నాం అని కావ్య గడుసుగా సమాధానమిస్తుంది. కడుపుతో ఉన్నావు కదా అని అడిగినా.. ఆయన ఆర్డర్ వేశారు.. రాత్రి ఇలా రెడీ అయ్యి రూమ్ లో ఉండాలని అన్నాడు అని కావ్య చెబుతుంది. పాల గ్లాసు తీసుకొని కావ్య రూమ్ లోకి వెళ్తుంది.
ఇటు రాజ్ లోనికి రాగానే అతనికి జాగ్రత్తలు చెప్పాలని అత్తకు చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. రాజ్ ను ఇందిర ఆపి కొన్నాళ్లు ఆగలేవా, అంత ఆత్రం ఎందుకు అని నిలదీస్తుంది. ఏం జరిగింది అని అడిగితే.. భోజనం విషయంలో జాగ్రత్త అంటూ పరోక్షంగా శోభనం గురించి చెబుతుంది. కానీ రాజ్ కు అది అర్థం కాదు. కావ్య కడుపుతో ఉంటే నేను ఆకలిగా ఎందుకు ఉంటానంటూ గదిలోకి వెళ్తాడు. అక్కడ కావ్యను చూసి షాక్ తింటాడు.
మరోవైపు రాహుల్ ను స్వప్న నిలదీస్తుంది. దీంతో నీతో కలిసి ఉండను.. నీకు విడాకులు ఇస్తున్నాను అని అతడు అనడంతో స్వప్న షాక్ తింటుంది. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.