బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పరాట కాల్చుకునే వ్యక్తి దుగ్గిరాల ఇంట్లోకి డైరెక్టర్ మణి వర్మగా ఎంట్రీ ఇస్తాడు. సినిమా కథలను జ్యూవెలరీ యాడ్ కాన్సెప్టులుగా చెబుతాడు. దాంతో అంతా కావ్యనే మంచి కాన్సెప్ట్ చెప్పమంటారు. తరతరాల నుంచి కుటుంబంలో బంధాలను పెంచుతున్న స్వరాజ్ జ్యూవెలరీ అనే కాన్సెప్ట్ చెబుతుంది కావ్య.
యావరేజ్‌గా ఉందంటూ

దానికి అంతా బాగుందని చప్పట్లు కొడతారు. డైరెక్టర్ మణి వర్మ మాత్రం యావరేజ్‌గా ఉందని, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీకు నచ్చిందే చేద్దామని అంటాడు. తర్వాత ఇంటిల్లిపాది నగలతో రెడీ అయి వస్తారు. గ్రీన్ మ్యాట్ దగ్గర అందరిని నిలబెట్టి షూటింగ్ చేస్తాడు ఫేక్ డైరెక్టర్.
డైరెక్టర్‌లా పెద్ద పోజులు కొడుతూ ఒక్కొక్కరి మొహాల్లో ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ హడావిడి చేస్తాడు. అందరిపై అరుస్తుంటాడు. ఏదోటి చెబుతూ టైమ్ వేస్ట్ చేయిస్తాడు డైరెక్టర్ మణి వర్మ. అదంతా చూసి వీడు ఇలాగే టైమ్ కానిస్తే రాజ్ గాడి యాడ్ ఎప్పటికీ పూర్తి కాదు. మరోసారి నేనే గెలుస్తా అని రుద్రాణితో రాహుల్ అంటాడు.
మరోవైపు కిచెన్‌లో పనిమనిషి పరాటాలు కాలుస్తుంటుంది. ఆ వాసన షూటింగ్ వరకు వస్తుంది. ఆ వాసనకు టెంప్ట్ అయిన మణి వర్మ కిచెన్‌లోకి పరుగెత్తుతాడు. డైరెక్టర్ కిచెన్‌లోకి వెళ్లడం చూసి ఏమైందని అనుకుంటారు. పని మనిషితో ఏం చేస్తున్నావ్ అని అడగుతాడు మణి వర్మ. పరాట చేస్తున్నాను సర్ అని పని మనిషి చెబుతుంది.
పరాటల గురించి గొప్పగా
దాంతో పని మనిషిపై అరుస్తాడు మణి వర్మ. పరాటను ఇలాగా చేసేది, అసలు పరాట అంటే ఏంటో తెలుసా. ఎంతమందికి అది కడుపు నింపుతుందో తెలుసా అంటూ గొప్పగా వర్ణిస్తాడు మణి వర్మ. డైరెక్టర్ ఏంటీ పరాట గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు అని డౌట్ పడతారు ఇందిరాదేవి వాళ్లు.
{{/usCountry}}దాంతో పని మనిషిపై అరుస్తాడు మణి వర్మ. పరాటను ఇలాగా చేసేది, అసలు పరాట అంటే ఏంటో తెలుసా. ఎంతమందికి అది కడుపు నింపుతుందో తెలుసా అంటూ గొప్పగా వర్ణిస్తాడు మణి వర్మ. డైరెక్టర్ ఏంటీ పరాట గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు అని డౌట్ పడతారు ఇందిరాదేవి వాళ్లు.
{{/usCountry}}అసలు పరాట ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను అని కాలుస్తుంటాడు డైరెక్టర్ మణి వర్మ. అది చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. రాహుల్ కూడా అవాక్కవుతాడు. వీడు కొంప ముంచేలా ఉన్నాడు. వీడెవడో అందరికి తెలిసేలా ఉందే అని రాహుల్ కంగారుపడతాడు. ఇంతలో రాజ్ వచ్చి మీ డైరెక్టర్ ఎక్కడ అని అసిస్టెంట్ డైరెక్టర్‌ను అడుగుతాడు.
అప్పటికే మణి వర్మ చేస్తుందంతా చూస్తున్న ప్రకాశం అక్కడ అని కిచెన్ వైపు చూపిస్తాడు. కిచెన్‌లో పిండి పిసుకుతూ ప్రొఫెషనల్‌గా పరాటాలు చేస్తుంటాడు మణి వర్మ. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. అతను పరాటాలు చేస్తుంటే పని మనిషి ఆశ్చర్యపోతుంది. అసలు అతను నిజంగా డైరెక్టరేనా అని కావ్య డౌట్‌గా అడిగితే.. పరాట మాస్టర్ అని ప్రకాశం చెబుతాడు.
డబ్బు కోసమే చేశానంటూ
దాంతో రాజ్ వెళ్లి మణి వర్మను నాలుగు బాది నిజం చెప్పమంటాడు. డబ్బుల కోసం ఇలా వచ్చానని చెబుతాడు. రాహుల్ తన గురించి చెప్పొద్దని సైగ చేస్తుంటాడు. రాహుల్ గురించి చెప్పకుండా బయటపడతాడు మణి వర్మ. రాజ్ పక్కకు వెళ్లి టైమ్ లేదని, యాడ్ షూట్ గురించి దిగాలుపడుతుంటాడు.
ఇంతలో కావ్య వచ్చి మన జ్యూవెలరీ యాడ్‌ను ఇంకెవరో డైరెక్ట్ చేయడం ఎందుకు. ఎలా తీయాలో మనకు తెలిసినప్పుడు మనమే చేద్దాం అని రాజ్‌కు సపోర్టింగ్‌గా మాట్లాడుతుంది కావ్య. నేను ఎలా చేస్తాను అని రాజ్ అంటే.. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్. మీకు సలహాలు ఇస్తాడు. మీ యాడ్‌ను మీరే డైరెక్టర్‌లా మారి షూట్ చేయండని కావ్య అంటుంది.
కావ్య ఇచ్చిన మోటివేషన్‌తో డైరెక్టర్‌గా మారిన రాజ్ యాడ్ షూట్ చేస్తాడు. కావ్య మోడల్‌గా రాజ్ డైరెక్టర్‌గా యాడ్ షూట్ పూర్తయిపోతుంది. అదంతా చూసిన రాహుల్ తన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయిందని, ఈసారి రాజ్ గెలిచాడని ఇరిటేట్ అవుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.