Charitha Kamakshi Ott: 2022లో రిలీజ్ కావాల్సిన మూవీ.. ఇవాళ నేరుగా ఓటీటీలోకి.. భార్యాభర్తల రొమాంటిక్ లవ్.. సూపర్ ట్విస్ట్
Charitha Kamakshi Ott: నాలుగేళ్ల క్రితమే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ తెలుగు సినిమా ఇవాళ డైరెక్టర్ గా ఓటీటీలోకి వచ్చింది. డైరెక్టర్ కావాలనుకునే ఓ అబ్బాయి ఏం చేశాడు? భార్యాభర్తల మధ్య రొమాంటిక్ లవ్ ఎలా సాగింది? అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.
కొన్ని సినిమాలు వివిధ కారాణాలతో థియేటర్లలో రిలీజ్ కాకుండా ఆగిపోతాయి. ఓటీటీల పుణ్యమా అని అలాంటి మూవీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన సినిమానే ‘చరిత కామాక్షి’. ఇవాళ (మార్చి 5) ఈ చిత్రం నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

చరిత కామాక్షి ఓటీటీ
అభయ్ నవీన్, దివ్య శ్రీపాద జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ లవ్ సినిమా ‘చరిత కామాక్షి’. ఈ మూవీ ప్రధానంగా భార్యాభర్తల ప్రేమ చుట్టూ సాగుతోంది. ఈ చరిత కామాక్షి మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో చరిత కామాక్షి స్ట్రీమింగ్ అవుతోంది.
నాలుగేళ్ల తర్వాత
నిజానికి చరిత కామాక్షి సినిమా 2022లో థియేటర్లో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది. అప్పుడు ఏమైంది అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలోకి చరిత కామాక్షి వచ్చేసింది. ఈ మూవీ రన్ టైమ్ గంటన్నర మాత్రమే.
ఈ మూవీలో అభయ్ నవీన్, దివ్య శ్రీపాదతో పాటు పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సునీత మనోహర్, సతీష్ సరిపల్లి, రాజశేఖర్, అంజి మామ తదితరులు నటించారు. చరిత కామాక్షి సినిమాకు చందు సాయి డైరెక్టర్. రజిని రెడ్డి ఈ మూవీకి ప్రొడ్యూసర్.
చరిత కామాక్షి స్టోరీ
చక్రి (అభయ్ నవీన్), చరిత కామాక్షి (దివ్య శ్రీపాద)కు కొత్తగా పెళ్లి అవుతుంది. అయితే వీళ్లిద్దరి మనసులు ఒక్కటైనా శారీరకంగా కలిసేందుకు కాస్త టైమ్ తీసుకుంటారు. కొత్తగా పెళ్లయిన ఈ జంట ముచ్చట్లు, మురిపాలు, రొమాన్స్ తో మొదట కథ సాగుతోంది.
డైరెక్టర్ కావాలని
చక్రికి సినిమా డైరెక్టర్ కావాలన్నది లక్ష్యం. అందుకోసం ఒక ప్రొడ్యూసర్ తో గడపాలని తన సినిమాలో హీరోయిన్ గా చేసే ఓ తెలుగు అమ్మాయిని చక్రి అడుగుతాడు. ఎప్పుడూ సినిమా అంటూ బయటే ఉంటాడు. దీంతో తల్లిదండ్రులను పట్టించుకోడు. ఓ రోజు చక్రి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతుంది.
ఆ ట్విస్ట్
చక్రి ఓ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అతను బయటకు రావాలంటే చరిత కామాక్షి తనతో ఒక రాత్రి టైమ్ గడపాలని పోలీస్ ఇన్ స్పెక్టర్ (పృథ్వీరాజ్) అడుగుతాడు. మరి ఆ తర్వత ఏం జరిగింది? చక్రి సినిమా కల నెరవేరిందా? పోలీస్ ఇన్ స్పెక్టర్ అతణ్ని వదిలిపెట్టాడా? అన్నది చరిత కామాక్షి సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


