Chennai Love Story OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ ఐదు భాషల్లో..

Chennai Love Story OTT Release Date: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను సోనీ లివ్ ఓటీటీ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది.

Published on: Aug 14, 2026, 21:53:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai Love Story OTT Release Date: బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. జులై 24న థియేటర్లలో రిలీజైన ఈ కిరణ్ అబ్బవరం రొమాంటిక్ డ్రామా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను ఆగస్ట్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Chennai Love Story OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ ఐదు భాషల్లో..
Chennai Love Story OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ ఐదు భాషల్లో..

ఐదు భాషల్లో స్టీవెన్ శంకర్, నివీ లవ్ స్టోరీ

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ మూవీని ఐదు భాషల్లో సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. “థియేటర్లలో మీకు స్టీవెన్ శంకర్, నివి బాగా నచ్చేశారు. ఇప్పుడు వాళ్లు ఎంతో ప్రేమతో మీ ఇళ్లకే వచ్చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఆగస్ట్ 21 నుంచి కేవలం సోనీ లివ్ ఓటీటీలో” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్

భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైన ఈ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల వరకూ వసూలు చేసింది. స్టీవెన్ శంకర్, నివిల లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. కిరణ్ అబ్బవరం రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా ఇది.

చెన్నై లవ్ స్టోరీ అసలు కథేంటంటే?

రవి నంబూరి డైరెక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీని ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. కలర్ ఫొటో, బేబీలాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాతల నుంచి వచ్చిన మూవీ ఇది. ఓ అనాథ అయిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) చుట్టూ తిరిగే కథ ఇది. అతడు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు.

అలాంటి వ్యక్తికి ప్రేమలో విఫలమై లేడీ దేవదాసులా మారిపోయిన నివేదిత (శ్రీ గౌరీప్రియ) పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకునే లోపే మరో ఊహించని ట్విస్ట్ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటీ? వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరిందనేది మిగతా కథ.

చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

లవ్ లో ఫెయిల్ అయి మందుకు బానిసలయ్యే అబ్బాయిలను ఎంతోమందిని చూసి ఉంటారు. కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమాలో మాత్రం రివర్స్ జరుగుతుంది. ఇక్కడ అమ్మాయి దేవదాసులా మారుతుంది. అలాంటి అమ్మాయితో పరిచయం, ఆ అమ్మాయిని బాధ తొలగించేందుకు హీరో చేసే ప్రయత్నాలు, తన కల కోసం పడే పాట్లతో ఫస్టాఫ్ సాగిపోతుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే షాక్ కలిగిస్తుంది. ఇలా ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా, ఫన్నీగా, కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. దీంతో సెకండాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత మూవీ ఆ గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ ను కొనసాగించలేకపోయింది. ఆత్మలు అనే ఫాంటసీ పాయింట్ తేవడంతో కథ అంత కన్విన్సింగ్ గా అనిపించదు.

ఇక నివి కోసం అజయ్ తిరిగి రావడంతో స్టోరీ మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కానీ ఎమోషనల్ గా సాగిన క్లైమాక్స్ ఊహించేలా ఉండటం మైనస్ పాయింట్. దీనిని కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ తమ నటనతో కొంత వరకూ కవర్ చేయగలిగారనే చెప్పాలి. మొత్తానికి థియేటర్లలో మెప్పించిన ఈ ప్రేమ జంట.. ఇప్పుడు ఓటీటీలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More