chiranjeevi: చరణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. చిరంజీవి కామెంట్లు ప్లస్ అయ్యేనా? చరణ్‌జీవి అన్న బుచ్చిబాబు

chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. పెద్ది మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ ఫిదా అయిపోయారు. తాజాగా పెద్ది మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ తో మెగాస్టార్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్‌జీవి అంటూ బుచ్చిబాబు కామెంట్ కూడా చక్కర్లు కొడుతోంది.

Published on: Jun 13, 2026, 19:40:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

chiranjeevi: పెద్ది మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. తన కొడుకు రామ్ చరణ్ యాక్టింగ్ పట్ల గర్వం వ్యక్తం చేశారు. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తాజాగా పెద్ది మేకర్స్ తో ఇంటరాక్షన్ లో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చిరు కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.

చరణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. చిరంజీవి కామెంట్లు వైరల్
చరణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. చిరంజీవి కామెంట్లు వైరల్

రామ్ చరణ్ గురించి

పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. ఎంతో గర్వంగా ఉందన్నారు. పుత్రోత్సాహం కలిగిందని సంతోషంగా చెప్పుకొచ్చారు. ‘‘పెద్ది మూవీ ఎమోషనల్ జర్నీ చేయించింది. రోలర్ కోస్టర్ లా సాగింది. హాస్పిటల్ సీన్ తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చరణ్ నటించడం కాదు జీవించేశాడు’’ అని చిరంజీవి చెప్పారు.

తక్కువ మాట్లాడితే

‘‘ఒక తండ్రిగా ఒక నటుడిగా, నటుడు అంటే మళ్లీ సీనియర్ నటుడు కాదు. ఇప్పుడు సమకాలీన నటుడిగా నాకు చరణ్ నిజంగా గర్వ కారణం. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రేక్షకులే నా బిడ్డ గురించి మాట్లాడారు. పుత్రోత్సాహం పద్యం గుర్తుకొస్తుంది. దాని అర్థం అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. నా కొడుకు పట్ల గర్వపడుతున్నా’’ అని చిరంజీవి పొంగిపోయారు.

చరణ్ ను చూడలేదు

‘‘సినిమాలో చరణ్ ను చూడలేదు. పెద్ది క్యారెక్టర్ మాత్రమే చూశా. కళ్లతో ఎక్స్ ప్రెషన్స్ పలికించాడు. క్యారెక్టర్ ఏడుస్తూ.. మనల్ని ఏడిపించడం నటన. కానీ క్యారెక్టర్ ఏడవకుండా ఏడిపించడం అంటే జీవించడమే. చరణ్ అదే చేశాడు. పాత్రలో చరణ్ ఒదిగిపోయాడు. అప్పలసూరి మరణం నుంచి పెద్ది మోటివేట్ అయిన విధానం అదిరిపోయింది’’ అని మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.

చరణ్‌జీవి

ఇదే ఇంటర్వ్యూలో ఉన్న బుచ్చిబాబు చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారాయి. ముఖ్యంగా చరణ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని, చరణ్‌జీవి అంటున్నారని బుచ్చిబాబు చెప్పిన మాటలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న రిలీజైన సంగతి తెలిసిందే.

ప్లస్ అయ్యేనా?

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన పెద్ది ఫస్ట్ వీక్ లో బాగానే అదరగొట్టింది. కానీ నెగెటివ్ ప్రచారం, జాన్వీ కపూర్ వివాదం ఈ మూవీపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలున్నాయి. ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.

2026లో సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా పెద్ది నిలిచిందని మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే పెద్ది బాక్సాఫీస్ రన్ ఇప్పుడు కాస్త స్లో అయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటర్వ్యూ ఈ మూవీకి ప్లస్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ కామెంట్లతో మరోసారి పెద్ది చిత్రంపై హైప్ క్రియేట్ అవుతోందని అంటున్నారు.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు

  1. పెద్ది మూవీ ఎప్పుడు రిలీజైంది?

పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

2. పెద్ది సినిమాకు ఎన్నికలెక్షన్లు వచ్చాయి?

పెద్ది చిత్రం 9 రోజుల్లో రూ.366 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.

3. పెద్దిని ఫ్యామిలీతో చూడొచ్చా?

అవును, పెద్ది సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. ఇందులో కొన్ని ఇబ్బంది అనిపించే సీన్లను మేకర్స్ తొలగించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More