ఏ సినిమా ఇండస్ట్రీ అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో ఈ హాట్ టాపిక్ పై చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమీ ఉండవని, అది మీ ప్రవర్తనను బట్టే ఉంటుందని అనడం గమనార్హం.
క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి ఏమన్నాడంటే?

మన శంకరవరప్రసాద్ గారు మెగా బ్లాక్‌బస్టర్ కావడంతో హైదరాబాద్ లో ఆదివారం (జనవరి 25) రాత్రి సక్సెెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడాడు. తన కూతురినే ఉదాహరణగా చెబుతూ.. ఇక్కడ ఎవరైనా రాణిస్తారని అన్నాడు.
“ఇండస్ట్రీలో ఆడయినా, మగయినా రాణించాలంటే కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు.. ఎవరైనా నెగటివ్ పీపుల్ ఉన్నారు.. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటే అది నీ తప్పిదం అవుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్ గా ఉండి, సీరియస్ గా ఉంటే ఎవడూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు. క్యాస్ట్ కౌచ్ లాంటివేమీ ఉండవు. నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది. నీ అభద్రతాభావమది. అలాగే ఉండాలేమో అనుకుంటారు. కానీ అలా కాదు. నువ్వు ప్రొఫెషనల్ గా ఉండు.. అవతలి వాళ్లు ప్రొఫెషనల్ గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అద్దంలాంటిది. నువ్వు ఏమిస్తావో.. నీకు తిరిగి అదే వస్తుంది. ఇండస్ట్రీలోకి రావాలంటే కృత నిశ్చయంతో, హార్డ్ వర్క్ నమ్ముకొని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు రాణిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత. అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దత్ లాంటి వాళ్లు కూడా” అని చిరంజీవి అన్నాడు.
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ కలెక్షన్లు
చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. 14 రోజులు అయినా కూడా తగ్గేదే లేదంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్ల దిశగా వెళ్తోంది. రెండో ఆదివారం కూడా బుక్ మై షోలో లక్షా 21 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది.
{{/usCountry}}చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. 14 రోజులు అయినా కూడా తగ్గేదే లేదంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్ల దిశగా వెళ్తోంది. రెండో ఆదివారం కూడా బుక్ మై షోలో లక్షా 21 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది.
{{/usCountry}}