Star Maa New Serial: కుటుంబ బంధాలు, ప్రేమ, ప్రతీకారం వంటి అంశాలకు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ విశేష ఆదరణ ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను బలంగా పట్టుకుని 'చిన్ని చిన్ని ఆశ' కథను తీర్చిదిద్దినట్లు తాజా అప్‌డేట్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఒకరి అపారమైన ప్రేమకు, మరొకరి అంతులేని ద్వేషానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సీరియల్ కు ప్రధాన బలంగా నిలవనుంది.
చిన్ని చిన్ని ఆశ సీరియల్

మనిషి జీవితంలో ప్రేమ ఎంత బలాన్నిస్తుందో, ద్వేషం అంతే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు విరుద్ధమైన భావోద్వేగాలు ఎదురుపడినప్పుడు సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే కోణంలో చిన్ని చిన్ని ఆశ సీరియల్ కథనం ఆసక్తికరంగా సాగనుందని తెలుస్తోంది. ప్రారంభం నుంచే ప్రేక్షకులను కథలో లీనం చేసేలా బలమైన ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది.
సిరి, వెన్నెల జీవితాలు
ఈ చిన్ని చిన్ని ఆశ సీరియల్‌లో కథ ప్రధానంగా నాలుగు కీలక పాత్రల చుట్టూ తిరగనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. సిరి, వెన్నెల అనే ఇద్దరు సిస్టర్స్ జీవితాల్లోకి విష్ణు, అభిరామ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడంతో కథ కొత్త మలుపు తిరగనుంది. వీరి నలుగురి మధ్య ఉండే బంధం, సంఘర్షణ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉండనుంది.
సిరి, వెన్నెల జీవితాల్లో విష్ణు, అభిరామ్ ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు? వీరిలో ఎవరిది నిస్వార్థమైన ప్రేమ, ఎవరిది అంతులేని ద్వేషం? అనే ప్రశ్నలు ఇప్పుడు బుల్లితెర అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్ట్‌లతో ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసేలా స్టార్ మా సీరియల్ మేకర్స్ ఈ పాత్రలను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.
ఈ రంగులరాట్నం ఎక్కడ ఆగుతుంది?
జీవితంలోని సుఖదుఃఖాలను, ఊహించని మలుపులను 'రంగులరాట్నం'తో పోలుస్తూ మేకర్స్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ చిన్ని చిన్ని ఆశ సీరియల్‌పై అంచనాలను మరింత పెంచింది. ఒకసారి మొదలైన ఈ భావోద్వేగాల ప్రయాణం ఎటువైపు దారితీస్తుంది, ఈ రంగులరాట్నం చివరకు ఎక్కడ ఆగుతుంది అనేది అసలు సస్పెన్స్‌గా మారింది.
{{/usCountry}}జీవితంలోని సుఖదుఃఖాలను, ఊహించని మలుపులను 'రంగులరాట్నం'తో పోలుస్తూ మేకర్స్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ చిన్ని చిన్ని ఆశ సీరియల్‌పై అంచనాలను మరింత పెంచింది. ఒకసారి మొదలైన ఈ భావోద్వేగాల ప్రయాణం ఎటువైపు దారితీస్తుంది, ఈ రంగులరాట్నం చివరకు ఎక్కడ ఆగుతుంది అనేది అసలు సస్పెన్స్‌గా మారింది.
{{/usCountry}}ఈ చిన్ని చిన్ని ఆశ సీరియల్ లో పృథ్వీరాజ్, శరత్ హీరోలుగా, ఆరాధన భట్, అక్షయ రాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రసార తేదీ, టైమ్ స్లాట్
స్టార్ మాలో ఇప్పటికే పలు ప్రైమ్ టైమ్ సీరియల్స్ భారీ టీఆర్పీలతో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి 'చిన్ని చిన్ని ఆశ' కూడా చేరనుండటంతో ఈ కొత్త సీరియల్ ఏ టైమ్ స్లాట్‌లో ప్రసారం కానుంది అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం 'త్వరలో మీ ముందుకు' అంటూ అధికారికంగా ప్రకటించిన ఛానల్ యాజమాన్యం.. త్వరలోనే ప్రసార తేదీ, సమయాన్ని వెల్లడించనుంది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.