...
...
Next Story

OTT Mayalam: వారణాసిలో పరిచయం.. ఒకే రోజులో మారే జీవితం.. ఇవాళ తెలుగులో మూడు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం హార్ట్ టచింగ్ మూవీ

OTT Mayalam: మధుబాల, ఇంద్రన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా 'చిన్న చిన్న ఆశై' నేటి నుంచి (జూలై 28) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒకే రోజు మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్, ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Jul 28, 2026, 09:42:10 IST
Advertisement

OTT Mayalam: నేటి డిజిటల్ యుగంలో క్రైమ్, డార్క్ థ్రిల్లర్ల సందడి ఎక్కువైన వేళ.. మనసుకు హాయినిచ్చే ఆత్మీయమైన ఎమోషనల్ డ్రామాలకు ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సరిగ్గా అలాంటి ఒక మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'చిన్న చిన్న ఆశై' (Chinna Chinna Aasai).

చిన్న చిన్న ఆశై ఓటీటీ

వారణాసిలో పరిచయం.. ఒకే రోజులో మారే జీవితం.. ఇవాళ తెలుగులో మూడు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం హార్ట్ టచింగ్ మూవీ
వారణాసిలో పరిచయం.. ఒకే రోజులో మారే జీవితం.. ఇవాళ తెలుగులో మూడు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం హార్ట్ టచింగ్ మూవీ

ప్రముఖ నటి మధుబాల (Madhoo), మలయాళ దిగ్గజ నటుడు ఇంద్రన్స్ (Indrans) ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్ గుడ్ డ్రామా ‘చిన్న చిన్న ఆశై’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మూవీ ఇవాళ ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటి నుంచి (జూలై 28) ప్రముఖ ఓటీటీ వేదికలైన 'జియోహాట్‌స్టార్' (JioHotstar), 'ఆహా' (Aha), 'సింప్లీ సౌత్' (Simply South) లలో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.

జియోహాట్‌స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో చిన్న చిన్న ఆశై రిలీజ్ అయింది. ఆహాలో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది. సింప్లీ సౌత్ లో మలయాళం, తమిళ భాషల్లో విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'రోజా' నాటి జ్ఞాపకాలు

1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ 'రోజా'లో మధుబాల నటించిన ఐకానిక్ 'చిన్న చిన్న ఆశై' పాటను గుర్తుచేసేలా ఈ చిత్రానికి టైటిల్ పెట్టడం విశేషం. షార్ట్ ఫిల్మ్ 'ఎంటే నారాయణిక్కు' ద్వారా ప్రశంసలు పొందిన వర్ష వాసుదేవ్.. ఈ చిత్రంతో ఫీచర్ ఫిలిం దర్శకురాలిగా పరిచయమయ్యారు.

వారణాసిలో

దీంతో గంగా ఘాట్‌ వద్ద నిస్సహాయంగా మిగిలిపోతుంది లీల. ఆ సమయంలో కేరళకు చెందిన రిటైర్డ్ స్కూల్ టీచర్ మాధవన్ (ఇంద్రన్స్) ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు.

భాషలు వేరైనా.. పెనవేసుకున్న బంధం!

లీలకు కేవలం తమిళం, మాధవన్‌కు మలయాళం మాత్రమే వచ్చు. భాషల సరిహద్దులు ఉన్నప్పటికీ, వారాణసి వీధుల్లో వారు చేసే ప్రయాణంలో మాటల కంటే మౌనం, పరస్పర అవగాహనే ప్రధాన పాత్ర పోషిస్తాయి. నిరాశతో నిండిన లీల జీవితంలోకి స్వేచ్ఛాజీవి అయిన మాధవన్ రాక ఎలాంటి మార్పు తెచ్చిందనేది ఆసక్తి కలిగిస్తుంది. నెరవేరని చిన్న చిన్న ఆశలు, మానవ సంబంధాల విలువను ఈ చిత్రం అత్యంత భావోద్వేగ భరితంగా ఆవిష్కరించింది.

ఫీల్ గుడ్

బాబుజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభిజిత్ బాబుజీ నిర్మించిన ఈ చిత్రానికి ఫైజ్ సిద్ధిక్ ఛాయాగ్రహణం, 'తైక్కుడం బ్రిడ్జ్' ఫేమ్ గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. గంగా నది తీరంలో తీర్చిదిద్దిన విజువల్స్, మనసును తాకే మ్యూజిక్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాలకు భిన్నంగా కామ్‌గా, ఎమోషనల్‌గా సాగే క్లాసిక్ సినిమాలను ఇష్టపడే వారికి 'చిన్న చిన్న ఆశై' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe