...
...
Next Story

Chinmayi Sripaada: ర‌జినీకాంత్‌నూ వ‌ద‌ల‌ని చిన్మయి- వైర‌ముత్తు జ్ఞానపీఠ్ అవార్డుపై త‌లైవా పోస్టు- మండిప‌డ్డ సింగ‌ర్‌

Chinmayi Sripaada: సింగర్ చిన్మయి శ్రీపాద ఫుల్ ఫైర్ మీద ఉంది. తనను లైంగికంగా హింసించాడని తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. వైరముత్తును అభినందిస్తున్న సెలబ్రిటీలపై చిన్మయి మండిపడుతోంది. రజినీకాంత్ నూ ఆమె వదల్లేదు.

Published on: Mar 15, 2026, 10:03:51 IST
Advertisement

కవి, రచయిత వైరముత్తు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న మూడవ తమిళ రచయితగా ఆయన నిలిచారు. అయితే మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఫైర్ అవుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది.

చిన్మయి శ్రీపాద ఫైర్

రజినీకాంత్ పై చిన్మయి ఫైర్
రజినీకాంత్ పై చిన్మయి ఫైర్

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావటం పట్ల కోలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళ దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్ తదితరులు వైరముత్తుకు అభినందనలు తెలిపారు. ఈ సెలబ్రిటీలందరిపై చిన్మయి శ్రీపాద ఫైర్ అవుతోంది. తాజాగా రజినీకాంత్ నూ వదలకుండా కౌంటర్ వేసింది.

రజినీకాంత్ పోస్ట్

వైరముత్తుకు రజినీకాంత్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తమిళంలో ఇలా రాసుకొచ్చారు. “మా భారత జాతి గొప్ప జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, నా ప్రియమైన స్నేహితుడు, గౌరవనీయులైన కవి వైరముత్తుకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని రజినీకాంత్ పేర్కొన్నారు. దీన్ని రీషేర్ చేస్తూ.. “అయ్యయ్యో!!! పురియవే పురియాధ (ఏం పజిల్)?!” అని చిన్మయి ప్రశ్నించింది.

ఆశాపూర్ణ దేవి పేరుతో

“భారతదేశంలో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొదటి మహిళా రచయిత ఆశాపూర్ణ దేవి. ఎక్స్ లో చిన్మయి పోస్ట్ చదివినప్పుడు ఆమె జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. జ్ఞానపీఠ్ అందుకునేటప్పుడు ఆశాపూర్ణ దేవి ప్రశ్నలు లేవనెత్తారు.

‘పురుషుల చేసే ఇన్ని అన్యాయమైన చర్యలను సమాజం ఎందుకు సహిస్తుంది? జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళల హక్కులను ఎందుకు నిరాకరిస్తున్నారు? వారు ఎందుకు ఇరుకు గదుల్లో చీకటిలో ఊపిరాడకుండా జీవించాలి?’ అని ఆమె ప్రశ్నించారు. అర్ధ శతాబ్దం తర్వాత చిన్మయి శ్రీపాద కూడా ఇదే అడుగుతున్నారు’’ అని ఆ పోస్టులో ఉంది.

మూడో తమిళ రైటర్

సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మూడో తమిళ రచయిత వైరముత్తు. అంతకుముందు అకిలన్ (1975), జయకాంతన్ (2002) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks