Chiranjeevi On Bharathiraja: భారతీరాజా మరణం.. మెగాస్టార్ ఎమోషనల్.. చిరంజీవి 'పులిరాజు' వెనుక అసలు కథ తెలుసా?
Chiranjeevi On Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆరాధన' సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించిన ఆ 'దర్శక శిఖరం'తో తనకున్న అనుబంధాన్ని, ట్రేడ్ రికార్డులను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
Chiranjeevi On Bharathiraja: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని, గ్రామీణ మార్కు సినిమాల సృజనశీలిని కోల్పోయింది. లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన మరణం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఈ దిగ్గజ దర్శకుడి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

దర్శక శిఖరం భారతీరాజా
పల్లెటూరి మట్టి సువాసనలను వెండితెరపై ఆవిష్కరించి, సామాన్యుల జీవితాలను కావ్యాలుగా మలిచిన దర్శకుడు భారతీరాజా అని చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ 'ఇయక్కునర్ ఇమయం' (దర్శక శిఖరం) మృతి పట్ల మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఆరాధనలో పులిరాజుగా
భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి ‘ఆరాధన’ సినిమా చేశారు. ఇందులో పులిరాజు క్యారెక్టర్ ప్లే చేశారు మెగాస్టార్. భారతీరాజా మరణించిన వేళ ఆ సినిమాను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
"ఆరాధన సినిమాలో 'పులిరాజు'గా ఆయన (భారతీరాజా) దర్శకత్వంలో పనిచేసే భాగ్యం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అంకితభావం, సింప్లిసిటీ, తన పని పట్ల ఆయన చూపించిన తపన నాపై చెరపలేని ముద్ర వేసాయి" అని చిరంజీవి ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఎప్పటికీ సజీవంగా
‘‘భారత సినిమా ఓ గొప్ప స్టోరీ టెల్లర్ భారతీరాజాను కోల్పోయింది. పల్లె మట్టి వాసనను, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమ అమాయకత్వాన్ని, సాధారణ ప్రజల భావోద్వేగాలను ఆయన ఎప్పటికీ చెదిరిపోని సినిమా కవిత్వంగా మార్చారు. ఆయన సినిమాలు లక్షలాది ప్రజల హృదయాలను తాకాయి. కొన్ని తరాల దర్శకులకు స్ఫూర్తి కలిగించాయి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
భారతీరాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా, పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఆయన భారతీయ సినిమాకు అందించిన క్లాసిక్స్ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని చిరు తెలిపారు. "దర్శక శిఖరం భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని చిరంజీవి తన పోస్టు ముగించారు.
'ఆరాధన'.. పులిరాజు క్యారెక్టర్ వెనుక కథ
చిరంజీవి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న 1987వ సంవత్సరంలో వచ్చిన 'ఆరాధన' (Aradhana Movie) ఒక విలక్షణమైన ప్రయోగం. తమిళంలో విజయవంతమైన 'కడలోర కవిదైగళ్' సినిమాకు ఇది రీమేక్. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా రియలిస్టిక్ పంథాలో సాగే ఈ కథలో చిరంజీవిని 'పులిరాజు' అనే రౌడీ పాత్రలో భారతీరాజా చూపించిన విధానం అప్పట్లో ఒక సంచలనం.
సాధారణంగా రీమేక్ సినిమాల్లో ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది అంటారు. కానీ భారతీరాజా నెల్లూరు పల్లెటూరి నేపథ్యంలో ఆరాధనను తెరకెక్కించి తెలుగు నేటివిటీని అద్భుతంగా పట్టుకున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం, ముఖ్యంగా 'జీవితమే ఒక ఆట' పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్. భారతీరాజా ఆస్థాన నటి రాధిక ఇందులో హీరోయిన్‌గా నటించడం విశేషం.
People Also Ask
ప్రశ్న: భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ఏది?
జవాబు: మెగాస్టార్ చిరంజీవి, రాధిక కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ మూవీ 'ఆరాధన' (1987). ఇందులో చిరంజీవి పోషించిన 'పులిరాజు' అనే రఫ్ అండ్ రగ్గడ్ క్యారెక్టర్‌కు అప్పట్లో థియేటర్లలో భారీ రెస్పాన్స్ వచ్చింది.
ప్రశ్న: ఆరాధన సినిమా ఓటీటీలో ఎక్కడ అందుబాటులో ఉంది?
జవాబు: చిరంజీవి-భారతీరాజా ల్యాండ్‌మార్క్ మూవీ 'ఆరాధన' ప్రస్తుతం యూట్యూబ్ లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రశ్న: తమిళ చిత్ర పరిశ్రమలో భారతీరాజాను ఏమని పిలుస్తారు?
జవాబు: తమిళ చిత్రసీమను స్టూడియోల నుంచి సహజసిద్ధమైన పల్లెటూరి లోకేషన్లకు తీసుకెళ్లినందుకు గానూ ఆయనను గౌరవంగా "ఇయక్కునర్ ఇమయం" అంటే తెలుగులో "దర్శక శిఖరం" అని పిలుస్తారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


