...
...
Next Story

Celina Jaitly: కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ సెలీనా జైట్లీ.. గుండెను పిండేసే వీడియో వైరల్

Celina Jaitly: కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న హీరోయిన్ సెలీనా జైట్లీ ఎమోషనల్ వీడియో గుండెను పిండేస్తోంది. భర్త పీటర్ హాగ్ నుంచి విడాకులు తీసుకుంటున్న నటి సెలీనా జైట్లీ తన గోడును ఇలా వెళ్లబోసుకుంది.

Published on: May 7, 2026, 12:48:10 IST
Advertisement

Celina Jaitly: బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కుంటోంది. భర్త నుంచి విడాకులు కోరిన ఆమెకు కనీసం పిల్లలు ముఖాలు కూడా చూపించడం లేదు. చేసేదేం లేక చనిపోయిన తన కొడుకు సమాధి దగ్గరకు వెళ్లి సెలీనా వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును కదలిస్తోంది. ఇటీవల ఆస్ట్రియాకు వెళ్లిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ

కొడుకు సమాధిని శుభ్రం చేస్తున్న సెలీనా (instagram)
కొడుకు సమాధిని శుభ్రం చేస్తున్న సెలీనా (instagram)

ఆస్ట్రియాలో తన పిల్లలను చూడనివ్వలేదని హీరోయిన్ సెలీనా జైట్లీ వాపోయింది. జడ్జీ ముందు మాట ఇచ్చి తప్పారని ఆరోపించింది. పిల్లలను తనకు చూపించకుండా దాచేశారని ఆమె బాధ పడింది. చనిపోయిన తన కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది.

తల్లిగా వేదన

"ఒక తల్లిగా నా వేదనను ప్రపంచానికి చూపించడానికి ఈ వీడియోను షేర్ చేయడం తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు. గత కొన్ని వారాలు నా జీవితంలో అత్యంత కష్టతరమైనవి. ఆస్ట్రియన్ జడ్జి ఆదేశాలు ఉన్నప్పటికీ, నా పిల్లలను ఇళ్లకు తీసుకురాలేదు. అక్కడ నేను కలవగలిగిన ఏకైక బిడ్డ నా కుమారుడు శంషేర్ మాత్రమే.. అతను కూడా ఇప్పుడు సమాధిలోనే ఉన్నాడు" అని సెలీనా అత్యంత బాధతో పేర్కొంది.

ఆస్తుల కోసమే ఈ వేధింపులు

తమ మధ్య సయోధ్యతో కూడిన విడాకులు (Amicable Separation) జరగాలని తాను కోరుకుంటున్నప్పటికీ, తన భర్త పీటర్ హాగ్ మాత్రం తన పూర్వీకుల ఆస్తుల కోసం అసంబద్ధమైన డిమాండ్లు చేస్తున్నారని సెలీనా ఆరోపించింది. పెళ్లికి ముందు తనకున్న ఆస్తులను లాక్కోవడమే లక్ష్యంగా తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె వివరించింది.

భర్త కోసం తిరిగా

ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో కమ్యూనికేషన్ కూడా లేకుండా చేశారని సెలీనా ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలకు తన గురించి తప్పుడు విషయాలు చెబుతూ, వారిని భయపెట్టి తనపైకి ఉసిగొల్పుతున్నారని ఆమె ఆరోపించింది. సెప్టెంబర్ నెలలో తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇస్తానని చెప్పి లోకల్ పోస్ట్ ఆఫీస్ కు తీసుకువెళ్లి, అక్కడ విడాకుల నోటీసు చేతిలో పెట్టారని ఆమె వెల్లడించింది.

కవలలు

2011లో ఆస్ట్రియన్ హోటల్ వ్యాపారి పీటర్ హాగ్ ను సెలీనా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2012లో విన్స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. 2017లో ఆర్థర్, శంషేర్ అనే మరో కవలలు పుట్టారు. గుండె సంబంధిత సమస్యతో శంషేర్ మరణించాడు. గత ఏడాది ముంబైలోని అంధేరి కోర్టులో పీటర్ హాగ్ పై గృహ హింస, క్రూరత్వం, వేధింపుల కింద సెలీనా కేసు ఫైల్ చేసింది. తన ఆదాయం, ఆస్తి నష్టానికి ప్రతిగా రూ. 50 కోట్ల పరిహారం చెల్లించాలని ఆమె కోర్టును కోరింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: సెలీనా జైట్లీ తన భర్తపై ఏ విధమైన ఆరోపణలు చేసింది?

జవాబు: తన భర్త పీటర్ హాగ్ తన పూర్వీకుల ఆస్తుల కోసం వేధిస్తున్నారని, పిల్లలను తనకు దూరం చేసి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని సెలీనా ఆరోపించింది.

ప్రశ్న: సెలీనా జైట్లీ భర్త ఎవరు?

జవాబు: సెలీనా జైట్లీ భర్త పీటర్ హాగ్. ఆయన ఒక ఆస్ట్రియన్ హోటల్ వ్యాపారి.

ప్రశ్న: సెలీనా జైట్లీ కోర్టులో ఎంత పరిహారం కోరింది?

జవాబు: గృహ హింస, ఆస్తి నష్టం కింద సెలీనా తన భర్త నుంచి రూ. 50 కోట్ల పరిహారం కోరుతూ ముంబై కోర్టులో కేసు వేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks