...
...
Next Story

బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్: రాజ్, కావ్యలకు కొత్త సమస్య.. నిగ్గు తేల్చే పనిలో రాజ్.. దుగ్గిరాల ఇంట్లో కొత్త పంచాయితీ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజ్, కావ్యలు కొత్త సవాలుకు సిద్ధమవడం ఇందులో చూడొచ్చు. అటు స్వప్న ముందే తెగించేసిన రాహుల్.. తాను కోయిలీనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తాడు.

Published on: Oct 29, 2025, 07:12:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 864వ ఎపిసోడ్ మొత్తం రాజ్, కావ్య.. రాహుల్, స్వప్న చుట్టే తిరిగింది. తమ భార్యలను రాజ్, కల్యాణ్ ప్రేమగా చూసుకోవడం చూసి స్వప్న బాధపడుతుంది. విడాకుల వరకూ రాహుల్ వెళ్లడంతో ఆ సమస్యను ఇంట్లో వాళ్ల ముందు పెట్టి న్యాయం కోరుతుంది.

రాజ్‌తో ఫస్ట్ నైట్ అంటూ ఆడుకున్న కావ్య

బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్: రాజ్, కావ్యలకు కొత్త సమస్య.. నిగ్గు తేల్చే పనిలో రాజ్.. దుగ్గిరాల ఇంట్లో కొత్త పంచాయితీ
బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్: రాజ్, కావ్యలకు కొత్త సమస్య.. నిగ్గు తేల్చే పనిలో రాజ్.. దుగ్గిరాల ఇంట్లో కొత్త పంచాయితీ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఫస్ట్ నైట్ అంటూ రాజ్ తో కావ్య ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. పాల గ్లాసు, పట్టు చీరలో కావ్యను చూసి రాజ్ షాక్ తింటాడు. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారు అని రాజ్ అంటాడు.

ఫస్ట్ నైట్ కు ముహూర్తం కావాలి కానీ ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ అయిపోవచ్చు.. కడుపుతో ఉంటే కాపురం చేయొద్దన్నారా.. నేను ఉన్నన్నాళ్లూ మీతో ఇలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని కావ్య అంటుంది. ఆ మాటలు విని రాజ్ లబోదిబోమంటాడు. మధ్యలో కాసేపు ఇద్దరూ భావోద్వేగానికి గురైనా కావ్య మళ్లీ ఆ మూడ్ లోకి వచ్చేస్తుంది. రాజ్ ను మంచంపైకి తోసేసి పైకి దూకుతుంది.

రాహుల్‌కు లవర్ ఫోన్.. స్వప్న ముందే తెగించేసి..

అటు రాహుల్ కు అతని లవర్ కోయిలీ ఫోన్ చేస్తుంది. ఇద్దరూ ఫోన్లోనే సరసాలాడతారు. విడాకుల సంగతేమైంది.. నీ ఆస్తి నీ చేతికి వచ్చేస్తే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఆమె అంటుంది. అదే పనిలో ఉన్నాను డియర్, బేబీ అంటూ రాహుల్ మాట్లాడుతుండగా స్వప్న వస్తుంది.

మరోవైపు కావ్య కోసం రాజ్ ప్యాంటు, షర్ట్ తీసుకొస్తాడు. చీరలో యోగా చేస్తే బాగుండదు.. ఇది వేసుకో అని చెప్పగానే కావ్య షాక్ తింటుంది. మొదట వద్దని వారించినా.. రాజ్ బలవంతంగా ఆమెకు ఆ డ్రెస్సు ఇచ్చి వేసుకోమంటాడు. వాటిని వేసుకొని ఆమె సిగ్గుపడుతూ హాల్లోకి వస్తుంది. ఆమెను చూడగానే అపర్ణ, ఇందిర ఆట పట్టిస్తారు.

ఈ డ్రెస్సే బాగుందని, ఇలాగే కంటిన్యూ చేయమని అపర్ణ అనడంతో ఇంకేం మా అమ్మ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. ఇలాగే ఉండమని రాజ్ అంటాడు. ఆ తర్వాత అప్పు, కావ్య కలిసి యోగా చేయడానికి వెళ్తారు. వాళ్లకు రాజ్, కల్యాణ్ జ్యూస్ తీసుకొని వెళ్లి బలవంతంగా తాగిస్తారు. వాళ్లు అన్యోన్యంగా ఉండటం చూసి స్వప్న బాధపడుతుంది.

రాహుల్ గురించి కావ్యకు చెప్పిన స్వప్న

స్వప్న బాధపడుతూ బయట నిలబడుతుంది. అది చూసి కావ్య ఆమె దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. రాహుల్ తెగించేశాడని, ఇంతుకుముందు తాను బెదిరిస్తే దారికి వచ్చేవాడని, కానీ ఇప్పుడు నువ్వు అవసరం లేదు.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతున్నాడని చెప్పి స్వప్న బాధపడుతుంది.

తాను గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఆ దేవుడు తనకు శిక్ష వేస్తున్నాడని స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతో రాహుల్ తో తాను మాట్లాడతానని కావ్య అంటుంది. ఇప్పుడిప్పుడే నువ్వు కోలుకుంటున్నావు.. దీని గురించి నువ్వు ఆలోచించకు.. నేను రాహుల్ తో మరోసారి మాట్లాడతానని స్వప్న వెళ్లిపోతుంది.

రాహుల్, స్వప్న గురించి రాజ్‌కు చెప్పిన కావ్య

ఆ తర్వాత గదిలోకి కావ్య కోసం రాజ్ టిఫిన్ తీసుకొస్తాడు. కావ్య బాధగా ఉండటం చూసి ఏమైందని అడిగితే.. రాహుల్, స్వప్న గురించి ఆమె చెబుతుంది. అతడు మారలేదని, ఎవరితోనో తిరుగుతున్నాడని అంటుంది.

అటు స్వప్నకు విడాకుల కాగితాలు ఇచ్చి సంతకాలు పెట్టమని రాహుల్ బలవంతం చేస్తాడు. దీంతో ఆమె ఆ కాగితాలను ఇంట్లో వాళ్లందరి ముందూ పెట్టి న్యాయం చేయమని అడుగుతుంది. దీంతో వాళ్లందరూ షాక్ తింటారు. అటు పెళ్లయి, ఓ పాప ఉన్న రాహుల్ ను బుట్టలో వేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు తీయాలని రాజ్, కావ్య ప్లాన్ చేస్తారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks