మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 11) తాను మొదటిసారిగా 'పునాదిరాళ్లు' సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చానని చెబుతూ, నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
"ఆ అనుభూతి వర్ణనాతీతం.."

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి బుధవారం (ఫిబ్రవరి 11) నోస్టాల్జియాలో మునిగిపోయాడు. తన సినీ కెరీర్ ఆరంభ రోజులను గుర్తుచేసుకుంటూ 'ఎక్స్' వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఈరోజే తాను తొలిసారిగా ముఖానికి రంగేసుకుని కెమెరాను ఫేస్ చేశానని అతడు తెలిపాడు.
తన మొదటి సినిమా 'పునాదిరాళ్లు' (Punadhirallu) షూటింగ్ స్పాట్ ఫోటోలను షేర్ చేస్తూ చిరంజీవి ఇలా రాసుకొచ్చాడు. "ఈ రోజు నా జీవితంలో తొలిసారిగా 'పునాదిరాళ్లు' సినిమా కోసం కెమెరా ముందు నిలబడ్డాను. ఆ రోజు నాలో కలిగిన ఉత్సాహం, ఆనందం, బాధ్యత, భావోద్వేగాలు మాటల్లో చెప్పలేనివి. ఆ క్షణం నిన్ననో, మొన్ననో జరిగినట్లు అనిపిస్తోంది. ఇదొక అందమైన పౌర్ణమి కథలాంటి అనుభవం" అని చిరు అన్నాడు.
తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకు చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. వారి నమ్మకం, ప్రోత్సాహమే తన నట ప్రయాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని అన్నాడు. ఆ రోజు నుంచి నేటి వరకు తనను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
47 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..
'పునాదిరాళ్లు'తో మొదలైన చిరంజీవి ప్రస్థానం 'ఖైదీ' (1983)తో మలుపు తిరిగింది. ఇంద్ర, ఠాగూర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లను చిరంజీవి అందించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
{{/usCountry}}'పునాదిరాళ్లు'తో మొదలైన చిరంజీవి ప్రస్థానం 'ఖైదీ' (1983)తో మలుపు తిరిగింది. ఇంద్ర, ఠాగూర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లను చిరంజీవి అందించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
{{/usCountry}}జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఎన్‌ఎస్‌జీ (NSG) ఆఫీసర్‌గా చిరంజీవి, తన విడిపోయిన భార్య (నయనతార), కూతురును కాపాడుకునే క్రమంలో సాగే కథ ఇది. ఈ సినిమా విడుదలై 25 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.