Chinna Chinna Aasai Review:

సినిమా : పేరు చిన్న చిన్న ఆశై
నటీనటులు : మధుబాల, ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి తదితరులు
డైరెక్టర్ : వర్ష వాసుదేవ్
రిలీజ్ డేట్ : జూన్ 19, 2026 (థియేటర్), జూలై 28 (ఓటీటీ)
ఓటీటీ : జియోహాట్‌స్టార్, ఆహా వీడియో, సన్ నెక్స్ట్, టెంట్ కోటా, సింప్లీ సౌత్
మలయాళం సినిమాలంటే సహజంగా ఉంటాయి, మానవ సంబంధాలకు చాలా దగ్గరగా ఉంటాయనే పేరు ఉంది. మల్లువుడ్ నుంచి వచ్చే సినిమాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయని కూడా అంటారు. అలాంటి అంచనాల నేపథ్యంలో థియేటర్లలో మంచి హిట్ గా నిలిచిన సినిమా ‘చిన్న చిన్న ఆశై’. ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మధుబాల, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూసేయండి.
ఇంతకీ కథ ఏంటంటే?
పవిత్రమైన వారణాసి నగరం. అక్కడ అనుకోకుండా కలిసే 52 ఏళ్ల విధవ లీల (మధుబాల), రిటైర్డ్ స్కూల్ టీచర్ మాధవన్ (ఇంద్రన్స్). ఒక గ్రూప్ తో కలిసి వారణాసి చూసేందుకు లీల వస్తుంది. ఆమె బ్యాగ్ ను, ఫోన్ ను ఎవరో దొంగిలిస్తారు. దీంతో గ్రూప్ నుంచి ఆమె తప్పిపోతుంది. మరోవైపు బెనారస్ యూనివర్సిటీలో కథక్ మాస్టర్స్ చేస్తున్న తన కూతురు జానకీ (అపర్ణ బాలమురళి) కోసం మాధవన్ తరుచుగా వారణాసికి వస్తుంటాడు.
వారణాసిలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్న లీలను మాధవన్ చూస్తాడు. ఆమెను తన గ్రూప్ దగ్గరకు తిరిగి చేర్చేందుకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే లీల, మాధవన్ మధ్య ఊహించని బంధం ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? లీల, మాధవన్ కలిసే ఉన్నారా? క్లైమాక్స్ లో వచ్చే మనసును పిండేసే సీన్ ఏంటీ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
{{/usCountry}}వారణాసిలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్న లీలను మాధవన్ చూస్తాడు. ఆమెను తన గ్రూప్ దగ్గరకు తిరిగి చేర్చేందుకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే లీల, మాధవన్ మధ్య ఊహించని బంధం ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? లీల, మాధవన్ కలిసే ఉన్నారా? క్లైమాక్స్ లో వచ్చే మనసును పిండేసే సీన్ ఏంటీ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
{{/usCountry}}జీవితంలో ఎన్నో కష్టాలు చూశాక మలి దశలో మనసు ఓ తోడు కోరుకోవాలనుకోవడం, మలి ప్రేమను పొందాలనుకోవడం ఎలా ఉంటుందో ‘చిన్న చిన్న ఆశై’ సినిమాలో మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడాదిన్నరకే కూతురిని చేతుల్లో పెట్టి చనిపోతే ఒంటరిగా మారే మాధవన్ ఓ వైపు.. అప్పటికే ఓ కొడుకు ఉన్న వ్యక్తికి రెండో భార్యగా వెళ్లి, చివరకు విధవగా మారిన లీల మరో వైపు.
లీల, మాధవన్ కథలు వేరు. కానీ వీళ్ల ఇద్దరి మనసులు కోరుకున్నది ఒక్కటే. లీల తన గ్రూప్ తో కలిసి వారణాసి చేరడంతో సినిమా మొదలవుతుంది. గంగా నదిలో చిన్నపిల్లాడిలా కాగితం పడవలు వేస్తున్న సీన్ తో మాధవన్ మనసు ఎంత స్వచ్ఛమైందో తెలుస్తుంది. గ్రూప్ నుంచి తప్పిపోయిన లీలను మాధవన్ కలవడంతో కథ స్పీడ్ అందుకుంటుంది.
తమిళనాడులోని తంజావురుకు చెందిన లీలాకు ఏమో తమిళం మాత్రమే వచ్చు. కేరళానికి చెందిన మాధవన్ అడ్జస్ట్ చేసుకుంటూ మాట్లాడతాడు. భాష ప్రాబ్లం అయినా వాళ్ల కళ్లతోనే భావాలు పలికించారు.గంగా హారతికి గ్రూప్ ఎలా అయినా వస్తుందని, అప్పటివరకూ టైమ్ ఉందని లీల, మాధవన్ కలిసి చుట్టుపక్కల తిరుగుతారు.
సెకండాఫ్ లో తన గ్రూప్ కనిపించినా కూడా లీల వాళ్లతో వెళ్లదు. తిరిగి మాధవన్ ఆమె చేతిని పట్టుకుంటాడు. లీల చెప్పును మాధవన్ కుట్టించడం, తన కూతురు కోసం చీర సెలెక్ట్ చేయమనడం, ఆ చీరను లీల కట్టుకుని చూపించడం, తలలోకి పూలు కొనివ్వడం ఇలా కొన్ని సీన్లు మనసుకు తాకుతాయి. మనసు విప్పి కొత్తగా రెక్కలు వచ్చినట్లు ఆఖర్లో లీల డాన్స్ చేయడం హైలైట్. క్లైమాక్స్ మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. అందరినీ ఏడిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
చిన్న చిన్న ఆశై సినిమా మొత్తం మధుబాల, ఇంద్రన్స్ చుట్టూనే తిరుగుతుంది. రోజా సినిమాలోని చిన్న చిన్న ఆశై సాంగ్ లో మధుబాల చేసింది. ఇప్పుడు అదే టైటిిల్ తో వచ్చిన ఈ సినిమాలో మధుబాల చాలా బాగా యాక్ట్ చేసింది. మనసులో కల్లోల తుపాను దాచుకొని, తనలోని భావాలను చెప్పాలో లేదో తెలియని మహిళగా పరిణతి ప్రదర్శించింది.
ఇక ఇంద్రన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ నటుడు తనకు దొరికిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సినిమాలో జీవించేశాడు.
టెక్నికల్ గా
టెక్నికల్ పరంగా చూసుకుంటే డైరెక్టర్ వర్ష వాసుదేవ్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించింది. 34 ఏళ్ల వర్షకు డైరెక్టర్ గా ఇదే తొలి సినిమా. ఓ షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో వర్ష ఈ స్థాయిలో ఫీచర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. ఇక వారణాసి వాతావరణాన్ని కెమెరా బాగా చూపించింది. అలాగే మూడ్ కు తగ్గట్లు సాగే మ్యాజిక్ కూడా బాగుంది.
ఇవే మైనస్
చిన్న చిన్న ఆశై అనేది ఫీల్ గుడ్ మూవీ. కానీ ఓటీటీలో తెలుగు డబ్బింగ్ లో సినిమా ఉన్నా లీల డైలాగ్ లు అన్నీ తమిళంలోనే ఉంటాయి. ఇదే పెద్ద మైనస్. ఇక మూవీ నరేషన్ స్లోగా ఉంటుంది.
ఫైనల్ గా
మలయాళంలో ఫీల్ గుడ్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి మనసును తాకే సినిమానే ఈ చిన్న చిన్న ఆశై. ఓపికతో చూస్తే మాత్రం కచ్చితంగా ఆకట్టుకునే చిత్రం. కమర్షియల్ అంశాలకు పూర్తి దూరంగా సాగుతుంది.