Chiranjeevi Samantha: సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కావడం వేరు, ఒక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ కేవలం మూడు రోజుల్లోనే రూ.43 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం వేరు. సమంత (Samantha) బ్రేక్ తర్వాత సరికొత్త ఎనర్జీతో రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. తాజాగా మూవీ యూనిట్ ను మెగాస్టార్ అభినందించడం వైరల్ గా మారింది.
మెగాస్టార్ ఇంట్లో బంగారం

మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ కు చిరంజీవి, సురేఖ దంపతులు ఫిదా అయ్యారు. హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డిని ఇంటికి పిలిపించుకొని మరీ ప్రశంసించారు.
అపురూపమైన కానుక
ఈ సందర్భంగా చిరంజీవి, సురేఖ దంపతులు చిత్ర యూనిట్‌ను శాలువాలతో సత్కరించడమే కాకుండా, సమంతకు సాంప్రదాయబద్ధంగా ‘సారె’ పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఆచారంలో ఒక ఆడబిడ్డ అసాధారణ విజయాన్ని సాధించినప్పుడు లేదా ఒక పెద్ద మైల్‌స్టోన్ రీచ్ అయినప్పుడు ఇంట్లోని పెద్దలు పట్టుచీర, తాంబూలంతో పాటు మంగళకరమైన వస్తువులను ‘సారె’గా ఇస్తారు. అంతేకాకుండా ఇప్పుడు సామ్ ప్రెగ్నెంట్ అనే న్యూస్ వినిపిస్తున్నాయి.
వైరల్ గా ఫొటోలు
సమంత తన వ్యక్తిగత హెల్త్ స్ట్రగుల్స్ దాటుకుని, సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై మా ఇంటి బంగారంతో భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మెగాస్టార్ దంపతులు సమంతకు ఒక కాస్ట్లీ పట్టుచీరతో పాటు పవిత్రమైన ‘పూజ శంఖం’ బహుమతిగా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ యాక్టర్ ఫ్యామిలీ.. ఒక స్టార్ హీరోయిన్ను తమ సొంత ఆడబిడ్డలా భావించి ఇలా ఇంటికి పిలిచి గౌరవించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3 ఏళ్ల బ్రేక్.. రూ.43 కోట్ల రికవరీ!
{{/usCountry}}సమంత తన వ్యక్తిగత హెల్త్ స్ట్రగుల్స్ దాటుకుని, సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై మా ఇంటి బంగారంతో భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మెగాస్టార్ దంపతులు సమంతకు ఒక కాస్ట్లీ పట్టుచీరతో పాటు పవిత్రమైన ‘పూజ శంఖం’ బహుమతిగా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ యాక్టర్ ఫ్యామిలీ.. ఒక స్టార్ హీరోయిన్ను తమ సొంత ఆడబిడ్డలా భావించి ఇలా ఇంటికి పిలిచి గౌరవించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3 ఏళ్ల బ్రేక్.. రూ.43 కోట్ల రికవరీ!
{{/usCountry}}ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. సౌత్ ఇండియా సినిమాల్లో నయనతార తర్వాత సోలో మార్కెట్‌తో థియేట్రికల్ బిజినెస్‌ను శాసించగల కెపాసిటీ సమంతకు మాత్రమే ఉందని 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు నిరూపించాయి. సాధారణంగా ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీకి థియేట్రికల్ రన్ వీక్ గా ఉంటుందనే అపోహను నందిని రెడ్డి మేకింగ్ స్టైల్ బ్రేక్ చేసింది.
మా ఇంటి బంగారం చిత్రం థియేటర్ల కలెక్షన్ల ద్వారానే కాకుండా.. సాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సామ్ మూడేళ్ల బ్రేక్ తర్వాత చేసిన మూవీ ఇది.
సమంత గుడ్ న్యూస్ ట్రెండ్
మెగాస్టార్ ఇచ్చిన సారె ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఎక్స్‌లో రకరకాలుగా స్పందిస్తున్నారు. సాధారణంగా పెళ్లయిన ఆడబిడ్డలకు లేదా ప్రెగ్నెన్సీ సమయంలో పెట్టే సారె తరహాలో ఈ గిఫ్ట్ ఉండటంతో సమంత గుడ్ న్యూస్ అనేది ట్రెండింగ్ గా మారింది. రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించిన సంగతి తెలిసిందే.