తమిళ రచయిత వైరముత్తు కు జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. శనివారం (మార్చి 14) అతణ్ని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ కమిటీ పేరు ప్రకటించింది. అయితే దీనిపై ఓ వైపు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి పురస్కారం ఎలా ఇస్తారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయింది. అభినందించిన కమల్ హాసన్ పైనా ఆమె మండిపడింది.
చిన్మయి ఫైర్

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావడంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయింది. ఎక్స్ లో తన కోపాన్ని వెళ్లగక్కింది. "2018లో వివిధ వయసు మహిళలు ఒక కవి, రచయిత (వైరముత్తు) తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో తన తండ్రి పేరుతో వైరముత్తును ప్రశంసిస్తూ వెలువడ్డ లేఖ నకిలీదని జయకాంతన్ కూతురు కూడా చెప్పింది. ఈ రోజు అలాంటి వ్యక్తికి జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది’’ అని చిన్మయి పోస్టు చేసింది.
ఆ అవార్డు రిటర్న్
‘‘గతంలో కేరళకు చెందిన ఓ కమిటీ అతని (వైరముత్తు)కి ఓఎన్వీ కురుప్ అవార్డు ప్రకటించింది. కానీ వాళ్ల సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా అవార్డును రిటర్న్ తీసుకున్నారు. ఓఎన్వీ కురుప్ పేరును చెడగొడతారా? అని అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి’’ అని చిన్మయి ఎక్స్ లో పేర్కొంది.
కమల్ హాసన్ పోస్టు
జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన వైరముత్తును అభినందిస్తూ కమల్ హాసన్ పోస్టు పెట్టాడు. దీనిపై చిన్మయిన శ్రీపాద మండిపడింది.
"దేవుడా.. సినిమా రంగంలో అధికారంలో ఉన్న పురుషులు రాజకీయాల్లోకి మారిన తర్వాత వినడం మానేశారు. తన అంకుల్, మెంటర్ అయిన వ్యక్తి లైంగికంగా వేధించాడని చెప్తున్నా చెవిటివాళ్లలా పట్టించుకోవం లేదు. ఇలాంటి మగాళ్లు మనసైడ్ ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’’ అని కమల్ హాసన్ ను ఉద్దేశించి చిన్మయి పోస్టు పెట్టింది.
వాళ్ల కోసమే
{{/usCountry}}"దేవుడా.. సినిమా రంగంలో అధికారంలో ఉన్న పురుషులు రాజకీయాల్లోకి మారిన తర్వాత వినడం మానేశారు. తన అంకుల్, మెంటర్ అయిన వ్యక్తి లైంగికంగా వేధించాడని చెప్తున్నా చెవిటివాళ్లలా పట్టించుకోవం లేదు. ఇలాంటి మగాళ్లు మనసైడ్ ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి’’ అని కమల్ హాసన్ ను ఉద్దేశించి చిన్మయి పోస్టు పెట్టింది.
వాళ్ల కోసమే
{{/usCountry}}‘‘విచిత్రం ఏమిటంటే ఆయన (కమల్ హాసన్) సొంత పార్టీలోని ఓ మహిళనే ఆ కవి (వైరముత్తు) వేధింపుల గురించి పబ్లిక్ గా మాట్లాడింది. కానీ చివరకు ఈ మగాళ్లు తమ అన్నదమ్ములు, అంకుల్స్, తండ్రులు, ఫ్రెండ్స్, మెంటర్స్ కోసమే నిలబడతారు. ఎంతమంది మహిళలు మానసికంగా బాధ పడ్డా ఎవరూ పట్టించుకోరు’’ అని చిన్మయి మండిపడింది.
కమల్ అభినందనలు
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వైరముత్తును అభినందిస్తూ కమల్ హాసన్ పోస్టు పెట్టాడు. "సుదీర్ఘమైన, గొప్ప సంప్రదాయం కలిగిన తమిళ సాహిత్యం ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని మూడవసారి అందుకుంది. జయకాంతన్ జ్ఞానపీఠ్ అందుకున్న తర్వాత, తమిళం ఈ గొప్ప గౌరవాన్ని మళ్లీ పొందడానికి పావు శతాబ్దం పట్టింది. నా ప్రియమైన స్నేహితుడు "కవుల చక్రవర్తి" వైరముత్తు ఈ గౌరవాన్ని తమిళానికి తెచ్చారు. నా స్నేహితుడిని అభినందించడానికి నేను గర్వపడుతున్నా’’ అని కమల్ హాసన్ పోస్టు చేశాడు.