తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది. 2016 నుంచి 2022 సంవత్సరాలకు గాను రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2016 నుంచి 2022 వరకు సింగర్ చిన్మయి శ్రీపాద తమిళంలో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా ‘96’ సినిమాలో తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. అయినా అవార్డు మాత్రమే రాలేదు. దీనిపై తాజాగా చిన్మయి రియాక్షన్ తెగ వైరల్ గా మారింది.
అవార్డు రావాల్సిందని

చిన్మయికి అవార్డు రావాల్సిందని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. పొన్నియిన్ సెల్వన్ 1కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ అవార్డుకు ఎంపికయ్యారు. రెహమాన్ కు కంగ్రాచ్యులేట్ చెప్తూ.. ‘‘సర్ దీనికి మీరు పూర్తిగా అర్హులు. అభినందనలు. కానీ 96 సినిమా సాంగ్స్ కు చిన్మయికి అవార్డు రాకపోవడం షాక్ కు గురిచేసింది’’ అని ఆ యూజర్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.
వైరాముత్తు పేరు
చిన్మయికి అవార్డు రాకపోవడం షాకింగ్ గా ఉందంటూ ఆ యూజర్ చేసిన పోస్టుకు చిన్మయి రియాక్టయ్యారు. ‘‘నాకు షాకింక్ గా లేదు. వైరాముత్తు పేరు చెప్పిన తర్వాత కూడా వాళ్లు నాకు అవార్డు ఇచ్చి ఉంటే అప్పుడు షాక్ కు గురయ్యేదాన్ని’’ అని చిన్మయి రియాక్టయింది.
లైంగిక వేధింపులు
వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని 2018లో భారతదేశంలో జరిగిన #MeToo ఉద్యమ సమయంలో చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఇతరులపై వచ్చిన ఆరోపణలను కూడా ఆమె గట్టిగా వినిపించారు. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవిపై ఆరోపణలు చేసిన వాళ్లకు సపోర్ట్ గా నిలిచినందుకు సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్టులు అండ్ డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం (SICTADAU) నుంచి చిన్మయిని తొలగించారు.
చిరంజీవి కామెంట్లపై
{{/usCountry}}వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని 2018లో భారతదేశంలో జరిగిన #MeToo ఉద్యమ సమయంలో చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఇతరులపై వచ్చిన ఆరోపణలను కూడా ఆమె గట్టిగా వినిపించారు. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవిపై ఆరోపణలు చేసిన వాళ్లకు సపోర్ట్ గా నిలిచినందుకు సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్టులు అండ్ డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం (SICTADAU) నుంచి చిన్మయిని తొలగించారు.
చిరంజీవి కామెంట్లపై
{{/usCountry}}రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని, సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిదని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీనిపై రియాక్టయిన చిన్మయి ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఉదాహరణలు కూడా చెప్పారు. ఓ లేడీ మ్యూజిషియన్ కు పురుషాంగం ఫొటో పంపి, మ్యూజిక్ స్టూడియోలోనే లైంగికంగా వేధించారని చిన్మయి వెల్లడించారు. తన తల్లి ఉండగానే తనపై వైరాముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కూడా చిన్మయి మరోసారి గుర్తుచేశారు.
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ట్రోల్స్ వచ్చినా ముందుకు సాగిపోతున్నారు.