ETV Win Chaarulatha OTT Release: కథాసుధ సిరీస్‌లో 'చారులత'.. ఓటీటీలో ఈ వీకెండ్ ఎమోషనల్ డ్రామా ఎందుకు మిస్ అవ్వకూడదంటే?
OTT Today: సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వచ్చేసింది. మంచి ట్విస్ట్ లతో కూడిన చిన్న సినిమా ‘చారులత’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మరి ఈ ఎమోషనల్ డ్రామాను ఎందుకు మిస్ అవ్వకూడదో ఇక్కడ చూసేయండి.
ETV Win Chaarulatha OTT Release: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారీ బడ్జెట్ యాక్షన్ సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్ల వెనుక పడుతుంటే.. ఈటీవీ విన్ (ETV Win) మాత్రం ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఒక సరికొత్త హృద్యమైన కథతో వీక్షకులను పలకరించే 'కథాసుధ' (KathaSudha - Sunday Stories) సిరీస్‌కు తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

చారులత ఓటీటీ
ప్రతి సండేలాగే ఈ ఆదివారం (జూన్ 7, 2026) కూడా ఈటీవీ విన్ కథాసుధాలో భాగంగా 'చారులత' అనే హార్ట్-టచింగ్ ఫ్యామిలీ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ స్టార్స్ రవిప్రకాష్, సుజిత, అనిరుధ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఒక మెచ్యూర్డ్ రిలేషన్‌షిప్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.
చారులత స్టోరీ
చారులత కథలోని ఇద్దరు ప్రధాన పాత్రలు షర్మిల, మిలింద్ తీవ్రమైన మానసిక వేదనలో ఉంటారు. షర్మిల స్వతంత్ర ఆలోచనలు గల మహిళ. మొదటి భర్తతో విడాకులు తీసుకుని, తన కూతురి కస్టడీని కూడా కోల్పోయి ఒంటరిగా నరకం అనుభవిస్తూ ఉంటుంది. మరోవైపు మిలింద్ తన ప్రాణమైన భార్యను కోల్పోయి, జీవితంలో శూన్యాన్ని ఎదుర్కొంటుంటాడు.
రెండో పెళ్లి
ఇలాంటి పరిస్థితుల్లో సమాజం కోసం కాకుండా, కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటానికి మిలింద్, షర్మిల రెండో వివాహ బంధంలోకి అడుగుపెడతారు. అయితే, ఈ పెళ్లి ఏవో రొమాంటిక్ ఆశలతో జరిగింది కాదు. కొన్ని కఠినమైన షరతులతో కూడిన ఒప్పందం.
ఒకే ఇంట్లో ఉంటూనే అపరిచిత వ్యక్తుల్లా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో.. మిలింద్ ప్రవర్తించే తీరు షర్మిలలో మార్పు తీసుకువస్తుంది. మిలింద్ లోని ఆత్మీయత షర్మిల మనసులోని కఠినత్వాన్ని కరిగిస్తుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక ఇష్టం మొదలవుతుంది.
క్లైమాక్స్ ట్విస్ట్!
కథ అంతా బాగుంది అనుకునే సమయంలో, ఈ సున్నితమైన బంధంలో ఒక పెద్ద కుదుపు వస్తుంది. మిలింద్ వేరే ఒక మహిళతో రహస్యంగా, సన్నిహితంగా ఉండటం చూసిన షర్మిల, దానిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. తనను మోసం చేశాడనే కోపంతో, ఎలాంటి ఆలోచన లేకుండా తక్షణమే విడాకుల కోసం దరఖాస్తు చేస్తుంది.
కానీ దీని వెనుక ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటీ? మిలింద్ కు షర్మిల దగ్గరైందా? అన్నదే చారులత మిగతా స్టోరీ.
FAQ: People Also Ask
1. చారులత సినిమా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా?
జవాబు: అవును, 'చారులత' పూర్తిగా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎలాంటి అశ్లీలత లేదా వల్గారిటీ లేని సినిమా కాబట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా చూడవచ్చు.
2. ETV Win లో చారులత ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది?
జవాబు: 'చారులత' చిత్రం కథాసుధ సిరీస్‌లో భాగంగా జూన్ 7, 2026 (ఆదివారం) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
3. చారులత హిట్ ఆ లేక ఫ్లాపా?
జవాబు: ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ (Direct-to-OTT) కాబట్టి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో సంబంధం లేదు. అయితే, కథాసుధ సిరీస్ లో వచ్చిన గత చిత్రాల ట్రాక్ రికార్డ్, సోషల్ మీడియా పబ్లిక్ టాక్ ప్రకారం, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


